ధనం మూలం ఇదం జగత్. ఈ ప్రపంచం మొత్తానికి మూలం ధనమే. అయితే మనం తినడం కోసం మన జీవితంలో జరిగే అన్ని విషయాలకు ధనాన్ని వాడుతూ ఉంటాం. కానీ ధనం విషయంలో చూసినట్లయితే మనకి ఎక్కువగా ఖర్చు అవుతూ ఉండడం లేదంటే రావాల్సిన డబ్బు రాకపోవడం ఎక్కువగా జీతం సంపాదించాలి వ్యాపారంలో లాభాలను పొందాలి అనుకునే వారికి సరైన డబ్బులు రాకపోవడం ఇలా రకరకాలుగా మనం ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతూ ఉంటాము.
అయితే ఈ సమయంలో మన జ్యోతిష్య శాస్త్రులతో పాటుగా వాస్తుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కొన్ని చిట్కాలను అయితే చెప్తున్నారు. ఇక ఆ చిట్కాలను పరిశీలించినట్లయితే మనం రెగ్యులర్ గా మన పర్సు గాని మన హ్యాండ్ బ్యాగ్ కానీ వాలెట్ కానీ ఏదో ఒకటి వాడుతూ ఉంటాం కదా డబ్బులు పెట్టడానికి లేదంటే క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ఇవి పెట్టుకోవడానికి వాడుతూ ఉంటాం కదా. అలాంటివి వాడేవారు ఒక చిన్న చిట్కా కనుక పాటించినట్లయితే చాలా మంచిదట.
ముందుగా మన పర్సులో ఉండకూడనివి ఏమిటంటే పాతవి చినిగిపోయినవి ఎప్పటిదో ఫోటోలు లేదంటే పాత బిల్స్ పేపర్లు లేదంటే అనవసరపు పార్కింగ్ టికెట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా వాటిని అస్సలు పెట్టుకోకపోవడమే మంచిది. మరి పర్సులో ఏమి పెట్టుకోవాలి అంటే, ఎక్కువగా మీరు ధనాన్ని నష్టపోతున్నారు అంటే, మీకు పది రూపాయలు వస్తే 20 రూపాయల ఖర్చు అవుతుంది ఖర్చులు తట్టుకోలేక పోతున్నాము చాలా బాధగా ఉంది అనుకునేవారు, ఒక చిన్న ఎరుపు రంగు కాగితంలో అంటే మనం మనీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం కదా,
అలాంటి పేపర్లో కానీ లేదా ఒక కవర్లో కానీ రెడ్ కలర్ కవర్లో 21 బియ్యపు గింజలు వేసి దానిని పర్సులో కానీ మీ వాలెట్లో కానీ మీ జేబులో కానీ డబ్బులు పెట్టే చోట పెడితే చాలా మంచిది. మరొక విషయం ఏమిటంటే మీ హ్యాండ్ బ్యాగ్ లో లక్ష్మీదేవి కానీ లేదా అమ్మవారు ఉన్నా రాగి కాయిన్ ఒకటి మీ హ్యాండ్ బ్యాగ్ లో కానీ మగవారు అయితే వాలెట్ లో కానీ పెట్టుకుంటే చాలా మంచిది. అది ధనాన్ని ఆకర్షిస్తుంది అంటారు ముఖ్యంగా రాగి ఎక్కడ ఉన్నా కూడా దాని పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా వ్యాపిస్తుంది అనేది కూడా మన పెద్దలు నమ్ముతూ ఉంటారు.
ఈ రెండు చిట్కాలు పాటించినట్లయితే చాలా చక్కగా మీ యొక్క ధనాభివృద్ధి పెరుగుతుంది. అయితే డబ్బు ఖర్చయిపోతుంది అనే బాధ కన్నా కూడా ఆ ఖర్చు దేనికి అవుతుంది, ఉదాహరణకి మీరు ఒక 10000 పెట్టి ఒక బంగారపు నగ కొన్నారు అనుకోండి అది చాలా మంచి ఖర్చు. అలాకాకుండా మీరు ఒక పది వేలు పెట్టి ఒక ఫోను లేదా హాస్పిటల్స్ కి మందులకి అయిపోయాయి లేదా పోగొట్టుకున్నాము అంటే అది ఒక చెడు ఖర్చు అన్నమాట. అందువల్ల మీరు ఏది ఎక్కడ ఎలా వాడుతున్నాము అనేది మీరు సరిగ్గా గమనించుకొని ఖర్చు పెట్టండి.