హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక అద్భుతమైన హోం రెమడీ గురించి తెలుసుకుందాం. దీనివల్ల మీరు కోల్పోయిన మీ శక్తిని తిరిగి పొందుతారు. శరీరంలో ఉన్న నీరసాన్ని చాలా త్వరగా తగ్గించుకోవచ్చు. మీకు రోజంతా బలహీనంగా నీరసంగా అలసటగా ఉన్నా ఇవి తినడం వలన మీకు ఎప్పుడూ కూడా నీరసం ఉన్నట్టు అనిపించదు. ఒకవేళ మీ శరీరంలో రక్తం తక్కువగా ఉన్నారు మీ ముఖం పాలిపోయి ఎప్పుడు డల్ గా ఉన్నా వీటన్నింటికీ రామ బాణం లాంటిది ఈ రెమిడీ. మీరు జిమ్ కి వెళ్తున్నట్టు అయితే మీ దేహాన్ని కండలు తిరిగిన బాడీ లాగా తయారు చేయాలన్న ఈ డైట్ ను కచ్చితంగా ఫాలో అవ్వండి. పూర్తి వివరాలకు ఈ కింది వీడియో చూడండి ..
కొన్నిసార్లు మనం మనకు తెలియకుండానే ఎవరినైనా అన్య వ్యక్తిని చూసినప్పుడు వారికి ఆకర్షితులవుతాము . వారి ముఖంలో ఉన్న గ్లోయింగ్ పొడవుగా ఒత్తుగా ఉన్న వెంట్రుకలు మంచి దేహదారుఢ్యం వీటిని చూసి మనం ఆలోచనలో పడిపోతాం. ఎందుకు నేను కూడా ఇలా లేను వీళ్లకు నాకు ఉన్న తేడా ఏంటి వీళ్ల దగ్గర ఏముంది నా దగ్గర ఏం లేదు అని మనసులో అనుకుంటూము. ఇంకా వీరు ఏదైనా ఖరీదైన ఆహారం తింటూ ఉంటారెమో అనుకుంటూ ఉంటాం అందుకే ఇంత ఫిట్ గా ఇంత అందంగా ఇంత ఆకర్షణీయంగా ఉన్నారు అని అనుకుంటాం. మీరు కూడా అలా అనుకున్నట్లయితే మీ ఆలోచన తప్పు ఎందుకంటే మీరు అనుకుంటే మీరు కూడా ముఖంపై గ్లోయింగ్ పొడవైన ఒత్తైన జుట్టు ఆకర్షణీయమైన ముఖం ని మంచి దేహదారుఢ్యం పొందవచ్చు. ఇందుకోసం మీరు ఖరీదైన పదార్థాలను తినాల్సిన పని లేదు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేను ఇప్పుడు చెప్పబోయే ఏ పదార్థాలు తినడం వలన మీ ఆరోగ్యం పై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతాయి.
ఈ రెమిడి కి కావలసిన పదార్థాలు
ఆ పదార్థాలు ఏంటంటే కిస్మిస్లు బాదం పప్పు పెసరపప్పు పల్లీలు శనగలు. వీటిని ఎంత మోతాదులో తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పబోయే విధంగా ఒక నెల రోజుల పాటు వీటిని తీసుకుంటే మీ కల సాకారం అవుతుంది. శరీరం లో నీరసం పూర్తిగా తొలగిపోతుంది శరీరం పుష్టిగా బలంగా దృఢంగా తయారవుతుంది. మీ ముఖం కాంతివంతంగా తయారవుతుంది మీ ముఖంపై గ్లోయింగ్ పెరుగుతుంది ఎంతో అందంగా కనిపిస్తారు.
రెమిడీ తయారీ విధానం
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసు నీటిని పోయండి. ఇందులో 20 నుండి 25 వరకు కిస్మిస్లను కడిగి వేయండి. దీనిపై ఒక మూతనుంచి రాత్రంతా అలాగే ఉంచండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసి 4 నుండి 5 బాదంపప్పులను, 10 నుండి 15 పల్లీలను, సగం పిడికెడు శనగలను, సగం పిడికెడు పెసరపప్పు గింజలను వేసుకోవాలి. బాదం మరియు పల్లీలతో కలిపిన నీటిని రాత్రంతా నానబెట్టండి.
ఈ రెమిడీ ఎలా వాడాలి
ఉదయాన్నే నిద్ర లేచి బ్రష్ చేసుకున్న తర్వాత నానబెట్టిన వీటన్నింటిని నీటిలో నుంచి తీసుకుని నీటిని పారవేసి వీటిని బాగా నమిలి తినండి. బాదం పప్పు మాత్రం తోలు తీసి తినండి. అదేవిధంగా నానబెట్టిన కిస్ మిస్ లను కూడా తినండి. కిస్మిస్లు నానబెట్టిన నీటిని అలాగే తాగేయండి. ఎందుకంటే ఈ నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మంచివి.
