తెల్లారే సరికి పెళ్లి కొడుకు లేవలేదు, ఏమైంది..

వారిద్దరికీ పెళ్లి జరిగింది. జంటను చూసి ఈడుజోడు కుదిరిందని, చాలా చూడ చక్కగా ఉన్నారు అని, అందరూ చెప్పుకున్నారు. ఈ సమయంలో పెళ్లికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించారు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ సమయంలో ఇటు అమ్మాయి తరఫున కుటుంబం, అబ్బాయి తరఫున కుటుంబం కూడా చాలా ఆనందంలో మునిగిపోయింది. పూర్తిగా వివాహ సంబరాల్లోనే మునిగిపోయినాయి,

ఆ రెండు కుటుంబాలు. అయితే వివాహం తర్వాత జరిగే శోభనం కూడా మూడు రాత్రులు సంతోషంగా గడిచింది. అబ్బాయి అమ్మాయి కూడా చాలా ఆనందంగా ఒకటై విధంగా ఉన్నారు. అయితే మూడో రోజు తెల్లవార గాని పెళ్ళికొడుకు ప్రాణాలు కోల్పోయి, విగతా జివిగా మారాడు. నిజంగా కన్నీరు పెట్టించే ఘటన ఇది. ఆ కొత్త పెళ్లి కూతురి ముఖంలో చిరునవ్వు కాస్త దూరమైంది. ఆ అత్తవారిల్లో పుట్టిల్లు ఇటు మెట్టినిల్లు పూర్తిగా అంధకారంలోకి మారిపోయాయి.

ఒక్క చావు ఆ కుటుంబాన్ని చివరకు విషాదంలోకి నింపి వేసింది. వచ్చినటువంటి వందల మంది కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరు అయ్యారు. ఈ ఘటన నిజంగా వినడానికి చాలా బాధగా ఉంది కానీ, ఆ జిల్లా మొత్తం కూడా ఈ ఘటన గురించి చర్చించుకున్నారు. యూపీలోని లక్నో సమీపంలో గత వారం ఒక యువతి యువకుడికి పెళ్లయింది. బంధువులందరూ పెళ్ళికి వచ్చి, జంటను ఆశీర్వదించారు.

ఎంతో చూడచక్కగా ఉంది ఈ జంట చూడడానికి అనుకున్నారు. శోభనం గడిచిన తర్వాత అకస్మాత్తుగా పెళ్లి కొడుకు తెల్లారేసరికి చనిపోయాడు. అంతా లబోదిబోమని ఏడ్చారు. అతడి అంత్యక్రియలు ముగిశాయి, అయితే ఈ విషయం పోలీసులకు చేరింది. అనుమానం వచ్చి పోలీసులు ఇంటికి వచ్చారు, ఇంట్లో కుటుంబ సభ్యులకి కోవిడ్ 19 పరీక్షలు చేయించారు. అందులో పెళ్లి కుమార్తెతో సహా 8 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. దీంతో అందరూ షా క్ అయ్యారు. కానీ పెళ్ళికొడుకు చనిపోయింది కరోనాతోనా లేదా మరేదైనా కారణమా అనేది తెలీదు. ఒకవేళ హార్ట్ ఎటాక్ వచ్చిందా, లేదా ఏదైనా ప్రధాన కారణం ఉందా ఇవన్నీ కూడా ఏమీ తెలియలేదు.

కానీ పెళ్లికి ముందు అతడికి ఎలాంటి లవ్ ఎఫైర్లు లేవని తెలుస్తోంది. ఎంతో చక్కని వ్యక్తి, మంచి వ్యక్తిగా ఉన్నాడని ఆ అమ్మాయి నిచ్చి వివాహం చేశారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని స్నేహితులు బంధువులు అతని ప్రాణం మిత్రులు కూడా చెబుతున్నారు. పెళ్లికి ముందు సహజంగా వధూవరులు కోవిడ్ టెస్ట్ లు చేయించుకోవాలి, కానీ అతడి విషయంలో అది జరగలేదు, బహుశా అతడు కోవిడ్ కారణంతోనే చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు.

సాధారణ దగ్గు జలుబు కూడా కనిపించలేదట, పెళ్లి సమయంలో ఇలాంటిదే కనిపించి ఉంటే కచ్చితంగా డాక్టర్ దగ్గరికి అయిన చూపించే వాళ్ళమని, ఇలా ఏదీ కనిపించలేదని ఆ అబ్బాయి తండ్రి కూడా చెబుతున్నారు.కరోనా వైరస్ బారిన పడిన కుటుంబ సభ్యులను ఆస్పత్రికి తరలించారు. ఇక పెళ్ళంట కొత్త పెళ్లికొడుకు చనిపోవడం అంతా కరోనాతో ఆసుపత్రి పాలు అవ్వడం, పెళ్లికి వచ్చినవారు ఇప్పుడు కరోనా టెస్ట్లు చేయించుకునేందుకు, వందలమంది ఆసుపత్రి బాట పట్టారు. ఇదంతా ఇప్పుడు అక్కడ పెను వైరల్ అవుతుంది. మొత్తానికి ఆ యువతి మాత్రం కన్నీటి మయం అయ్యింది.