తండ్రి చనిపోయిన రోజే అంత బాధలో కూడా 3ఏళ్ళ చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించి చిన్నారికి ప్రాణం పోసిన మహేష్ బాబు

అవసరం ఉన్నప్పుడు సాయం చేస్తే దేవుడు అంటాం.. ఇక కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేస్తే.. మీ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేం అంటాం. కానీ కృష్ణ మరణం రోజు మహేష్ బాబు చేసిన మంచిని వర్ణించడానికి కవులకు సైతం మాటలు చాలవు. అవును తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నా కానీ.. తన గొప్ప మనసు చాటుకున్నారు ప్రిన్స్ మహేశ్ బాబు. సాయం కోరి తలుపు తట్టిన చిన్నారికి ఇంత దుఃఖంలోనూ నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ లు చేయించింది ఒకెత్తు అయితే.. తాజాగా ఓ చిన్నారికి ప్రాణం పోసింది మరో ఎత్తు. గుండె పోటుతో కృష్ణ మరణించిన రోజే.. మరో గుండెకు ప్రాణం పోశారు మహేశ్ బాబు.

మరిన్ని వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో శోక సంద్రంలో మునిగిపోయారు మహేశ్ బాబు కుటుంబ సభ్యులు, తెలుగు సినీ ప్రియులు. ఆదివారం అర్దరాత్రి సూపర్ స్టార్ కృష్ణకు గుండె పోటు రావడంతో హాస్పిటల్ తరలించారు. ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం తెల్లవారు జామున కృష్ణ తుది శ్వాస విడిచారు. అయితే ఇదే రోజు మరో చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టారు మహేశ్ బాబు. మహేశ్ బాబు పౌండేషన్ ద్వారా ఆంధ్ర హాస్పిటల్స్ లో ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ లు చేయిస్తున్న సంగతి మనందరికి తెలిసిందే.

కానీ తాజాగా మహేశ్ చేసిన పనికి అభిమానులతో పాటు సగటు మానవుడు సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురానికి చెందిన మోక్షిత్ సాయికి 3 సంవత్సరాలు చిన్నతం నుంచే గుండెలో రంధ్రం ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. దాంతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురైయ్యారు. వారికి ఏమి చేయాలో తోచలేదు. ఈ సమయంలో వారికి దేవుడు గుర్తుకు రాలేదు.. హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు గుర్తుకు వచ్చారు. అవును ఎంతో మంది చిన్నారులకు ఆపరేషన్ లు చేయించి వారి ప్రాణాలు కాపాడుతున్న మహేశ్ బాబే వారికి దేవుడిలా కనిపించారు. వెంటనే వారు తమ బాబును తీసుకిని ఆంధ్ర హాస్పిటల్ కు వచ్చారు. కానీ ఇక్కడే ఓ పెద్ద కష్టం వచ్చింది.

తల్లిదండ్రులు పిల్లాడిని హాస్పిటల్ కి తీసుకొచ్చిన రోజే సూపర్ స్టార్ కృష్ణ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. ఈ విషయం తెలిసిన పిల్లాడి తల్లిదండ్రులకు గుండె ఆగినంత పనైంది. తమ పిల్లాడిని పట్టించుకుంటారో లేదో అని.. కానీ మహేశ్ స్థానంలో వేరే వారు ఉంటే ఏం జరిగేదో తెలీదు కానీ.. పుట్టెడు దుఃఖంలో సైతం ఆ చిన్నారికి ఆపరేషన్ చేయించాడు. దాంతో ఆ తల్లిదండ్రుల ఆనందం వ్యక్తం చేశారు. అంత దుఃఖంలోనూ మాకు సాయం సాయం చేసిన ఆయన నిజంగా దేవుడు అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ విషయం తెలుసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ మీరు నిజంగా సూపర్ స్టార్ అంటూ ప్రశంసిస్తున్నారు. తన తండ్రి గుండె ఆగిపోయినా గానీ కష్టాల్లో ఉన్న ఏ చిన్నారి గుండె ఆగిపోకూడదు అని నిర్ణయించుకున్న మహేశ్ ఆలోచనకు నిజంగా హ్యాట్సాఫ్ అంటున్నారు అభిమానులు.