నన్ను ఇలా కూడా బ్రతకనివ్వరా..కన్నీరు పెట్టిన హీరో రాజశేఖర్

పరువు నష్టం కేసులో సినీ నటులు జీవిత రాజశేఖర్ దంపతులకు షాక్ ఇస్తూ, నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మినిస్టర్ సంచల తీర్పు వెళ్ళేదించింది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై వారు చేసిన ఆరోపణలకు దాఖలైన పరువు నష్టం దావా పై విచారణ జరిపిన కోర్టు, మంగళవారం నాడు జీవిత రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు శిక్ష, 5000 జరిమానా విధించింది.

ఈ కేసు పూర్వపరాల్లోకి వెళితే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి అవసరమైన వారికి రక్తాన్ని అందిస్తూ సేవ చేస్తున్నారు. అయితే సినీనట్లు జీవిత రాజశేఖర్ మెగాస్టార్ చిరంజీవి నిర్వహించే బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించి రక్తాన్ని, మార్కెట్లో అమ్ముకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. 2011లో ఒక ప్రెస్ మీట్ లో జీవిత రాజశేఖర్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పైసంచలన ఆరోపణలు చేశారు.

ఇక వారి వ్యాఖ్యలను సీరియస్గా పరిగణించిన సినీ నిర్మాత అల్లు అరవింద్ కోర్ట్ నీ ఆశ్రయించారు. చిరంజీవి పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఎంతోమందికి సహాయం దొరుకుతుందని, అటువంటి చిరంజీవి పరువు కి భంగం కలిగిన జీవిత రాజశేఖర్ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి పేరుతో నడుస్తున్న కార్యక్రమాలైనా చిరంజీవి ట్రస్ట్ పైన అసత్య ఆరోపణ చేస్తారంటూ, జీవిత రాజశేఖర్ పై పరువు నష్టం దావా వేశారు.

వారు చేసిన ఆరోపణకు సంబంధించిన వీడియో వచ్చిన కథనాలు సిడి రూపంలో కోటి సమర్పించారు.దీంతో ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు నిన్న తీర్పును వెలవరించింది. జీవిత రాజశేఖర్ ఇద్దరికీ ఏడాది పాటు జైలు శిక్షతోపాటుగా 5000 రూపాయలు జరిమానా కూడా విధించింది. జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడంతో, జరిమానా చెల్లించిన వారిద్దరి నుంచి కూచి కథలను సమర్పించి, బెయిల్ తీసుకొని విడుదల అయ్యారు.

మరి ఈ కేసులో జిల్లా కోర్టును ఆశ్రయిస్తామని చెబుతున్న జీవిత రాజశేఖర్ కు అక్కడైనా పరిస్థితి అనుకూలంగా ఉంటుందా, లేదా అనేది భవిష్యత్తులో తేలింది. అయితే బెయిల్ పై బయటికి వచ్చిన జీవిత రాజశేఖర్లు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి ఫోన్ చేశారు. ఇప్పుడు వీళ్ళ మధ్య సంభాషణ ఇంటర్నెట్లు వైరల్ గా మారింది. కోర్టు తీర్పు అనంతరం జీవిత రాజశేఖర్లు అల్లు అరవింద్ కి ఫోన్ చేసి 2011లో జరిగిన గొడవని, ఇక్కడతో వదిలేయమని అప్పుడు తెలియక తప్పు చేసామని, అప్పుడు చేసిన అసత్య ఆరోపణలకు క్షమాపణలు కోరుతున్నామని, ఈ కేసును కొట్టేయాలని అల్లు అరవింద్ ని అడిగినట్లు సమాచారం. అయితే చిరంజీవి కూడా ఈ గొడవకి ఇక్కడితో పులిస్టాప్ పెట్టమని, అల్లు అరవింద్ కి చెప్పినట్లు సమాచారం. చూద్దాం మరి అల్లు అర్జున్ ఏ విధంగా స్పందిస్తారు.