బ్రహ్మ ముహూర్తంలో ప్రతిరోజు 11 సార్లు 3 అక్షరాల వారాహి నామం

అమ్మవారి అనుగ్రహంతో సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలు ఐశ్వర్య అభివృద్ధితో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనము అమ్మవారి అనుగ్రహం వలన, శ్రీ మహా వారాహి మంత్ర కృపతో ఆ తల్లికి సంబంధించిన మంచి విషయాన్ని మనం తెలుసుకుందాం.

మనలో చాలామందికి ప్రతినిత్యం కూడా ఎన్నో రకాలైన పనులు చేస్తూ ఉంటాం, అయితే ఆ పనులన్నింటికీ కూడా ఏ ఆటంకాలు లేకుండా చక్కగా జరిగేందుకు, ఆ వారాహిమాత అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా బ్రహ్మ ముహూర్తంలో ఆ అమ్మని ప్రేమతో ఈ మూడు అక్షరాల నామంతో ధ్యానం చేసినట్లయితే, ఇంకా ఈ పని జరగదు అని మన జీవితంలో ఉండదు.

ఎందుకంటే మనం అమ్మని ఆర్తితో పిలిస్తే అమ్మ నామము అంటే వారాహి అనే నామమే, ఒక మంత్రం లాగా పనిచేస్తుంది. అదే కాకుండా ప్రేమతో అమ్మని పిలిస్తే ఆర్పితో ఆ తల్లిని పిలిచినట్లయితే, ఏంటి నాయనా అంటూ మన ముందు ప్రత్యక్షమవుతుంది. అలాంటి ప్రేమ స్వరూపిణి వారాహి మాత అంటే, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా కోరిన కోరికలు తీర్చేందుకు తను మనకు తప్పకుండా సహాయం చేస్తుంది.

మనం ప్రతినిత్యం కూడా బ్రహ్మ ముహూర్తంలో మూడున్నర నుంచి ఐదు గంటల లోపల నిద్రలేవగానే ఆ తల్లికి సంబంధించినటువంటి ఈ మూడు అక్షరాల నామాన్ని కనుక పట్టించినట్లయితే, ఇక ఈ పని జరగదు అనే మన మాట జీవితంలో ఉండదు. అప్పటివరకు కూడాను ఎన్నో పనులు ఆగిపోయిన పనులు కూడా ఆ తల్లికి చెప్పుకొని ఆ మూడు అక్షరాల నామాన్ని ధ్యానం చేస్తే, తప్పకుండా ఆ పని జరిగే తీరుతుంది.

అయితే బ్రహ్మ ముహూర్తంలో చదవాలనే విషయం ఏమీ అవసరం లేదు కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో చదివితే చాలా మంచిదని చెబితే పెద్దవాళ్ళు చెబుతారు. అది ఒకటే కాకుండా బ్రహ్మ ముహూర్తంలో ఈ నామాన్ని ఎందుకు చదవాలి అంటే, బ్రహ్మ ముహూర్తంలో మన వారాహి అమ్మవారు సంచారం కోసం భూమండలం అంతా తిరుగుతూ ఉంటారు. చాలామందికి తెలిసే ఉంటుంది, కాశీలో ఉన్నటువంటి ఉగ్రవారాహిమాత దర్శనం కూడా మనకి బ్రహ్మ ముహూర్తంలోనే చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకోసం అని ఆ సమయంలో ఆ తల్లి చల్లని చూపు కోసం ఈ మూడు అక్షరాల నామాన్ని కనుక మనం ధ్యానం చేసినట్లయితే, కచ్చితంగా మనకి ఏమి కోరుకుంటామో ఆ కోరిక నెరవేరే ఎందుకు ఆ తల్లి అనుగ్రహం అనేది లభిస్తుంది.