దీన్ని తాగితే పేగులో కదలికలు వస్తాయి….. గాల్బ్లాడర్ స్టోన్స్ రాకుండా ఇవి ఉపయోగపడతాయి……. రిచ్ ఫైబర్ ఫుడ్…

బార్లీ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది వంటికి నీరు పట్టినప్పుడు ఆ నీటిని తొలగించుకోవడానికి నాచురల్ డైయూరీటీక్ లాగా బాగా పనిచేస్తుంది అని మాత్రమే అందరికీ తెలుసు. దీని ద్వారా స్వెల్లీంగ్స్, కాలు వాపులు తగ్గడమే కాకుండా గాల్బ్లాడర్లో రాళ్ళను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఇలా ఉపయోగపడతాయని మన ఇండియాలోనే పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు 2015లో నిరూపించారు. 100 గ్రాముల బార్లీ గింజలు తీసుకుంటే అందులో శక్తి 354 కిలో క్యాలరీలు, ప్రోటీన్ 12.5 గ్రామ్స్, ఫ్యాట్ 2.3 గ్రామ్స్, కార్బోహైడ్రేట్స్ 73.5 గ్రామ్స్, ఫైబర్ 17 గ్రామ్స్, పాస్పరస్ 264 మిల్లీగ్రాములు.

పొటాషియం 452 మిల్లిగ్రాములు, సిలినియం 37.7 మైక్రో గ్రామ్స్, ఇవి బార్లీ లో ఉండే స్థూల, సూక్ష్మ పోషకాలు. ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్ కాంబినేషన్ వల్ల పేగులకు వెళ్లిన ఫ్యాట్ ఎక్కువ రక్తంలోకి, లివర్ లోకి అబ్సర్వ్ కాకుండా రక్షించడానికి బాగా సపోర్ట్ చేస్తున్నాయి. సాధారణంగా కొలెస్ట్రాల్ వలన గాల్ స్టోన్స్ వస్తుంటాయి. ఈ కొలెస్ట్రాలను తగ్గించడానికి ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్ ఉపయోగపడుతుంది. రెండవది అసలైన ముఖ్య కారణం మనం తినే ఆహారంలో కొవ్వులు ఉంటాయి. ఇవి పొట్టలో జీర్ణమైన తర్వాత పొట్టలో నుంచి బయటికి వచ్చే చిన్న పేగుల్లో మొదటి భాగాన్ని డియోనియం అంటారు.

ఇక్కడ కొవ్వును అరిగించడానికి ఒక జ్యూస్ కావాలి దాన్ని పైత్య రసం అంటారు. ఇది గాల్బ్లాడర్లో నిలువ చేసుకొని ఉంచుతుంది. ఈ గాల్బ్లాడర్ లో స్టోర్ అయిన పైత్యరసం ఎంత కావాలో చిన్న పేగులు ఉండే ఒక ఎంజైమ్ సహాయపడుతుంది. అది సిసికే అనే ఎంజైమ్. ఈ ఎంజైమ్ తక్కువ ఉత్పత్తి అయితే గాల్బ్లాడర్లో ఉండే జ్యూస్ తక్కువ ఉత్పత్తి అవుతుంది. అందువలన గాల్బ్లాడర్లో ఎక్కువ పైత్యరసం ఉంటుంది. ఇందులో కొవ్వులు ఎక్కువగా ఉండడం వలన అవి స్టోన్స్ లాగా ఏర్పడతాయి.

బార్లీ తీసుకోవడం వలన ఇందులో ఉండే ఫైబర్ సిసికే ఎంజైమ్ ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీనివలన గాల్ బార్డర్లో స్టోన్స్ ఏర్పడడం తగ్గుతుంది. కనుక

బార్లీని ప్రతినిత్యం ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది. దీనివలన కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. దీనిలో ఉండే ఫైబర్ వల్ల మోషన్ ఫ్రీగా అయ్యి మలబద్ధకం రాకుండా సహాయపడుతుంది. గ్లూకోజ్ గ్రహించడం కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఇవి ఒబేసీటీ ఉన్నవాళ్లకి, డయాబెటిస్ ఉన్నవారికి ఇద్దరికీ మంచిది…