పెళ్లి కూతురు ముందు పెళ్లి కొడుకు స్నేహితులు చేసిన

వందేళ్ల జీవితానికి పెళ్లి అనేది ఒక ముఖ్యమైన మజిలీ కానీ, ముందు తమ ఇష్టాలు కోరికలు, కలల గురించి చర్చించుకోకపోతే, ఆ తర్వాత బాధపడాలి. అలాగే తమ స్నేహితుడు పెళ్లి తర్వాత ఎక్కడ తమకు దూరం అవుతాడు అని చెప్పేసి, కొంతమంది స్నేహితులు పెళ్లి మండపం లోనే వధువు ముందు, ఒక వింత ప్రతిపాదనను తీసుకోవచ్చారు.

ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. జరిగిన విషయం ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం. హరిప్రసాద్ అనే వ్యక్తికి, మధురై కి చెందిన పూజ అనే యువతీతో తాజాగా వివాహం జరిగింది. హరే ప్రసాద్ తేనిలోని ఒక ప్రైవేటు కాలేజీలో టీచర్ గా పనిచేస్తున్నాడు. అలాగే సూపర్ స్టార్ క్రికెట్ క్లబ్ కు కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే వివాహం తర్వాత తమ స్నేహితుడు ఎక్కడ క్రికెట్కు దూరం అవుతాడు అని,

ఎక్కడ తన భార్య క్రికెట్కు అనుమతించదు అని అనుమానం వ్యక్తం చేసిన హరిప్రసాద్ స్నేహితులు, వివాహ వేదిక పైనే పెళ్లి కూతురుకి ఒక షరతు విధించారు. వారాంతరాలు అంటే శని ఆదివారాలలో హరిప్రసాద్ను క్రికెట్ ఆడెందుకు అనుమతించాలని, పూజను కోరారు కేవలం మాట మాత్రమే కాకుండా బాండ్ పేపర్ పైన రాసి ఇవ్వాలని వాళ్లు బలవంతం చేసుకొచ్చారు వాళ్లు తనని ఆటపట్టిస్తున్నారేమో అని భావించింది కానీ, ఏకంగా 20 రూపాయల బాండ్ పేపర్ ని తీసుకువచ్చి, సంతకం చేయమని కోరడంతో, నవవధువు షాక్ అయింది.

ఇదే వింత విచిత్రం రా బాబు అంటూ తల పట్టుకుంది. క్రికెట్ విషయంలో స్నేహితులకు ఉన్న పట్టుదలను చూసి, స్నేహం కన్నా క్రికెట్ కన్నా గొప్పదేమీ కాదని, చెప్పేసి వారంతారాలలో చక్కగా ఆడుకోవడానికి వెళ్లండి, అని చెప్పి పట్టుబట్టలను చూసి ఆమె సంతకం చేయక తప్పలేదు. అయితే ఇంతకీ దానిలో ఏమి రాసిందంటే పూజ అనే నేను, నా భర్త సూపర్ స్టార్ టీం క్రికెట్ జట్టు కెప్టెన్ హరిప్రసాద్ను, శని ఆదివారాలలో క్రికెట్ ఆడేందుకు అనుమతిస్తానని, బాండ్ పేపర్ పై రాసి సంతకం చేసింది. ఈ సన్నివేశం పెళ్లి మండపంలో నవ్వులు పోయించగా, ప్రస్తుతం సోషల్ మీడియాలోనే ట్రెండింగ్ గా మారిపోయింది.

పెళ్లికి విచ్చేసిన అతిధులు కూడా ఈ ఘటన చూసి ముందు షాక్ అయినా, ఆ తర్వాత ఇదే విచిత్రం రా బాబు అనుకున్నారు. అయితే హరే ప్రసాద్ స్నేహితుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ, సూపర్ స్టార్ క్రికెట్ క్లబ్ టీం సభ్యులు చాలామంది పెళ్లి తర్వాత ఆటను వదిలేసారని, భార్య నుంచి అనుమతి తీసుకొని ఆడాలని ఉన్న, ఆడ లేకపోయారని ఇది చెప్పడానికి చిన్న విషయమే కానీ, క్రికెట్ అనేది ఒక ఎమోషన్ తో కూడుకున్నదని, వాళ్లు అన్నారు. దాంతో అందరూ ఒప్పుకోక తప్పలేదు.