పామును చూస్తేనే మనకి ఒళ్లంతా షివరింగ్ అవుతుంది. పాముల్లో కింగ్ కోబ్రా తిరే వేరు. ఆ కింగ్ కోబ్రా పడగ విప్పి నిలువెత్తు నిలబడి బుస్ బుస్ మంటూ మన ఎదురుగా వుంటే….ఇంకెముంది ప్రా..ణాలు గాల్లోనే కలిసిపోతాయి. ఈ పాములు మనల్నే కాదు వాటిని ఎంతో ప్రేమించి జనాలు చం…పకుండా కాపాడే స్నేక్ క్యాచర్స్ ని కూడా భయపెడతాయి. ఎంతో భయంకరమైన విషపూరితమైన పాములను ఈ స్నేక్ క్యాచర్స్ అలవోకగా దారిలోకి తెచ్చుకుంటారు.
ఒక్కొసారి పది అడుగుల పైన వుండే కింగ్ కోబ్రాలను పట్టుకుంటారు. అన్ని సార్లు కింగ్ కోబ్రాలు ఒకేలా వ్యవహరించవు. ఆ స్నేక్ క్యాచర్ గుండె గట్టిది కాబట్టి ఆ కింగ్ కోబ్రా భయపెట్టిన భయపడలేదు. దాదాపు పది అడుగుల పొడవు వున్న కింగ్ కోబ్రా ను పట్టుకునే క్రమంలో ఓ స్నేక్ క్యాచర్ దాని తోక పట్టుకున్నాడు. క్షణాల్లో సర్రుమంటు వెనక్కి తిరిగి మనిషి అంత ఎత్తు తోకపై నిలబడి బుసలు కొట్టింది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అయింది.
ఈ స్నేక్ క్యాచర్ ఏ పామునైనా పట్టుకుని జనావాసాలకు దూరంగా అటవీ ప్రాంతాల్లో వదిలేస్తుంటారు. కేరళలో వందలాది పాములను పట్టుకున్న స్నేక్ క్యాచర్ సురేష్ కి ఓ కింగ్ కోబ్రా భయాన్ని పరిచయం చేసింది. ఈ పాములు పట్టుకునే సమయంలో స్నేక్ క్యాచర్స్ ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా ప్రా..ణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. చాలా సందర్బాల్లో వీళ్లు పాము కాటుకి కూడా గురవతుంటారు. కింగ్ కోబ్రా లాంటి పాము కాటు వేస్తే ఆ మనిషి బ్రత..కటం చాలా కష్టం. దాదాపు 30 నిమిషాల్లోపే మనిషి తన ప్రాణాలను కోల్పోతాడు.
కోబ్రా విషం అంత పవర్ పుల్. అలాంటి కింగ్ కోబ్రా స్నేక్ క్యాచర్ సురేష్ ని కాటువేసేందకు ప్రయత్నం చేసింది. ఆ క్షణం స్నేక్ క్యాచర్ అప్రమత్తంగా లేకపోయి వుంటే అంతే సంగతులు. ఈ కింగ్ కోబ్రాను పట్టుకునే సమయంలో తీసిన వీడియోని ఐఎఫ్ ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్ తన ట్వీట్టర్ పేజ్ లో షేర్ చేశాడు. కింగ్ కోబ్రా లాంటి పామును ఎలా పట్టుకోకూడదో..ఎలా అదుపులోకి తెచ్చుకోకూడదో ఈ వీడియో చూస్తే చాలా చక్కగా అర్ధమవుతుందంటూ ట్వీట్ చేశారు.
కింగ్ కోబ్రాను అదుపులోకి తెచ్చుకునే విధానం ఇలా కాదన్నట్లుగా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వీడియోను గమనిస్తే….. ఓ భారీ సైజ్ వున్న కింగ్ కోబ్రా ఓ గదిలో వచ్చింది. ఆ పామును పట్టుకోవటానికి స్నేక్ క్యాచర్ సురేష్ వచ్చాడు. ఆ గది బయటికి కనిపిస్తున్న ఆ కోబ్రా తోక ను పట్టుకుని అదుపులోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ కింగ్ కోబ్రా ఊహించని రీతిలో రియాక్ట్ అయింది. తోక పట్టుకోగానే ఒక్కసారిగా పడగ విప్పుతూ సర్రున ఆ గది నుంచి బయటకొచ్చి ఆ స్నేక్ క్యాచర్ ఎదురు నిలువెత్తుగా తోక నిలబడింది.
ఈ దృశ్యం వీడియోలో చూస్తునే గుండె జలధరిస్తుంది. స్నేక్ క్యాచర్ సురేష్ గట్టొడు కాబట్టి తట్టుకుని నిలబడటమే కాదు…అలర్ట్ అయి దూరంగా జరగటంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే ఆ కింగ్ కోబ్రా కాటుకు సురేష్ బ…లైపోయేవాడు. అంత భయపెట్టిన ఆ కింగ్ కోబ్రాను స్నేక్ క్యాచర్ సురేష్ వదల్లేదు. ఈ సారి మరింత జాగ్రత్తగా దాన్ని అదుపులోకి తీసుకుని ఓ సంచిలో బంధించి అటవీ ప్రాంతంలో వదలిపెట్టాడు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఒకసారిగా పడవిప్పిన ఆ కింగ్ కోబ్రాను చూసే సరికి వణుకొచ్చేసిందని… ఆ స్నేక్ క్యాచర్ ఎంతో అదృష్టవంతుడని కామెంట్ చేస్తున్నారు. స్నేక్ క్యాచర్ ఆక్షణంలో చావును దగ్గర నుంచి చూశాడనడంలో ఎటువంటి సందేహం లేదు.