మధ్యాహ్నం నిద్రపోతే ఏం జరుగుతుంది

మధ్యాహ్నం పూట నిద్రపోవడం మంచిదేనా? మధ్యాహ్నం పూట పడుకుంటే కాస్త ఒళ్ళు వస్తుంది అంటారు, అది మనకు కూడా అనుభవమే, పైగా ఇలా నిద్రపోయే అలవాటు ఉంటే ఆ సమయంలో ఎక్కడికి వెళ్లినా సరే ఆవలిస్తూ ఉంటాము.

మధ్యాహ్నం పూట కాసేపు పడుకుంటారు ఈ కాసేపు పడుకున్న కూడా ఇది ఒక అలవాటుగా మారిపోతుంది, మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత కాస్త రెస్ట్ తీసుకోవాలి అంటారు, రెస్ట్ అంటే నిద్రపోవడం కాదు అలా కూర్చుని ఉండడం.

ఇలా కాకుండా మధ్యాహ్నం భోజనం తర్వాత చక్కగా నిద్రపోవడం అనేది చేయకూడదు, ఎవరికైతే నిద్ర అవసరం ఉంటుందో అంటే ప్రెగ్నెన్సీ వారు కాస్త పగటి నిద్రను చేయవచ్చు, అలాగే డెలివరీ తర్వాత పగటిపూట నిద్రపోకూడదు నిద్రిస్తే ఒళ్ళు వస్తుంది అంటారు అందుకని పగటిపూట అసలు పడుకోనివ్వరు. అలాగే అనారోగ్యంతో ఉన్నవారు వీరికి పగలు నిద్రపోతే రాత్రిపూట నిద్ర పట్టదు,

ఒకవేళ జ్వరం తగ్గినట్లయితే ఆ పూట ఏదో పచ్చని పెడతారో అప్పుడు పడుకొనివ్వరు, ఒకవేళ అన్నం తిని మధ్యాహ్నం పూట పడుకున్నట్లయితే మళ్లీ జ్వరం వస్తుంది , ఇలా మధ్యాహ్నం తిని పడుకుంటే ఒంటికి బరువు. కాబట్టి రిలాక్స్ అవ్వడం నేర్చుకోవాలి, అంటే పవర్ నాప్ విధానాన్ని నేర్చుకోవాలి. ఈ పవర్ నాప్ అనేది మనం అన్నం తిన్న తర్వాతే కాకుండా పగటి పూట ఎప్పుడైనా సరే ఇది మనం ఆఫీసులో ఉండేవారు కూడా చేయవచ్చు,

పొద్దున్నే ఐదు గంటలకు నిద్ర లేచి హడావిడిగా పనిచేసే 9 గంటల వరకు ఆఫీస్ కి పరిగెత్తుకుంటూ వెళ్లావు , 11-11:30 మధ్యలో ఎప్పుడైనా ఒక పావుగంట గ్యాప్ వచ్చింది ఆ సమయంలో ఒకసారి తల వాల్చండి, అంతేకానీ అలా నిద్రపోకూడదు, కాసేపు అలా ఒక ఐదు నిమిషాల పాటు కళ్ళు మూసుకుని ఉండండి. ఇలా చేయడం వల్ల కాస్త రెస్ట్ దొరుకుతుంది అలాగే ఉల్లాసంగా ఉంటారు అలాగే శరీరంపై బరువు ఉండదు, అలాగే అలసట తీరిపోతుంది, కానీ ఒక గంట పడుకుందాం అని పదం మాత్రం కరెక్ట్ కాదు ఒక కునుకు తీసి లేవడం అనేది కరెక్ట్.