దీపం వెలిగించినాక వొత్తులు పూర్తిగా కలిపోతే…

ఆడవారు వెలుపల ఉన్న పూజ చేసుకోవడానికి అభ్యంతరం అనేటటువంటి ప్రశ్న, అసలు ఎక్కడ లేదు ఎందుకు లేదు అంటే, పూజ అనేటటువంటిది ఎవరు చేయాలి. అంటే ఇంటి యజమాని చేయాలి ధర్మపత్ని సమేతస్య అని ఉంది కానీ ధర్మ ప్రతీ సమేతస్య అని ఉండదు సంకల్పం. అంటే దాని అర్థం ఎవరు చేయాలని, యజమాని చేయాలి యజమాని చేసి నేను పూజ చేసిన కారణం చేత,

నా పత్ని బిడ్డలు అందరూ సుఖంగా ఉండాలి అని యజమాని కోరుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇల్లాలు వెలుపల ఉంటే, ఇంట్లో పూజ చేయడానికి అభ్యంతరం ఎక్కడ ఉంది. అభ్యంతరం ఏమీ లేదు, ఆవిడ వెలుపల ఉంటే ఆమె కాదు కదా పూజ చేసేది మీరు పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఆవిడ వెలుపల ఉందంటే పిల్లలు చిన్నవాళ్లు, వాళ్ళ బాగోకుండా చూడాలి వాళ్లకి వేలకి ఫలహారం పెట్టాలి, ఏదో పాలు కాచి ఇవ్వాలి, అటు ఇది కూడా కష్టం అనుకుంటే, మీరు లగురు చేసుకోండి ఈశ్వర ఈ మూడు రోజులు నాలుగు రోజులు లఘువుగా చేస్తాను,

పూజ ఎందుకని అంటే ఈ కుటుంబ నిర్వహణ యందు సమయం కొంచెం ఎక్కువ కావాల్సి వచ్చింది, అందుకని తక్కువ పూజ చేస్తున్నాను దీన్నే పూర్ణం చేసి నన్ను అనుగ్రహించు అనండి, ఏమి దోషం రాదు. ఇక ఆమె వెలుపల ఉంటే దీపం పెట్టడానికి అభ్యంతరం ఏముంది, పూజలు అంతర్భాగం దీపం పెట్టడం పూజ చేయొచ్చు అని చెబుతుంటే, దీపం పెట్టడానికి అభ్యంతరం ఏమి ఉంది. అభ్యంతరం లేదు దీన్ని అన్ని తేని ఆధారం చేసి చెబుతున్నాను అంటే, ఆవిడ వెలుపల ఉన్నారు అంటే ఆవిడ వేరే కూర్చున్నారు అన్న భావన దృష్టిలో పెట్టుకొని చెబుతున్నాను. అలాగే దీపం పెట్టడం అన్నమాట, మీద అనేకమంది ప్రశ్న వేశారు.

అన్నీ కలిపి సంగ్రహంగా నేను ఒక మాట చెబుతున్నాను, దీపం ఎలా పెట్టాలి అని దీపం ఎలా పెట్టాలి అనేది దీపం పెట్టే మంత్రంలో ఉంది. సాధ్యం త్రివర్తిశం సంయుక్తం మూడవత్తులు వేయాలి పూజ చేసేటప్పుడు, మూడు జ్యోతులు వెలుగుతూ ఉండాలి పూజ జరుగుతూ ఉండగా ఇల్లు వృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకుంటాడు కాబట్టి, ఆ మూడు జ్యోతులు తూర్పుముఖంగా వెలుగుతూ ఉండాలి. ఇంకొక ముఖాన్ని చూడకూడదు. తూర్పు ముఖంగా వెలగాలి మూడు జోతులు వెలుగుతున్నప్పుడు, దీపం వెలిగించగానే అది మంగళ దీపం.

అది ఈశ్వర స్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ దీపాలుగా ఉన్నారు, త్రిమూర్తాత్మకం వాళ్ల ముగ్గురు తప్ప వేరొకటి లేదు లోకంలో, కాబట్టి అటువంటి దీపపు సమ్మె ఏదైతే ఉందో, దానిమీద పసుపు కానీ కుంకుమకాని అక్షింతలు కానీ పువ్వు కానీ ఉంచాలి. ఎందుచేత అంటే మంగళ దీపం అంటాం. మంగళ దీపం ఉంటుంది. ఆమంగళ దీపం ఉంటుంది, దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎవరైనా వెళ్ళిపోయారు అనుకోండి పార్ధవ శరీరం ఒక్కటే ఉండకూడదు, అందులో జ్యోతి వెళ్లి పోయింది, అందుకే ఏమి చేశారు అంటే పడుకోబెట్టి తలకట్టున ఒక దీపం పెడతారు. దానికి మీద పసుపు కుంకుమలు వేయరు అది అమంగళ దీపం. మంగళ దీపం ఇంట్లో పెట్టారు అంటే, దీపం వెలిగించగానే కాసిన్ని పువ్వులు వేయాలి, లేదా పసుపు లేదా కుంకుమ లేదా కాసిని అక్షింతలు వేయాలి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.