భర్తతో కలిసి భోజనం చేసే స్త్రీ లు తప్పకుండా చూడండి. లేదంటే ప్రమాదం తప్పదు

ఎవరైనా భోజనం చేసే సమయంలో పాటించవలసిన కొన్ని నియమాలను మన వేదాలలో చెప్పారు. వీటిని మూఢ నమ్మకాలు అని వదిలేయకుండా వీటి వెనుక ఉన్న సైన్స్ రహస్యాలను అర్ధం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇలా భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన కొన్ని నియమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటి నియమం భోజనానికి ముందు పంచాంగాలు అంటే కాళ్లు, చేతులు, మొఖం నీటితో శుభ్ర పరుచుకొని మాత్రమే భోజనం చేయాలి.

అలాగే భోజనం చేసే ముందు ఇష్టదేవతలను స్తుతించాలి ముఖ్యంగా అన్నపూర్ణాదేవిని చూపించి ధన్యవాదాలు తెలపాలి.

సకల ప్రాణులకు ఇలాగే ఆహారం లభించాలని కోరుకోవాలి.

వంట చేసే స్త్రీలు స్నానం చేసి మనసులో ఇష్టదైవాన్ని ధ్యానించి శుద్ధిగా ఉన్న మనసుతో వంట చేయాలి.

అలాగే వంట పూర్తి అయిన తర్వాత మూడు రొట్టెలు ఒకటి ఆవుకి, ఒకటి కుక్కకి, ఒకటి కాకికి పెట్టి, అగ్ని దేవుడికి నైవేద్యం సమర్పించి, అప్పుడు ఇంట్లో వారితో కలిసి భోజనం చేయాలి.

అందరూ వంట చేసిన ప్రదేశం కిచెన్ లోనే కూర్చుని కలిసి భోజనం చేయాలి. ఇలా కాకుండా విడివిడిగా భోజనం చేయడం వలన కుటుంబంలో అపార్థాలు చోటు చేసుకొని అన్యోన్యత, ఐక్యమత్యం ఉండదు.

భోజన సమయాలు ప్రాతః కాలం మరియు సంధ్యా సమయం అని పెద్దలు చెబుతారు. ఎందుకంటే మన కడుపులో తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే జఠరాగ్ని సూర్యోదయమైన రెండు గంటల తర్వాత మరియు సూర్యాస్తమయానికి రెండు గంటల ముందు వరకూ మాత్రమే ఉత్తేజితంగా ఉంటుంది.

ఒక పూట భోజనం చేసేవారిని యోగి అని, రెండు పూటలా భోజనం చేసే వారిని భోగి అని పిలుస్తారు.

భోజనం చేసే విషయం అనేది పూర్వ మరియు ఉత్తర దిశవైపు చూసుకొని అప్పుడు మాత్రమే తినాలి. పశ్చిమ దిశ వైపు కూర్చుని చేసే భోజనం ప్రేతాత్మలకు ప్రాప్తిస్తుంది. ఇలా చేసిన భోజనం వలన రోగాలు పెరుగుతాయి.

మంచంపై కూర్చొని భోజనం చేయకూడదు. చేతితో పళ్లెం పట్టుకొని భోజనం చేయకూడదు. విరిగిన పాత్రల్లో, ప్లేట్లలో భోజనం చేయకూడదు.

మలమూత్రాల కు వెళ్లాల్సిన సమయంలో కూడా భోజనం చేయకూడదు.

భోజనం చేస్తూ గొడవలు పెట్టుకోకూడదు.

ఎక్కువ శబ్దం వచ్చే చోట కూడా భోజనం చేయకూడదు.

రావి చెట్టుకింద వటవృక్షం కింద కూర్చుని భోజనం చేయకూడదు.

వడ్డించిన భోజనానికి పేర్లు పెట్టకూడదు.

నిల్చొని, చెప్పులు వేసుకొని భోజనం చేయకూడదు.

ఇంకా ఇలాంటివి ఎన్నో నియమాలు మన వేదాలలో రచించబడ్డాయి. వీటి వెనుక ఉన్న సైంటిఫిక్ విషయాలను అర్థం చేసుకొని పాటిస్తే మన ఆరోగ్యానికి మనకు చాలా మంచిది.