వర్షాకాలంలో చాలా ఎక్కువగా బాధించే చర్మ సమస్యలను తగ్గించే మొక్క గురించి తెలుసుకుందాం. దొండకాయ రెండు రకాలు ఉంటాయి. కూర వండుకునే దొండకాయలు, కాకి దొండ. కాకిదొండ చేదుగా ఉంటుంది.కాకి దొండ ఆయుర్వేదంలో కొన్ని సంత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. కాకి దొండలో ఫైబర్, ఐరన్ అధికంగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులను తగ్గిస్తాయి. ఐరన్ అధికంగా ఉండటం వలన ఎనీమియా తగ్గుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.కాన్సర్ వ్యాధిని తగ్గించడంలో బాగా సహాయపడతాయి. మెదడు చురుకుగా పనిచేస్తుంది. కాకిదొండ నమిలి తినడం వలన మౌత్ అల్సర్స్ తగ్గుతాయి.
కాకి దొండ నమిలి తినడం వలన షుగర్ వ్యాధి కంట్రోల్లోకి వస్తుంది.కాకిదొండ నమిలి తినడం వలన మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోయి మళ్లి రాళ్లు ఏర్పడవు.కాకిదొండ గింజలను పొడి చేసుకుని 1గ్రాము మోతాదులో పొడి తేనె కలిపి తీసుకోవడం వలన వాంతులు, వెక్కిళ్లు తగ్గుతాయి. కాకిదొండలో ప్రతి భాగం కూడా షుగర్ వ్యాధి నియంత్రణలో ఉపయోగపడుతుంది. కాకి దొండ ఆకు లేదా ఖండం యొక్క రసాన్ని 20 నుంచి 30 గ్రాముల మోతాదులో 40 -80 రోజులు తీసుకోవడం వలన షుగర్ వ్యాధి కంట్రోల్లోకి వస్తుంది.షుగర్ వల్ల వచ్చే నీరసం, అలసట కూడా తగ్గుతాయి. కాకి దొండ ఆకు రసం తీసుకుని గేదె పెరుగులో కలిపి తీసుకుని చప్పిడి పత్యం చేసినట్లయితే అన్ని రకాల కామెర్లు తగ్గుతాయి. గజ్జి, తామర, దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఆకులను మెత్తగా పేస్ట్ చేసి ఈ సమస్య ఉన్న భాగంలో అప్లై చేయడం ఎలాంటి మొండి చర్మవ్యాధులు అయినా సరే తగ్గుముఖం పడతాయి.
ఈ ఆకులు మీకు దొరకవు అనుకుంటే ఆకులు తెచ్చుకొని స్టవ్ మీద కడాయి పెట్టి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె వేసి ఈ ఆకులను నూనెలో వేసి ఆకులు నురగ వచ్చేంతవరకూ మరిగించాలి.తర్వాత నూనె చల్లార్చి వడగట్టుకుని అవసరమైనప్పుడు చర్మ సమస్యలు గజ్జి, తామర, దురద, సోరియాసిస్, మానని గాయాలకి అప్లై చేయడం వలన తగ్గుతాయి. దొండకాయ ఆకులు, ఎర్ర కాజు అరిగించి తెల్ల సర్పికి రాయడం వలన తగ్గుతాయి. అరికాళ్ళలో మంటలు ఉన్నవారు కాకి దొండ ఆకులు, నల్లఉమ్మెత్త ఆకులు, చిక్కుడు ఆకులు సమాన మోతాదులో తీసుకుని దంచి రసాన్ని తీసి మర్ధన చేసుకుంటే అరికాళ్ళ మంటలు తగ్గుతాయి.స్త్రీలలో నెలసరి సమస్యలు, గర్భాశయ దోషాలు ఉన్నట్లయితే దొండఆకుల రసం తీసి దానిలో ఆవపిండి, వెల్లుల్లి రసం 3గ్రాముల చొప్పున తీసుకుని 1గ్రాము గోలీలుగా చేసుకుని 3 పూటలా నీటిలో కలుపుకుని తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి.