పొట్టలోని గ్యాస్ ని 2నిమిషాల్లో బయటకు పంపుతుంది.. గ్యాస్, ఎసిడిటీ దూరం

కోటి విద్యలు కోటి కొరకే అంటారు. మరీ ప్రత్యేకంగా చెప్పాలి అంటే, జానెడు పొట్ట కోసం ఈ తిప్పలన్నీ అనేవారు, తరచు మనకు కనిపిస్తూనే ఉంటారు.

ఈ జానడు పొట్ట కాస్త మన మీద తిరగబడింది అనుకో, లేక బానడు పొట్ట అయింది అనుకోండి, ఎంత కష్టమో కదా. ఇక్కడ పొట్ట గురించి డిస్కషన్ కాదు కానీ, పొట్ట లోపల ఏమి జరుగుతుందో దాని కోసం మనం మాట్లాడుకుందాం.

మీరు టీ కాఫీలు ఎక్కువగా తాగుతున్నారా, పనిలో పడి ఆకలిని మర్చిపోతున్నారా, ఇక ఎక్కువసేపు అలానే కదలకుండా కూర్చుని పని చేస్తున్నారా, అయితే ఈ సమాచారం మీ కోసమే. మన ఈ చిన్నిపొట్టే సకల రోగాల గుట్ట, అందుకే పొట్టను శుభ్రంగా ఉంచుకోవాలి, ప్రధానంగా మనల్ని ఇబ్బంది పెట్టే ఒక పెద్ద సమస్య ఏంటంటే గ్యాస్ ట్రబుల్ .ఈ సమస్య ద్వారా పొట్ట మనకు చెప్పే విషయం ఏమిటి అంటే, పొట్టని మనం నిర్లక్ష్యం చేస్తున్నామని. అంతేకాదు దాని ఒక డస్ట్పిన్ మార్చమని చెప్పకనే చెబుతుంది.

నిజమే ఈ గ్యాస్ మన పొట్టలో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి కావడం వలన, కడుపు ఉబ్బరిస్తుంది. అదే మనం గ్యాస్ ట్రబుల్ గా గుర్తించాల్సి ఉంటుంది. మరి ఈ గ్యాస్ ట్రబుల్ నుండి బయట పడాలంటే ఎలా, మందులు వాడకుండా ఏదైనా హోం రెమెడీ ఉందా, పొట్టను ఎలా గ్యాస్ ట్రబుల్ నుండి కాపాడుకోవాలి వంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గ్యాస్ ట్రబుల్ గురించి మొదట మీరు భయపడడం మానేయండి. ఎందుకంటే ఈ సమస్య ఆడ మగ అందరిలోనూ సర్వసాధారణం. అయితే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులో ఏది ఉన్నా, అది ప్రాబ్లమే కాబట్టి, ఈ గ్యాస్ కూడా ఇంతే అందరిలో కంటే మీకు ఎందుకు ఎక్కువ గ్యాస్ పెరుగుతుందో గమనించండి.

ముందుగా మనం చెప్పుకున్నట్లుగా టీలు, కాఫీలు అధికంగా తీసుకుంటున్న వేలకి తినకపోయినా, ఎక్కువసేపు కదలకుండా కూర్చున్న, సరైన వ్యాయామం శరీరానికి లేకపోయినా, అన్నింటికంటే ముఖ్యంగా అధికంగా మసాలాలు, జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్స్ వాడడం వలన ఈ గ్యాస్ ట్రబుల్ సమస్య వస్తుంది. కొంతమందిలో కొంచెం తిన్నా సరే పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. కారణం వారి జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేదని అర్థం. ఈ గ్యాస్ ట్రబుల్ కి మరో ప్రధాన కారణం ఏమిటంటే మలబద్దకం. జీర్ణవ్యవస్థ సరిగ్గా ఉంటే చాలు, రోగాలకు మనం దూరంగా ఉండవచ్చు, జీర్ణవ్యవస్థ చక్కగా ఉండాలి అంటే ,ఉదయం లేవగానే ఒక అర లీటర్ నీటిని తీసుకోండి. మిగతా పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.