ద్వారానికి ఇవి ఉంటే

లక్ష్మీ దేవి కటాక్షం మనకు లభించాలంటే ఇంటి ద్వారంలో ఏం పెడితే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. లక్ష్మీదేవి ఇంట్లోకి రావడం అంటే ప్రతి మనిషి ప్రశాంతంగా అలాగే మానసికంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా సంతోషంగా ఉండడం.

ప్రతి మనిషి కూడా ఇంత సేపు బయట వర్క్ చేసినా కూడా ఇంట్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇంట్లోకి లక్ష్మీదేవి రాకపోతే మన ఇంట్లో తెచ్చిన డబ్బు అనేది నిలబడడానికి అవకాశం ఉండదు లక్ష్మీదేవి లేకపోతే జ్యేష్ఠా దేవి నిలబడుతుంది. కాబట్టి లక్ష్మీదేవి ప్రతి మనిషికి కూడా అవసరం అని చెప్పవచ్చు. లక్ష్మీదేవిని మన ఇంట్లో కి ఎలా ఆహ్వానించాలంటే, లక్ష్మీదేవి స్వరూపంగా మన ఇంటి గుమ్మాన్ని భావిస్తాం ఇది మన పెద్దలు ఎప్పటినుంచో చెప్తున్నా మాట.

గుమ్మాన్ని ఎప్పుడూ కూడా పసుపుతో అలంకరించేవారు, ఇలా వారానికి ఒక్కసారి అయినా గుమ్మానికి పసుపు రాయడం ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. అలాగే పసుపు రాయడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షించబడడానికి అవకాశం ఉంటుంది. అలాగే తాంత్రిక పరంగా జీడి గింజలు మనం కట్టకూడదు, ఇలా కట్టుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీని ఆపడానికి అంటే లక్ష్మీదేవిని లోపలికి రానివ్వకుండా ఆపుతుంది.

అలాగే ఈ రోజుల్లో చాలామంది తోరణాలు అనేది కట్టడం లేదు, మామిడి తోరణాలు కట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తగ్గుతూ మనకు పాజిటివ్ ఎనర్జీ అంటే లక్ష్మీదేవి త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు చాలామంది ఇళ్లలో ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కడుతూ ఉన్నారు, అలాగే కొంతమంది కలబంద కూడా కడుతున్నారు, అసలు ఇంటి ముందు గుమ్మడికాయ ఎందుకు కట్టుకుంటారు అంటే గుమ్మడికాయకు జీవశక్తి అనేది ఉంటుంది, ఏకైక జీవశక్తి కలిగిన దానిలా గుమ్మడికాయను చెప్తారు. ఇది 30 రోజుల పాటు నెల రోజుల పాటు తన జీవశక్తి కోల్పోకుండా దిష్టి దోషాలను ఆపడానికి అవకాశం ఉంది. అలాగే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉందా లేదా అని చూపించడానికి మనం కట్టే గుమ్మడికాయ కారణం, అంటే ఒకవేళ ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే తొందరగా గుమ్మడికాయ పాడవుతుంది. అలాగే కలబంద కూడా నెగటివ్ ఎనర్జీ తగ్గడానికి ఉపయోగపడుతుంది.

అలాగే కొన్ని క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా ఆపుతుందని సైన్స్ పరంగా చెప్తూ ఉంటారు. ఇవి కాకుండా మన ఇంటి గుమ్మం ముందు ఏం పెట్టుకుంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అనేది తెలుసుకుందాం. ఇంటి గుమ్మం నుండి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎదురుగా ఒక చిన్న అద్దాన్ని మీరు పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవిని హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆకర్షించిన వారు అవుతారు. ఎందుకంటే అద్దాన్ని అమ్మవారి ప్రత్యేకంగా చెప్తారు, అయితే ఈ అద్దం అనేది మనిషి యొక్క నెగటివ్ ఎనర్జీ లాగడానికి ఉపయోగపడుతుంది,మార్వాడిస్ కూడా వారి షాపులలో అద్దాలను ఎక్కువగా అమరుస్తారు, కాబట్టి అద్దాన్ని ఇంటికి ఎదురుగా పెట్టడం వల్ల కూడా మంచి ఎనర్జీ ఇవ్వడానికి మంచి సక్సెస్ ఇవ్వడానికి మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి వీధి గుమ్మంలో అంటే మన గుమ్మం నుండి లోపలికి వచ్చేటప్పటికి ఎదురుగా అద్దం పెట్టడం వల్ల మంచి డెవలప్మెంట్ అనేది ఉంటుంది.