దీపావళి సూర్యగ్రహణం.. పరిహారాలు

అక్టోబర్ 25 ఆశ్వయుజ అమావాస్య, దీన్నే మనం ఐశ్వర్య అమావాస్య లేదా దీపావళి అమావాస్య అంటాo. ఈ దీపావళి అమావాస్య రోజున లక్ష్మీ ఆరాధన కనుక మనం భక్తిశ్రద్ధలతో కనుక చేసామంటే,

అఖండ ఐశ్వర్యాలు మనకు లభిస్తాయని దరిద్ర దేవత మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందని మనం నమ్ముతూ ఉంటాం. అటువంటి ఈ ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తున్నటువంటి పాక్షిక సూర్య గ్రహణానికి సంబంధించినటువంటి సంపూర్ణ వివరాలను కూడా మనం తెలుసుకుందాం.

మీరు వీటిని జాగ్రత్తగా విని వీటిని పాటించడానికి ప్రయత్నించండి ఎవరైతే ఈ ఐశ్వర్య అమావాస్య రోజున అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారో వారికి దరిద్రాలు అన్నీ కూడా దూరమైపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ గ్రహణాన్ని కేతుగ్రస్త సూర్యగ్రహణం అంటారు, అంటే కేతువు గ్రహిస్తున్నటువంటి సూర్యగ్రహణం. ఇది భారతదేశం మొత్తం కనిపిస్తుంది ఈశాన్య రాష్ట్రాలలో కనబడదు. అలాగే అమెరికా లాంటి ప్రదేశాలలో కూడా ఇది కనపడదు. ఇక దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి కనుక వెళితే,

ఇది స్వాతి నక్షత్రంలో పడుతున్నటువంటి గ్రహణము. ఇది సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల నుండి, 5:35 నిమిషాల వరకు ఈ యొక్క గ్రహణం అనేటటువంటిది దీపావళి అమావాస్య రోజున సాయంత్రం ఉంటుంది. ఇక ఇండియా మొత్తం పనికి వచ్చేలా చెప్పాలి అంటే సాయంత్రం 4: 15 నిమిషాల నుండి సాయంత్రం 6:30 వరకు ఈ యొక్క గ్రహణం అనేది కొనసాగుతుంది. ఈ గ్రహణాన్ని మనం చాలా భక్తిశ్రద్ధలతో ఆచరించడానికి ప్రయత్నం చేయాలి, ఎందుకంటే ఇది మనం ముందుగా చెప్పుకున్నట్లు

ఇది ఐశ్వర్య అమావాస్య దీపావళి అమావాస్య రోజున వస్తున్నటువంటి సూర్యగ్రహణం. ఇక ఇది స్వాతి నక్షత్రంలో పడుతుంది, అందువల్ల ఇది స్వాతి నక్షత్రం వాళ్లకే కాకుండా ఇది ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఏ నక్షత్రాల వారికి ప్రభావం చూపిస్తుంది అనే విషయాలను తెలుసుకుందాం. రాశులు అందరికీ తెలియకపోవచ్చు కాబట్టి నక్షత్రాలు అనేటటువంటిది అందరికీ తెలుస్తాయి ,మీ నక్షత్రాలు మీకు తెలుస్తాయి కాబట్టి మీకు సంబంధించినటువంటి నక్షత్రాలలో ఏ నక్షత్రాలలో ఈ గ్రహణ ప్రభావం చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అనేదాన్ని తెలుసుకుందాం.

ఈ నక్షత్రానికి సంబంధించిన వారు కచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారాలు ఏమిటి అనేది కూడా మనం చెప్పుకుందాం. అశ్విని, భరణి, కృత్తిక, మృగశిర,ఆరుద్ర, పునర్వసు, పుష్యమి ,ఆశ్లేష ,ఉత్తర, చిత్త,స్వాతి ,విశాఖ ,అనురాధ ,జేష్ఠ, ధనిష్ట ,శతభిషం ,పూర్వాభాద్ర ,ఉత్తరాభాద్ర ,రేవతి. ఈ నక్షత్రాల వారికి విపరీతమైనటువంటి చెడు ప్రభావం అనేటటువంటిది ఇది చూపిస్తుంది కాబట్టి ఈ నక్షత్రాలకు సంబంధించిన వారు కచ్చితంగా ఈ గ్రహణం రోజున అంటే, 25వ తేదీ దీపావళి అమావాస్య రోజున ఉదయాన్నే తలస్నానం చేసి మధ్యాహ్నం ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి, మీ ఆరోగ్యాన్ని అనుసరించి చేయండి. మీ ఆరోగ్యం బాగోలేకపోతే చేయనవసరం లేదు. కాబట్టి మీ ఆరోగ్యాన్ని అనుసరించి ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. సాయంత్రం చీకటి పడేంత వరకు ఎదురు చూడండి, మన తెలుగువారు అయితే సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల తర్వాత తలస్నానం చేయండి దీన్నే గ్రహణం పట్టు స్నానం అంటారు. తల స్నానం చేసిన తర్వాత సుచిగా వస్త్రాలను ధరించి మీ ఇష్టదేవతను స్మరించండి.