టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్ ఎవరైనా ఉన్నారా అంటే, అది ప్రభాస్ మాత్రమే, 40ఏళ్ల వయసు దాటిన, ప్రబాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అతడే పెళ్లి చూడాలని కోరిక తీరకుండా పెదనాన్న కృష్ణంరాజు తుది శ్వాస విడిచారు.
ఆయన బ్రతికి ఉండగా ప్రభాస్ కి పెళ్లి చేయాలని ఎంతో ప్రయత్నించారు. ప్రభాస్ కోసం ఒక మంచి అమ్మాయిని వెతుకుతున్నామని, ప్రభాస్ పెళ్లి చేసుకుంటే అందరికంటే ఎక్కువ సంతోషించేది తానేనని, ఇప్పుడు అతడితో కలిసి నటించాలని
రేపు వారి పిల్లలతో కూడా నటించాలని ఉందని కృష్ణంరాజు తన మనసులోని మాటను బయటపెట్టారు. కానీ బాహుబలి తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఉండటం వల్ల, ప్రభాస్ పెళ్లి చేసుకోలేకపోయాడు. అంతేకాకుండా గతంలో త్రిష ఇటీవల అనుష్కతో పెళ్లి చేసుకుంటాడని, వార్తలు వచ్చిన అవి కార్యరూపం దాల్చలేదు. ముఖ్యంగా అనుష్క ను పెళ్లి చేసుకునేందుకు ప్రభాస్ పెదనాన్న ఒప్పుకోలేదని,
ఫిలిం నగర్ లో ప్రచారం జరిగింది. అయితే అవన్నీ ఒట్టి పుకార్లేనని కృష్ణంరాజు కొట్టి పారేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎవరి మాట ఎలా ఉన్నా ఇప్పటివరకు అటు ప్రభాస్ ఇటు అనుష్క అయితే పెళ్లి చేసుకోలేదు, తాజాగా కృష్ణంరాజు భౌతికంగా లేకపోవడంతో ప్రభాస్ తనకు ఇష్టమైన అనుష్కను పెళ్లి చేసుకుంటాడని, టాక్ నడుస్తోంది. ఈ విషయంపై కృష్ణంరాజుకు ఎంతో సన్నిహితుడైన నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు ఇటీవల మాట్లాడారు.
ఇంకా చెల్లిలా పెళ్లిలు చేయాల్సిన బాధ్యత ప్రభాస్ మీద ఉందని, ఇక అతడి పెళ్లి కూడా త్వరలో జరిగితే కృష్ణంరాజు ఆత్మ సంతోషిస్తుందంటూ చెప్పారు. అనుష్కతో ప్రభాస్ పెళ్లి జరిగితే బాగుంటుంది అంటూ, వ్యాఖ్యానించారు. కృష్ణంరాజు చనిపోయిన ఏడాది లోపే పెళ్లి అయిపోతుంది అంటూ, అభిప్రాయపడ్డారు. పాన్ ఇండియా సినిమాల కారణంగా ప్రభాస్ హైదరాబాద్లో తక్కువగా, ముంబైలో ఎక్కువగా ఉన్నాడని పెళ్లి చేసుకోవడానికి సమయం ఇప్పట్లో కేటాయించడం, కాస్త కష్టమేనని పేర్కొన్నారు.
ఇటీవల కృష్ణంరాజు ఆసుపత్రిలో ఉన్న సమయంలో ప్రభాస్ తో పాటు అనుష్క కూడా ఒకేసారి ఎక్కడికి వెళ్లి పరామర్శించడం, ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ సీక్రెట్ గా చిట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారని, పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారని, పెళ్లి తర్వాత ఉండడానికి అమెరికాలో ఇల్లు కూడా కట్టుకున్నారు అంటూ, ఎన్నో పుకార్లు సోషల్ మీడియాలో గొప్పమన్నాయి. అయితే సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత జీవితం పై వస్తున్న వార్తలపై హీరో ప్రభాస్ లేదా అనుష్క ఎవరు ఖండించలేదు.
కనీసం స్పందన కూడా ఇవ్వలేదు, దీంతో ఈ విషయంలో ఎంతో కొంత నిజం ఉందని నిటిజన్లు భావించారు. అందుకే ఇప్పుడు అప్పుడప్పుడు జనాలు మర్చిపోకుండా, ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఎవరో ఒకరు చర్చలు పెడుతూ ఉంటారు. ఇటీవల కృష్ణంరాజు మరణంతో మరోసారి వీరి పెళ్లిగోల వినిపిస్తోంది. మరోవైపు ఇటీవల అనుష్క శెట్టి పెళ్లి ఫిక్స్ అయిందని, ఆమె బెంగళూరుకు చెందిన ఒక బిజినెస్ పర్సన్ ను పెళ్లి చేసుకుంటుందని టాక్ వినిపించింది.
అయితే ప్రభాస్ తో చాలా సినిమాల్లో నటించిన అనుష్కకి కృష్ణంరాజుతోపాటు ప్రభాస్ కుటుంబంతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే కృష్ణంరాజు ఆరోగ్య విషయం తెలుసుకున్న వెంటనే, ఆమె ఆయనను చూసేందుకు ఆస్పత్రికి వెళ్ళిందని కొందరు వాదిస్తున్నారు. ఆ తర్వాత అనుష్క సోషల్ మీడియా వేదికగా ఆయన మరణానికి చింతిస్తూ, ఎమోషనల్ గా కూడా అవ్వడంతో ప్రభాస్తో ప్రేమ లేకపోతే ఇలా జరుగుతుందా. అంటూ మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా ప్రభాస్ అనుష్క పెళ్లిలకు సమయం ఎప్పుడు వస్తుందో, కాలమే సమాధానం చెప్పాలి.