పెళ్లికూతురుగా మారి పెళ్ళికి రెడీ అవుతున్న అమృత ప్రణయ్..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హ*** దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తన కూతురు అమృత తక్కువ కులానికి చెందిన ప్రణయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని తన పరువు తీసింది అనే కోపంతో మారుతి రావు అనే వ్యాపారి కిరాయి హంతకులతో ప్రణయ్ ను అత్యంత దారుణంగా హ*** చేయించాడు.

నిండు గర్భిణిగా ఉన్న కూతురు ముందే అల్లుడిని నరికించేసాడు మారుతి రావు. ఆ తర్వాత జైలు పాలైన మారుతి రావు బెయిల్ పై బయటకు వచ్చి మనోవ్యదతో ఆత్మహ** చేసుకుని చనిపోయాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకోలేదు. తన బిడ్డను చూసుకుంటూ జీవితం గడుపుతోంది అమృత. యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోలు చేస్తుంది. అయితే, అమృత మళ్లీ పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జోరుగా సాగుతోంది.

పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలు ఏమాత్రం నిజం లేదని తేలింది. అమృత రెడీ అవుతోంది తన పెళ్లి కోసం కాదని, తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి కోసమని తెలియ వచ్చింది. మూడు రోజుల క్రితం ఆమె తన అఫీషియల్ యూట్యూబ్ ఖాతాలో ఓ వీడియోను విడుదల చేశారు. “నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కు నా హడావిడి” అని రాసుకొచ్చింది. ఫ్రెండ్ పెళ్లి కోసం తాను ఎలా తయారు అవుతుందో ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. అయితే, ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది. దీంతో అమృత మళ్లీ పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వైరల్‌ అయ్యాయి.