నడుం నొప్పి, ఎముకల బలహీనతతో నడవలేని స్థితిలో ఉన్న వారిని సైతం పరుగెత్తిచే దివ్య ఔషధం

నడుము నొప్పి ఎముకల బలహీనతతో నడవలేని స్థితిలో ఉన్న వారిని సైతం పరిగెత్తించే దివ్య ఔషధం. ఈ ఔషధం తయారు చేసుకోవడం కోసం ఒక ఖాళీ గిన్నెను తీసుకోవాలి, తర్వాత ఇందులో దాదాపు రెండు గ్లాసుల నీటిని పోసుకోవాలి. తరువాత ఈ రెమెడీ కోసం అన్నింటికంటే ముందుగా వామును తీసుకోవాలి, వాములో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

ఈ వాము కూడా మన శరీరంలో ఉన్న వాతo నివారించడమే కాకుండా, మన పొట్టకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్న అనగా గ్యాస్, ఎసిడిటీ మలబద్దకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను, నయం చేసి మన జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి, బాగా సహాయం చేస్తుంది. ఇది మన పేగులను బాగా శుభ్రం చేస్తుంది. ముఖ్యంగా మన పొట్ట అనేది శుభ్రం అయితే, మన శరీరంలో కొవ్వు కూడా త్వరగా తగ్గి, మీరు అధిక బరువు కూడా చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.

కాబట్టి ఒక స్పూను వామును తీసుకొని వాటర్ లో వేసుకోవాలి, తరువాత సొంటి పౌడర్ ని తీసుకోవాలి, జాయింట్స్ లో పేరుకుపోయిన వాయువును తొలగించడంలో, అనగా పాత దోషాన్ని బ్యాలెన్స్ చేయడంలో సొంటి అనేది బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా గ్యాస్ సమస్యలను, వాత దోషాలను నివారించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే అజీర్ణ సమస్యలకు కూడా సొంటి అనేది బాగా హెల్ప్ చేస్తుంది.

ఎందుకంటే ఈ సొంటి అనేది మన పొట్టలో జీర్ణ రసాలు బాగా ఊరేలా చేసే మన జీర్ణశక్తిని పెంచుతుంది. దీనివల్ల మనం తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది, ముఖ్యంగా మన శరీరంలో వ్యాధులతో పోరాడే రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో, ఈ సొంటి అనేది అద్భుతంగా పనిచేస్తుంది, కావున అర స్పూను సొంటి పొడిని వాటర్ లో వేయాలి. సొంటి పౌడర్ వేసిన తర్వాత ఒకసారి దానిని బాగా కలపాలి. ఈ రెమెడీ కోసం ఒక బగారా ఆకు, వాయు దోషాలను మరియు మన పొట్టను శుభ్రపరచడానికి బిర్యానీ ఆకు కూడా చాలా బాగా పనిచేస్తుంది.

అందుకే ఆయుర్వేదం ప్రకారం ఈ బిర్యానీ ఆకును మధుమేహ ఔషధం లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే మన శరీరంలోని చెడు కొలెస్ట్రాలను నివారించడానికి, ఇదే బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి, ఒక బిర్యానీ ఆకును తీసుకొని నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందులో ఉన్న నీరు సగం అయ్యేంతవరకు బాగా మరిగించుకోవాలి. కనీసం ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో ఈ నీటిని బాగా మరిగించుకోవాలి. ఈ నీటిని ఒక గ్లాసులో వడకట్టుకోవాలి. ఈ కషాయాన్ని కావాలంటే అలాగే తాగవచ్చు, లేదంటే రుచి కోసం ఇందులో మీరు కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెమెడీని యూస్ చేసినన్ని రోజులు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ అని తినవద్దు. దీనిని ప్రతి రోజు ఉదయం సాయంత్రం తీసుకోవచ్చు.