బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం 2023 జరగబోయేది ఇదే

బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎవరు అవునన్నా కాదన్నా, 2023లో జరగబోయే సంఘటనలు జరిగే తీరుతాయని పురాణాలు చెబుతున్నాయి. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులో సంభవిస్తాయో ముందుగానే ఊహించి, కాలజ్ఞానాన్ని రచించారు. ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానం లోని విషయాలు చాలా వరకు నిజంగానే జరిగాయి.

అయితే క్రీస్తు శకం 1608 లో వీర బ్రహ్మంగారు అవతరించి భవిష్యత్తులో జరగబోయే విపత్తులను, ఆయన ముందుగానే గ్రహించి, దానిని కాలజ్ఞానం అనే పేరుతో, ఎన్నో తత్వాల రూపంలో బోధించారు. మరి ఇప్పటివరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఏంటి, 2023 తర్వాత ఏమి జరగబోతుందో, ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రహ్మంగారు ఒక గొప్ప జ్ఞాని, ఆయన తండ్రి మరణించిన తర్వాత, తల్లి అనుమతితో బ్రహ్మంగారు పరబ్రహ్మణి చేరుకునేందుకు, ధ్యానం ఒక మార్గం అని చెప్పి, ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు.

అలా వెళ్ళిపోయిన బ్రహ్మంగారు ఒకరోజు రాత్రి అచ్చమ్మ గారి ఇంటి బయట నిద్రించాడు, మరుసటి రోజు ఉదయం ఆమె ఎవరు నీవు అని అడగగా, బ్రతుకు తెరువు కోసం వచ్చాను, ఏదైనా పని ఉంటే చెప్పండి అంటే, అప్పుడు అచ్చమ్మ తన దగ్గర ఉన్న గోవులనుతోలు కెళ్ళమని చెప్పగా, బ్రహ్మంగారు కోవుల కాపరిగా మారాడు. గోవుల కాపరిగా మారిన తర్వాత కాలజ్ఞానాన్ని మొదలు పెట్టేందుకు నిర్ణయించుకున్న, వీరబ్రహ్మేంద్రస్వామి, అక్కడ ఉన్న ఒక తాటి చెట్టు ఆకులను కోసుకొని కొండ గుహలో రాయడం మొదలుపెట్టాడు. పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు, రకరకాల సందర్భాలలో వేరువేరు వ్యక్తులకు తెలియచెప్పారు.

అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతి పెట్టారు, ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు చేశారు అనేదానికి మాత్రం ఇప్పటివరకు జవాబు దొరకలేదు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటివరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే, కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుతుందని చెప్పారు, ఆయన చెప్పిన విధంగానే 1910 నుంచి 12 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి, ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం నో సందర్శించేందుకు భక్తులు ఎవ్వరూ వెళ్ళలేదు. రాచరికలు రాజుల పాలన వస్తాయని చెప్పాడు . ఇప్పుడు భారతదేశంలో రాచరికపు వ్యవస్థ అనేది లేదు, ఒక అమ్మ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది అన్నాడు, ఇక ఇందిరా గాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు.