దంపతులు కలిసిన తరవాత రోజు తలస్నానం చేయాలా?

భార్యాభర్తలు కలిసిన తర్వాత తలస్నానం చేయాలా, పూజ ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ప్రతిరోజు పూజ చేసుకోవాలి, మరి భార్యాభర్తలు కలిసిన తర్వాత తలస్నానం చేయకుండా పూజ చేయవచ్చా, ఇటువంటి నియమాలు పాటించాలి.

పూజా విధానానికి భార్యాభర్తల కలయికకి మధ్య ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటి, ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. ప్రతిరోజు పూజ ఇంట్లో చేయాలి అనేది మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఇంట్లో చేసే పూజ వైభవంగా చేయకపోయినా, ప్రతినిత్యం కనీసం దీపం వెలిగించి నైవేద్యం సమర్పించి, భగవంతుడిని ప్రార్థించాలి అని మన పెద్దలు చెబుతున్న మాట.

కుదిరిన వారు వారానికి ఒకటి లేదా రెండుసార్లు వారంలో అన్ని రోజులు మహా నైవేద్యాలు సమర్పించుకొని పూజలు చేస్తారు. కానీ కుదరని పక్షంలో కనీసం దీపమైన వెలిగించి, సంకల్పం చెప్పుకోవాలి మనస్ఫూర్తిగా అని పెద్దలు చెబుతూ ఉంటారు. మరి ఇలాంటి నేపథ్యంలో ప్రతిరోజు పూజ చేయాలి అంటే, రాత్రి కలిసిన దంపతులు తెల్లవారాక తలస్నానం చేయాలా, ఇది అనేక మందికి ఉన్నటువంటి సందేహం. దీనికోసం సాధారణంగా ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలి అని చెబుతారు పెద్దలు.

అంటే ఇంట్లో పూజని ఇంటికి యజమాని అయిన భర్త చేయాలి, భర్తకి కుదరని పక్షంలో మాత్రమే భార్య చేయాల్సి ఉంటుంది. ఇంట్లో పూజని ప్రదానంగా నిర్వర్తించాల్సిన కర్తవ్యం భర్తకే ఉంటుంది. కాబట్టి ఇంట్లో పూజని ప్రతి రోజు మగవారే చేసేటట్లయితే కచ్చితంగా తలస్నానం చేయాలి. కానీ ఆడవారు కనుక ఇంట్లో పూజలు చేస్తుంటే ప్రతిరోజు చేస్తుంటే, ప్రతిరోజు తలస్నానం చేసే పూజ చేయాలి అనేటటువంటి నియమేమీ లేదు. భయపడాల్సిన ప్రమాదము లేదు, దీనివల్ల ఎటువంటి చెడు ప్రభావాలు మీపై కలగవు, కానీ మగవారు మాత్రం తప్పక ప్రతిరోజు తలస్నానం చేసే పూజ చేయాలి.

అయితే కొత్తగా పెళ్లయిన తర్వాత కొన్ని రోజులపాటు, అనేక పూజలు అనేక కార్యక్రమాలు, అనేక ఆధ్యాత్మిక వ్యవహారాల్లో భార్యాభర్తల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. ఈ సమయంలో మాత్రం మీరు కచ్చితంగా ప్రతి పూజకి తలస్నానం చేయాల్సిందే, అలా కాకుండా నిత్యజీవితంలోకి వచ్చేసిన తర్వాత ప్రతిరోజూ చేసే పూజకి, ప్రతి రోజు శ్రీ తలస్నానం చేశాకే చేయాలి అనేటటువంటి నియమి ఉండదు. వారానికి రెండు లేదా మూడు రోజులు తలస్నానం చేసి పూజ చేయవచ్చు, మగవారికి మాత్రం ఈ నియమం లేదు. కచ్చితంగా తలస్నానం చేశాకే పూజలో కూర్చోవలసి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.