తెలుగు హీరోయిన్ తో నాగ చైతన్య రెండో పెళ్లి

అక్కినేని నాగచైతన్య తెలుగు హీరోయిన్ తో చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ ఉన్నారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. సదరు హీరోయిన్ బర్త్డే వేడుకలలో స్వయంగా నిర్వహించిన నాగచైతన్య, హైదరాబాద్లో నిర్మించుకున్న తన డ్రీం హౌస్ కి ఆమెను తీసుకు వెళ్లారట.

ఆమెతో రెండో పెళ్ళికి నాగచైతన్య సిద్ధమవుతున్నారా అనే సందేహాలు మొదలయ్యాయి, దాదాపు ఏడాదికాలంగా నాగచైతన్య ఒంటరి జీవితం అనుభవిస్తున్నారు. 2021 అక్టోబర్ నెలలో హీరోయిన్ సమంత తో విడాకులు తీసుకున్నారు. ప్రకటనకు ముందే కొన్నినెలల విడిగా ఉన్నారు.

ఇక సమంత నాగ చైతన్య ఎందుకు విడిపోయారు అనే విషయంపై అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. విడాకుల ప్రకటన తర్వాత ఇద్దరు ఎవరి కెరియర్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, 35 ఏళ్ల నాగచైతన్య మరల ప్రేమలో పడ్డారు అనేది తాజా వార్త. తెలుగు హీరోయిన్స్ శోభితా దోలిపాలతో ఆమె ప్రేమాయణం సాగిస్తున్నారట,

కొద్ది రోజులుగా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారట, మే 31న శోభితాదోలిపాల బర్త్డే కాగా ఒక హోటల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ పార్టీ లో నాగచైతన్య పాల్గొన్నారు. ఇక హైదరాబాద్లో నాగచైతన్య కోట్ల రూపాయలతో తన డ్రీమ్ హౌస్ నిర్మించుకుంటున్నారు. నిర్మాణంలో ఉన్న ఇంటికి ప్రత్యేకంగా తీసుకు వెళ్లారట. వీళ్ళ మధ్య గాఢమైన ప్రేమ మొదలైందనే టాలీవుడ్ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది, ఈ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కువ చ్చు అంటున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శోభితా ధూళిపాళ నటి కావాలి అని ఆశతో ముంబై కి వెళ్లారు,

2016 లో మొదలైన రామన్ రగవ్,2.o హిందీ చిత్రముతో శోభితా పరిశ్రమకు పరిచయం అయ్యారు. 2018 లో విడుదలైన గూడచారి మూవీ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు అడవి శేషు హీరోగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అలాగే అడవి శేషు లేటెస్ట్ రిలీజ్ మూవీ లో సైతం ఆమె నటించారు. ప్రస్తుతం శోభితా దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ పొన్నియన్ సెల్వన్ మూవీలో నటిస్తున్నారు, అలాగే ఒక హిందీ చిత్రంతో పాటు మంకీ మాన్ అనే హాలీవుడ్ మూవీ లో కూడా నటిస్తున్నారు.