తొలి ఏకాదశి రోజు దేవుడికి ఈ ప్రసాదం పెడితే లక్ష పూజలతో సమానం

ఈనెల 29న అనగా జూన్ 29 2023న అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి, విష్ణుమూర్తి పాల కడలిపై యోగనిద్రకు ఉపక్రమించే రోజు.ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉండడంతో దారిద్ర భాదలతో బాధపడుతున్న వారు, విష్ణు సాహిత్యాన్ని కోరేవారు, ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని తప్పక ఆరాధించాలి.

తొలి ఏకాదశి వ్రతాన్ని అసలు ఏవిధంగా ఆచరించాలి, ఉపవాస దీక్ష అసలు ఏవిధంగా పాటించాలి, అలాగే ఏమి తినకుండా ఉండలేని వారు తొలి ఏకాదశి రోజున తప్పకుండా ఏం పాటించాలి, అని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తొలి ఏకాదశి వ్రతాన్ని అంటే ఉపవాస దీక్షను ప్రారంభించాలి అనుకునేవారు, దశమి రోజు రాత్రి నుండే ఉపవాస దీక్షను ప్రారంభించాలి.

ఉపవాస దీక్ష చేసిన చేయకపోయినా, ఎవరైనా సరే తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి, కాల కృత్యాలు తీర్చుకొని ఆ తర్వాత తలస్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుటిన కుంకుమ ధరించాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణ పటాన్ని లేదా, వెంకటేశ్వర స్వామి పటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి. ముందుగా ఆచమనం చేసి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి, తొలి ఏకాదశి అంటే ప్రత్యేక పర్వదినం కాబట్టి విష్ణుమూర్తిని పూజించక ముందు, పసుపు గణపతిని పూజించాలి,

ఒక పసుపు గణపతిని చేసి అందులో వినాయకుని ఆవాహన చేసి, ముందుగా ఆయనకు పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించాలి. ఆ తర్వాత విష్ణుమూర్తిని తులసిమాలతో అలంకరించాలి. విష్ణుమూర్తికి ఈ తొలి ఏకాదశి రోజు తులసి తో పూజించడం వల్ల అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. విష్ణుమూర్తికి అలంకరణ అంటే ఇష్టం కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పువ్వులతో అలంకరించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. ముఖ్యంగా ఈరోజు పేలపిండిని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు ఇలా పేలపిండిని నైవేద్యంగా పెడితే ఆ లక్ష్మీనారాయణ కరుణాకటాక్షాలు మీకు తప్పక లభిస్తాయి.

అలానే గోధుమలతో చేసిన బెల్లం పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే తొలి ఏకాదశి రోజున విష్ణు పురాణం, విష్ణు సహస్రనామం, విష్ణు అష్టోత్తరం మరియు భాగవతంలోని శ్లోకాలను పారాయణం చేయడం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది. మంత్రాలు రానివారు ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే స్మరించుకున్న సరిపోతుంది. కనీసం ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా అనే నామాన్ని స్మరించిన చాలు. ఆయన కృపకు మీరు పాత్రులు అయినట్టే. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.