తేనే నిమ్మరసం పరకడుపున తాగేవారికీ

చాలామంది బరువు తగ్గడానికి ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లలో నిమ్మకాయ తేనె కలుపుకొని తాగుతూ ఉంటారు. ఇది మంచిదేనా? నిజంగానే దీన్ని వల్ల బరువు తగ్గుతారా?ఉదయాన్నే నిమ్మకాయ తేనె కాంబినేషన్ తీసుకోవడం వల్ల తేనెలో మంచి ప్రాపర్టీస్ ఉంటాయి.

అలాగే నిమ్మకాయలో కూడా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి ఈ రెండిటి కాంబినేషన్లో ఇంకా అద్భుతమైన ప్రాపర్టీస్ ఉంటాయి. దీన్ని పరిగడుపున తీసుకోవడం వల్ల డిటాక్సిఫికేషన్ మెరుగుపడుతుంది, ఈ రెండిటి కాంబినేషన్లో పవర్ఫుల్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ రోగ నిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతాయి.

ఈ రీజన్ తో గొరివచ్చని నీటితో నిమ్మకాయ తేనె కలుపుకొని పరగడుపున తాగుతారు. ఈ పద్ధతిని అప్పటినుండో ఫాలో అవుతున్నారు, దీన్ని పరగడుపున తీసుకోవడానికి రెండవ రీజన్ ఏమిటంటే కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు ఈ వెజిటేరియన్స్ చాలా ఎనిమిగ్ గా ఉంటారు, వీళ్లు ఏదైనా సమస్యతో డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆకుకూరలను, పప్పులనుఎక్కువగా తినమని చెప్తారు. ఇవన్నీ తిన్నా సరే వారికి రక్తం పెరగదు ఆకుకూరల్లో ఐరన్ పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పటికీ వారిలో బ్లడ్ శాతం పెరగదు ఎందుకంటే ఒక విషయం వారు ఇగ్నోర్ చేశారు, వెజిటేబుల్ లో ఉండే ఐరన్ హ్యూమన్ బాడీ సింక్ చేసుకోవాలి

అంటే ప్రతి విటమిన్ కి మినరల్ కి కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్ లేనిదే ఆ ప్రాపర్ ఎమ్మల్సీఫికేషన్ జరగదు, ఇంతకుముందు మనం లెమన్ అండ్ హనీ కాంబినేషన్ చూశాం కదా అలాగే కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి, అదేవిధంగా ఐరన్ కి ,సి విటమిన్ కి కాంబినేషన్ ఉంటుంది. మనకి ఐరన్ సోర్స్ అనేది తినే ఆహారం నుండి వస్తుంది, మనం తినే ఆహారంలో రెండు రకాలు ఉంటాయి ఒకటి వెజ్ మరొకటి నాన్ వెజ్. ఈ రెండిటికీ తేడా ఉంది వెజిటేరియన్ లో ఫుట్ బలంగా ఉన్నప్పటికీ అది మన బాడీకి సింక్ కావాలి అంటే కచ్చితంగా దాంతోపాటుగా సి విటమిన్ అసోసియేట్ అయ్యి ఉండాలి, అప్పుడు మనం చేయాల్సిందేమిటంటే ఆకుకూరలు తీసుకోవడంతో పాటు విటమిన్ సి అంటే లెమన్ లాంటివి కూడా తీసుకోవాలి అప్పుడు ఈ రెండిటి కాంబినేషన్లో మనకు శరీరంలో బ్లడ్ అనేది పెరుగుతుంది.

మన ఒంట్లో లివర్లో గ్లైకోసన్ అనే రిజర్వ్ ఉంటుంది, అందులో నుండి గ్లూకోజ్ ను మన శరీరానికి అవసరం ఉన్నప్పుడు అందిస్తుంది, ఎలాగైతే మనం జేబులో క్యాష్ అయిపోతే కార్డ్స్ వాడుకుంటామో ఇలాగే ఈ గ్లైకోజన్ నీ మనకు శక్తి లేనప్పుడు వాడుకోవడం జరుగుతుంది, శరీరంలో దీనిని లివర్ స్టోర్ చేస్తుంది, మన శరీరంలో అద్భుతమైన ఆర్గాన్ మనకు అత్యంత హెల్ప్ చేసే ఆర్గాన్లో ఫస్ట్ ప్లేస్ లివర్ అని చెప్పవచ్చు. ఇది శరీరంలో ఉపయోగకరమైన వాటిని చాలా దాస్తుంది, ఫ్యాట్ కి సంబంధించినవి, విటమిన్ ఏ కానీ డి కానీ ఈ కానీ ఇలాంటివి స్టోర్ చేస్తుంది. ఇలా ఎందుకు స్టోర్ చేస్తుంది అంటే మనం ఎప్పుడైనా తక్కువ కంటెంట్ లో వాడికి ఇచ్చినప్పుడు వీటి నుండి వాడడం జరుగుతుంది.

ఈ లివర్ అనేది అన్ని స్టోర్ చేయగలదు కానీ మనకు అత్యంత అవసరమైన ఆంటీ యాక్సిడెంట్ అయినా విటమిన్ సి ని మాత్రం లివర్ స్టోర్ చేయలేదు. సి విటమిన్ యొక్క రిక్వైర్మెంట్ అనేది మనకి ప్రతిరోజు ఉంటుంది కాబట్టి విటమిన్ సి అనేది ఏ రోజుకి ఆ రోజు కచ్చితంగా తీసుకోవాలి. అందుకని పెద్దవాళ్లు పొద్దున్నే లేచి తేనె నిమ్మకాయలు త్రాగడం అనేది ఒక అలవాటు లాగా పెట్టారు, వారికి ఇంత అర్థం తెలియకపోవచ్చు కానీ ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది.