తిరుమల గర్భ గుడిలో కనివిని ఎరుగని మహా అద్భుతం.! చూసి ఆశ్చర్యపోతున్న గుడి పూజారులు.

తిరుమల తిరుపతి అనగానే అందరికీ పవిత్రమైన భావన కలుగుతుంది. దేశవిదేశాల్లో ఉండే ఎక్కడెక్కడి వారు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల వారు, తమిళనాడుకు చెందిన వారు ఎక్కువగా తిరుపతి వస్తూ ఉంటారు. తిరుపతి యాత్ర అనేది జీవితంలో ఒకసారైనా చెయ్యని హిందువు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి లీలలు అనేకం కనిపిస్తూ ఉంటాయి.

ఏడు కొండల పైన ఎంతో విలువైన ఔషధ గుణాలు గల వృక్ష సంపద ఉంది. ఈ ఆలయం కలియుగం యొక్క కష్టాలు నుండి మానవాళిని రక్షించడానికి ఇక్కడ దర్శనమిచ్చినట్లు విశ్వసించబడే విష్ణువు అవతారమైన వేంకటేశ్వరుని రూపంలో శ్రీదేవి, భూదేవి సహితంగా కొలువున్నాడు. నిత్యం భక్తులు సమర్పించే తలనీలాలు, నిలువుదోపిడీలతో స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది.

పద్మావతి దేవిని పెళ్లి చేసుకోవడానికి అప్పుగా డబ్బులు ఇచ్చిన కుబేరునికి నిత్యం వడ్డీ కడుతుంటాడని వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసుల వాడు అంటారు. ఈ ఆలయం శేషాచలం కొండలలో భాగమైన తిరుమల కొండలపై 853 మీటర్ల ఎత్తులో ఉంది మరియు ఆలయ నిర్మాణం ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. అయితే చాలామంది శ్రీవారి పాదాల కింద నుండి ఒక నది పారుతుంది అంటారు. అది నిజమే కానీ ఒకప్పుడు ఆలయ నిర్మాణం చేసినప్పుడు పెద్ద పెద్ద రాళ్లతో నిర్మాణం చాలా పకడ్బందీగా కట్టారు.

అందుకే పెద్ద వర్షాలు పడినప్పుడు కొండపైనుండి వచ్చే నీళ్ళు గర్భగుడిలోని నిల్వ ఉండేవి. అప్పుడు పండితులు బిందెలు లాంటివాటితో నీటిని బయటకు పంపేవారు మీరు ఎటు పోవడానికి దారి లేక చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ గుడి మొత్తంలో శ్రీవారి పాదాల కింద కొంచెం లోతుగా ఉండేది అక్కడ నీరు నిల్వ ఉండి నీరు బయటకు పారేది ఈ శబ్దం విన్న జనాలు దీనినే స్వామివారి పాదాల కింద నది పారుతుంది అనుకునే వారు. ఇంకా మరెన్నో విచిత్రమైన విషయాలు తిరుమల తిరుపతి ఆలయంలో ఉన్నాయి.