ప్రకృతి సీజనల్గా ఎన్నో రకాల ప్రతిఫలాలను అందిస్తుంది. ఇలా సీజనల్ గా లభించే కూరగాయల్లో ఒకటైన ఆకాకరకాయ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో మార్కెట్లో కూడా ఎక్కువగా లభిస్తున్నాయి. దీనిని ఇష్టపడే వారు కూడా ఎక్కువగా ఉంటారు. 2014వ సంవత్సరంలో ప్రైమిషీయా యూనివర్సిటీ డాకా బంగ్లాదేశ్ వారు వీటిపై రీసెర్చ్ చేశారు. ఇందులో ఐదు రకాల ప్రధాన లాభాలు ఉన్నాయని వీరు నిరూపించారు. ఆ కాకరకాయలు 100 గ్రాములు తీసుకుంటే అందులో నీరు 84 గ్రాములు ఉంటుంది.
పిండి పదార్థాలు 7.7 గ్రామ్స్, ప్రోటీన్ 3 గ్రామ్స్, ఫ్యాట్ 3 గ్రామ్స్, ఫైబర్ 3 గ్రామ్స్, ఐరన్ 5 మిల్లీగ్రామ్స్, శక్తి 60 క్యాలరీలో ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఆల్కలాయిడ్స్, ట్రై టార్పీనాయిడ్స్ 15 రకాలు ఉంటాయి. మొదటిగా ఇది లివర్ యొక్క డిటాక్సీఫీకేషన్ కి బాగా ఉపయోగపడతాయి. లివర్కు హాని కలిగించే అన్నిటి నుంచి రక్షించుకోవడానికి ఇందులో ఉండే ఎంజైమ్స్ బాగా ఉపయోగపడతాయి. రెండవదిగా ఇందులో ఉండే 15 రకాల ట్రై టార్పీనాయిడ్స్ న్యూరో ప్రొటెక్టివ్ గా ఉపయోగపడుతున్నాయని నిరూపించారు.
మన నాడీ కణాలు ఒకసారి పుడితే లైఫ్ లాంగ్ అదే ఉంటాయి. ఇవి కనుక చనిపోతే మళ్ళీ పుట్టావు. ఇలాంటి నాడీ కణాలు శరీరం కింద నుంచి పై వరకు, పైనుంచి కింద వరకు అన్ని సంకేతాలను చేరవేస్తూ ఉంటాయి. ఇవి రోజు పని చేసినప్పుడు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. ఇలా కారణమయ్యే కెమికల్స్ అన్నిటిని తొలగించి కణాలను రి ఫ్రెష్ చేయడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి అని వీరు నాడీ వ్యవస్థ గురించి నిరూపించారు. మూడోదిగా ఫ్యాటీ లివర్ నుంచి విడుదల పొందడానికి లేదా ఫ్యాటీ లివర్ రాకుండా చేయడానికి ఇది చాలా మంచిది.
నాలుగవ లాభం తీసుకుంటే ఆకాకరకాయలో పై తొక్కలో ఉండే పల్ప్ మ్యూకస్ ప్రొడక్షన్ బాగా పెంచడానికి, అల్సర్ రాకుండా చేయడానికి సహాయపడుతుంది. ఐదవ లాభం చూసుకుంటే ముఖంపై ఉండే మొటిమలను తొలగించడానికి ఆకాకరకాయ తొక్క యొక్క పేస్టు ముఖంపై అప్లై చేస్తే అందులో ఉండే ఆంటీ బ్యాక్టీరియా గుణాలు వల్ల చర్మం నునుపుగా మారుతుంది. మరియు ముఖంపై ఉండే మృత కణాలు అన్ని తొలగించబడతాయి. ఇలాంటి లాభాలు అన్ని ఆకాకరకాయలు వల్ల లభిస్తున్నాయి కాబట్టి సీజనల్గా దొరికినప్పుడు వాటిని ఉపయోగించుకోవడం మంచిది…