తొలి తొలి ఏకాదశి రోజు పొరపాటున కూడా తినకూడని పదర్థాలు ఇవే

ఈనెల 29న అనగా జూన్ 29 2023న అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి ఎంతో మహిమాన్వితమైన రోజు, ఇలాంటి రోజు పొరపాటున కూడా దీనిని తినకూడదు. ఈరోజు దీనిని తింటే పరమ దరిద్రంగా పురాణాలు చెబుతున్నాయి. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడు కర్కాటక సంక్రమణం చేసిన తర్వాత వచ్చే మొదటి ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. మన పండుగలు అన్ని దీనితోనే మొదలవుతాయి.

ఎంతో పవిత్రమైన ఈ రోజు ఈ ఆహారాన్ని అసలు తినకూడదు. విన్నంతనే ఐశ్వర్యాన్ని కలిగించే ఈ పవిత్రమైన కథను కింద ఉన్న వీడియోలో చూడండి. ఎంతో పవిత్రమైన తొలి ఏకాదశి రోజు తినకూడని పదార్థాల గురించి తెలుసుకుందాం. ఈరోజు వండిన ఆహారాలు తినకూడదు, ఉసిరికాయ, చింతపండు, పుచ్చకాయ, గుమ్మడికాయ, తేనె, పొట్లకాయ, ఉల్వలు, తెల్ల ఆవాలు, మినుములు, మాంసాహారం. లాంటివి పొరపాటున కూడా ఈరోజు తినకూడదు.

వీటిని ఈరోజు తెలియక తింటే మహాపాపంగా పరిగణింపబడతాయి. అంతేకాదు ఈరోజు మంచంపై పడుకోకూడదు, నేలపై చాప వేసుకుని కూర్చోవాలి. ఎటువంటి ఆహారం భుజించకుండా ఉపవాసం చేస్తే, పూర్వజన్మల పుణ్యం వస్తుంది.ఆషాడశుద్ధ ఏకాదశి రోజు తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ రోజున పూర్వకాలంలో సంవత్సరం ఆరంభంగా భావించేవారు, ఈరోజు విష్ణుమూర్తి పాల కడలిపై నిద్రలోకి వెళతాడు, స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు.

ఈరోజు శ్రీమహావిష్ణువును హిందువులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు, ఇలా స్వామిని ఆరాధించడంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కొంతమంది తెలియక ఈరోజు ఈ చిన్న పొరపాటు చేయడం వల్ల ఫలితం శూన్యంగా ఉంటుంది. చాలామంది తెలియక దీపారాధనను అలాగే భూమిపై వెలిగిస్తారు, దీపారాధనను అలా నేలపై వెలిగించకుండా ఏదైనా ఆకుపై వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని, శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు కనుక దీపారాధన చేసే సమయంలో రావి ఆకులను ఉంచి, దానిపై ప్రమిదలు ఉంచి దీపారాధన చేయడం వల్ల వచ్చే పుణ్యాన్ని తెలుసుకుంటే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

రావి చెట్టు అంటే శ్రీమహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్ర మైనది, అందుకే రావి చెట్టు ఆకుల మీద మీరు దీపారాధన కుందులు ఉంచి, లేదా ప్రమిదలు ఉంచే దీపారాధన చేసినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలానే త్రిమూర్తీ స్వరూపం రావి చెట్టు అని మన పురాణాలు చెబుతున్నాయి. త్రిమూర్తుల అ ను గ్రహం కలగాలన్న ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలన్న, ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు రావి చెట్టు ఆకుల మీద ప్రమిదలు ఉంచి ఇంట్లో దీపారాధన చేయాలి, ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.