చాలా మంది ఉదయాన్నే సెనగలు తింటే సరిగా అరక గ్యాస్ ఫామ్ అవుతుంది అని అంటుంటారు. దీనికి గల కారణం మీ జీర్ణశక్తి తక్కువగా ఉండడం. ఇందుకోసం ఆయుర్వేదం ప్రకారం మీరు అన్నాన్ని బాగా నమిలి నమిలి తినాలి. ఇలా నమిలి తినడం వల్ల మీ నోటిలో లాలాజలం ఊరుతుంది. ఈ లాలాజలం మీ కడుపు లోకి వెళ్లి మీరు తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. మనము ఆహారాన్ని నమలకుండా తినేసి గబగబా నీటిని తాగేస్తూ ఉంటాం ఇలా చేయడం చాలా తప్పు. దీనివల్ల తిన్న ఆహారం జీర్ణం అవ్వదు జీర్ణం కాకపోవడం గల ఒకే ఒక కారణం మన లాలాజలం తినే పదార్థాలతో తినే భోజనం తో కడుపులోకి సరిగ్గా వెళ్లకపోవడం ఈ కారణం వల్లనే డైజేషన్ ప్రాబ్లం వస్తుంది. అందుకే మనం ఏదైనా ఆహారం తినేటప్పుడు నిదానంగా బాగా నమిలి తినాలి. మీరు జిమ్ కి వెళ్తున్నావా లేదా వర్కౌట్ చేస్తున్న వీటిని 45 నిమిషాల ముందే తినేయండి.
ఇలా మీరు కొన్ని రోజులు ఈ రెమిడిని పాటించడం వల్ల మీ శరీరంలో మార్పును గమనిస్తారు. శరీరంలో ఉన్న నీరసం పూర్తిగా తొలగిపోతుంది. శరీరంలో ఉన్న బలహీనత అలసట దూరమౌతుంది. ముఖం పై ముడతలు కనిపించవు మీ ముఖం పై వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా పోతాయి. ముఖం ఫ్రెష్ గా కనిపిస్తుంది మలబద్ధకం సమస్య తొలగిపోతుంది మళ్లీ మీకు మలబద్దక సమస్య ఎప్పటికీ రానే రాదు. ఇమ్యూనిటీ బలంగా తయారవుతుంది శరీరంలో ఉన్న రక్తహీనత తొలగిపోతుంది. ఒకవేళ మీ శరీరంలో చెడు రక్తం ఉన్నా వీటిని తినడం వల్ల మీ రక్తం శుభ్రం అవుతుంది. బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది ఒకవేళ మీకు హైబీపీ సమస్య ఉన్నా సరే వీటిని తిని చూడండి మీ బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ అవుతుంది.
డయాబెటిస్ పేషంట్స్ కు ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీ షుగర్ లెవెల్ ఎప్పుడు కంట్రోల్ లో ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఈ డైట్ ను ఖచ్చితంగా వాడి చూడండి. ఇంతే కాకుండా మీకు కంటి సమస్యలు ఉన్నా దూరం దగ్గర వస్తువులు కనపడకపోవడం కంటి అద్దాలు వాడుతున్న అలాంటి వారు కూడా తప్పకుండా ప్రయత్నించి చూడండి. మీ వెంట్రుకలు రాలిపోతున్నా హెయిర్ ఫాల్ ఉన్నట్లయితే అది కూడా కంట్రోల్ అవుతుంది. ఇవి తినడం వల్ల మీ మెదడు మెమరీ పవర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. వీటిని చిన్న పిల్లలకు కూడా తినిపించవచ్చు. కానీ క్వాంటిటీ కొంచెం తగ్గించి తినిపించండి.
మీరు పెరుగుతున్న బరువును చూసి బాధపడుతున్నట్లయితే ఈ రెమిడి ని వాడి చూడండి మీ బరువు కంట్రోల్లో ఉంటుంది. మీ బాడీ ఫిట్ గా తయారవుతుంది. మీరు పోలీసు లేదా మిలిటరీ లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్టు అయితే అలాంటి వారు వీటిని రెండు నుంచి మూడు సంవత్సరాలు క్రమం తప్పకుండా తినండి దీనివల్ల మీ శారీరక సామర్థ్యం పరిగెత్తే సామర్థ్యం జబర్దస్త్ గా పెరుగుతుంది.