నిద్రపోయే ముందు జీలకర్రతో ఇలాచేస్తే రక్తం శుబ్రమైపోతుంది

జీలకర్ర, మనం జీలకర్రను జీరా రైస్ గా, పులిహోర ఫ్రైడ్ రైస్ లాగానే జీరా రైస్ ని మనం చేసుకుంటూ ఉంటాం. మరి హోటల్ కి వెళ్ళినప్పుడు కూడా జీరా రైస్ ఆర్డర్ చేసి తింటూ ఉంటాం. ప్రతి వంటకంలో కూడా జీలకర్ర లేకుండా ఏది ఉండదు.

ఇక పెళ్లి జరిగే సమయంలో కూడా మనం జీవితంలో మర్చిపోకూడదు అని తాళిబొట్టు కట్టకముందు జీలకర్ర బెల్లం మన నెత్తిమీద పెట్టిస్తారు. అంటే మనకు దైనందిన జీవితంలో జిలకర ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తుందో పెళ్లిలో కూడా అలాగే ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

ఇటువంటి జిలకర కొంతమంది భోజనం తినేటప్పుడు వేరేస్తూ ఉంటారు, ఇలా చేయాల్సిన అవసరం లేదు జీలకర్రలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి కనుక మనం దానిని తప్పకుండా తినాలి. కొంతమందికి పొట్ట విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది, ఇలా విపరీతమైన పొట్ట ఎవరికైతే ఉంటుందో ఆ కొవ్వు కరగడానికి ఈ జీలకర్ర అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఇనుము ఉంటుంది దీనివల్ల రక్తహీనత అనేది ఉండదు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు రక్తహీనత ఉండే అవకాశం ఉంటుంది.

స్త్రీలలో ప్రతి నెల పీరియడ్స్ సమయంలో రక్తస్రావం జరుగుతూ ఉంటుంది కనుక జీలకర్ర తినడం వల్ల మనకు కావలసిన రక్తం సమృద్ధిగా ఏర్పడుతుంది. ఈ జీలకర్రలో యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయి, బ్యాక్టీరియా, వైరస్ ,ఫంగస్ లాంటి ఈ సూక్ష్మ క్రిములను సూక్ష్మజీవులను శరీరంలో ప్రవేశించకుండా కాపాడుతుంది. చర్మం, జీలకర్రలో ఉండే విటమిన్ ఏ ప్రభావం వల్ల చర్మం నిగనిగలాడుతూ తర్వాత పొడిగా లేకుండా పగుళ్లు లేకుండా వేసవి కాలంలో చర్మము పేలకుండా చర్మం మీద కురుపులు రాకుండా కాపాడుతుంది జీలకర్ర.

జీలకర్ర తింటే ఎవరికైతే స్థూలకాయం భారీగా ఉందో వారు బరువు తగ్గుతారు, కొంతమందికి చర్మంపై ఎలర్జీలు ఉంటాయి, దురద వల్ల ఆయాసం, సైనస్, తుమ్ములు, దగ్గు అలాగే శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి. ఈ ఎలర్జీ సమస్యలన్నీ కూడా జీలకర్ర వల్ల తగ్గుముఖం పడతాయి, అంటే మనకు జీలకర్ర ఒక సిట్రజిన్ టాబ్లెట్ లాగా పనిచేస్తుంది.ధనియాలు జీలకర్ర రెండు కలిపి తీసుకోవడం వల్ల నీరసం తగ్గిపోతుంది, రక్తంలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటాయి. జీలకర్ర ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని రక్తంలో తగ్గించడం ద్వారా హార్ట్ ఎటాక్ గుండెపోటు రాకుండా పక్షవాతం రాకుండా కాపాడే గుణం జీలకర్రకు ఉంటుంది.

ఇక జీలకర్రను తీసుకోవడం వల్ల జీవశక్తి బాగా పెరుగుతుంది, కొంతమందికి వాంతులు వికారంగా ఉన్నప్పుడు ఆకలి లేనప్పుడు కూడా జీలకర్రను తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. గ్యాస్ సమస్యకు కూడా జీలకర్ర చాలా బాగా పనిచేస్తుంది. షుగర్ ఉన్నవారికి జీలకర్ర తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుంది. కొంతమందికి వివిధ కారణాల వల్ల నిద్ర పట్టదు, ఇలా నిద్ర పట్టని వ్యక్తులు ఇలా జీలకర్రతో తయారు చేసిన ఆహార పదార్థాలను తినడం లేదా తాగడం మంచిది. జీలకర్ర గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు చాలా శ్రేష్టం వారికి రక్తహీనత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జీలకర్ర రక్తహీనతను తగ్గిస్తుంది. జీలకర్ర మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది.

జీలకర్రలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది, ఈ క్యాల్షియం సమృద్ధిగా ఉండడం వల్ల పిల్లలు ఎదుగుదల అనేది బాగుంటుంది అలాగే పెద్దవారికి నడుము నొప్పులు, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ,మోకాళ్ళ నొప్పులు లేకుండా ఉంటాయి. అయితే ఎవరికైతే మూత్రపిండంలో రాళ్లు ఉండే చికిత్స చేసుకున్నారో అటువంటివారు ఈ జీలకర్రను తగ్గించి వాడడం మంచిది. ఎందుకంటే జీలకర్రలో ఉండే క్యాల్షియం ప్రభావం వల్ల మళ్లీ వచ్చే అవకాశం ఉంది కనుక కొంత తగ్గించి వాడవలసిన వారు ఎవరు అంటే మూత్రపిండంలో రాళ్లు ఉన్నవారు. కనుక మనం మన దైనందిన జీవితంలో వారానికి రెండుసార్లు మూడుసార్లు ఎలాగైతే ఫ్రైడ్ రైస్ పులిహోర చేసుకుంటున్నమో అలాగే మనం జీరా రైస్ ని చేసుకోవడం ద్వారా జీరా వల్ల వచ్చే ఔషధ గుణాలు పోషకాలు మనం పొందే అవకాశం ఉంటుంది.