పళ్ళు తెల్లగా మెరిసిపోతాయి

పళ్ళు ఎర్రబడి ఉంటే పళ్ళు గార పట్టి ఉంటే వాటిని తెల్లగా చేసుకోవడానికి మనకు ఉండే అమోఘమైన ఔషధాలు ఏమిటి! కొంతమందికి పళ్ళు తెల్లగా ఉండాలని అనుకుంటూ ఉంటారు, దానికోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలా రకాల పేస్టులను వాడుతూ ఉంటారు. టీవీలలో యాడ్లను చూసి చూసి ఈ పేస్ట్ వాడితే బాగుంటుంది ఆపేస్ట్ వాడితే బాగుంటుంది దీంతో తెల్లగా కనబడతాయి టీవీలో అడ్వర్టైజ్ లో చూపించిన వ్యక్తికి చాలా తెల్లగా ఉన్నాయి అని భ్రమ పడుతూ ఉంటారు. కానీ నీ పళ్ళను శుభ్రం చేసుకునే విధానం మీకు తెలియకపోతే పళ్ళు తెల్లబడం కాదు కదా ఆ పళ్ళు అన్ని పాడైపోతాయి.

మీకు చెప్పే ఒక చిన్న విషయం ఏమిటంటే అది మీకు తెలిసిందే నోట్లో ఆహారం నమలి మింగి వేసిన తర్వాత ఆహార పదార్థాలు అక్కడే పళ్ళ మధ్యలో ఉన్నట్లయితే అది అక్కడ బ్యాక్టీరియాగా ఫామ్ అవుతుంది. దానివల్ల పళ్ళు పుచ్చిపోయే సమస్యలు వస్తున్నాయి. మరి పళ్ళు పుచ్చిపోయే సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని ఎవరు గమనించడం లేదు. మరొక విషయం ఏమిటంటే మనకు అందుబాటులో ఆహార పదార్థాలుగా తినేవి ఆరు రకాల రుచులను కలిగి ఉన్నాయి. ఈ ఆరు రకాలలో ఉప్పు, పులుపు,కారం తీపి, చేదు, వగరు ఈ ఆరు రకాల పదార్థాలని మీరు ఒకచోట కుప్పలుగా పోయండి, ఇక్కడ ఎక్కువగా చీమలు కాని పురుగులు కానీ ఏవైనా సరే ఎక్కువగా దేనిని ఆకర్షిస్తాయి అంటే, మొదటగా స్వీట్ గా ఉండే పదార్థాన్ని అంటే చక్కెర లేదా బెల్లం వంటి వాటిని ఆకర్షిస్తాయి.

అంటే మన నోట్లో కూడా మనo ఆహారం మధురమైనవి తీయగా ఉండేది ఎక్కువగా తింటూ ఉంటాం. ఇవి తిన్నప్పుడు పల్లల్లో ఇరుక్కుపోయేవి కొన్ని ఉంటాయి దాంతో మీరు తీయటి పేస్టు తోనే మళ్లీ పళ్ళు తోముతున్నారు. మీరు ఎప్పుడు ఎక్కువగా తీయటి పదార్థాలను తింటున్నారు అలాగే పళ్ళు తోమడానికి కూడా తీయటి పదార్థాలనే వాడుతున్నారు. ఆ తీయటి పదార్థాలు మీకు 12 గంటల పాటు పవర్ ఉంటుంది 24 గంటల పాటు సువాసన ఉంటుంది అని టీవీ యాడ్ లో చెప్తూ ఉంటారు. అంటే మీకు ఆ తీయదనం అనేది 12 గంటలు 6:00 24 గంటలు ఉన్నట్లే కదా అంటే దాని గుణాలు అక్కడే ఉంటాయి. మరొక విషయం ఏమిటంటే మనకు ఈ టూత్ పేస్టు లలో శాకరిన్ అనే స్వీట్ పదార్థాన్ని వాడుతారు.

అది దేని నుండి తయారు అవుతుంది అంటే అది కూడా చక్కెర నుండే తయారవుతుంది, ఈ చక్కెరతో బై ప్రొడక్ట్స్ గా ఒక 50 రకాలుగా ఉంటాయి ఇవన్నీ కూడా చక్కెరతో తయారయ్యింది. ఇలా తీయటి పదార్థాలు తినడం వల్ల అలాగే తీయటి టూత్ పేస్టులతో బ్రష్ చేసుకోవడం వల్ల బ్యాక్టీరియా అనేది వాటినే ఆకర్షిస్తుంది. దీంతో మీకు పళ్ళు పుచ్చిపోవడం కానీ లేదా పళ్ళు ఎర్రబడడం కానీ లేదా పళ్ళు గార పట్టడం , అలాగే పళ్ళు పసుపు రంగులోకి మారడం గానీ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వారు కొంతమంది నవ్వడానికి కూడా సిగ్గుపడతారు, పళ్ళు చూపించడానికి బాధపడతారు. కొంతమందికి ఎలాంటి టూత్ పేస్టులు వేసి పళ్ళు రుద్దినా కానీ వారికి పళ్ళు తెల్లబడవు ఇలాంటివారు ఒక పల్లపుడిని మీరే తయారు చేసుకోవాలి అది కూడా తీయటి పదార్థాలు కలవకుండా.

తీయటి పదార్థాలు కలిస్తే వచ్చే సమస్యలు ఏమిటో మనం తెలుసుకున్నాం కదా కాబట్టి తీయటి పదార్థాలు కలవకుండా నేచర్లో చాలా రకాల ద్రవ్యాలు ఉన్నాయి. దీంట్లో మనకు అద్భుతమైనది పటిక, ఇది తీయగా ఉండదు కాస్త వగరుగా ఉంటుంది, మనం ఈ పటికను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని నీటిలో వేయండి తర్వాత దీనిని సన్నని మంటపై ఉంచండి ఇది మొత్తం కూడా అప్పుడు కరిగిపోయి ఒక లిక్విడ్ లాగా తయారవుతుంది దానిపైన ఒక మలిన పదార్థం లేయర్ లాగా వస్తుంది దానిని తొలగించండి. ఆ తర్వాత దీనిని ఒక పాత్రలోకి వడకట్టుకోవాలి అది చల్లారిన తర్వాత గడ్డ కడుతుంది ఒక రోజంతా అలా ఉంచండి పొడి లాగా తయారవుతుంది, దీన్ని పళ్ళు తోముకోవడానికి ఉపయోగించినట్లయితే పళ్ళు చాలా తెల్లబడతాయి శుభ్రంగా ఉంటాయి.