మీటింగ్ మధ్యలో నెలసరి రావడంతో ఈ I.P.S అందరి మగాళ్ళ ముందు చేసిన పనికి అందరు షాక్

మహిళల పీరియడ్స్ పై ప్రజల ఆలోచన తీరు మారాల్సిన అవసరం ఉంది, నెలసరి సమయంలో అస్సలు భయపడకూడదు, బాధని చూపించకూడదు, నెలసరి సమయంలో కూడా యధావిధిగా మహిళలు తమ కర్తవ్యాలను నిర్వర్తించాలని, గుజరాత్ అహ్మదాబాద్ ఏసిపి మంజిత బలంగా చెబుతున్నారు. ఎందుకు ఆమెకు జరిగిన ఓ సంఘటన నిక్కచ్చి ఉదాహరణ, కొంతకాలం క్రితం అహ్మదాబాద్ లో నేరాలపై సదస్సు జరుగుతుంది. అయితే ఆరోజు తప్పనిసరిగా హాజరు అవ్వాల్సిన పరిస్థితి, ఉదయం 11 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు యూనిఫాంలోనే నిల్చవలసి వస్తుంది. అయితే ఆ సదస్సు జరుగుతున్న సమయంలోనే ఆ ఏసి పేకి నెలసరి సమస్య వచ్చింది. దీంతో యూనిఫామ్ మీద మరక ఏర్పడింది, ఆ ఏసేపే కూర్చున్న కూర్చు కూడా తడిచిపోతుంది, ఆ చుట్టుపక్కల కూడా ఏ ఒక్క మహిళ పోలీస్ అధికారి లేరు, మిగతా వారంతా మగవారే ఈ విషయం గురించి ఎవరితో మాట్లాడాలి.

ఎవరితో మాట్లాడాలన్నా సరే ముందుగా లేచి నిలబడాలి. ఎలా వెళ్లాలి ఇక ఆ సదస్సు ముగిసిన తర్వాత ప్రోటోకాల్ ఉంటుంది, మేమంతా నిలబడి పై అధికారులకు సెల్యూట్ కొట్టాలి, ఆరోజు నేను పడ్డ నరకం అంతా ఇంతా కాదు, ఏ ఒక్క మహిళ అయినా అర్థం చేసుకునే మగవాడైన, నా పరిస్థితి వింటూ ఉంటే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది, కానీ నాకు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ, అయితే ఆ సమయంలో మాత్రం చాలా ఇబ్బందిగా అనిపించింది, నేను నిలబడితే నా వెనక ఉన్న వాళ్ళు అంతా మరకని చూస్తారు, అనే నాకు అర్థం అయింది, అయినా సరే నా ఆత్మస్థైర్యంతో నిలబడాలి అనుకున్నాను. నా వైపు చూసి అంతా నవ్విన నా డ్యూటీ నేను చేయాలి అనుకున్నాను, నిలబడ్డాను మా బాస్ కి సెల్యూట్ చేశాను, ఇక నేను నడిస్తేనే నా వెనక ఉన్నవారు నడుస్తారు అది నాకు తెలుసు, కానీ నడిస్తే ఏమవుతుందో నాకు అర్థమవుతుంది, కానీ నేను నడవడం ప్రారంభించాను నా వెనక దాదాపుగా 40 మంది మగ పోలీస్ అధికారులు ఉన్నారు, వాళ్లంతా నా యూనిఫామ్ మీద ఆ మరకను చూశారు కూడా, వారు ఆ మరొకను చూడకుండా నేను దాచుకోవచ్చు ఏదైనా ఒక ఫై ల్ అడ్డం పెట్టుకోవచ్చు కానీ, నేను అలా చేయకూడదు అని నిర్ణయించుకున్నాను.

ఇక వెంటనే నా వెనక ఉన్న నా గన్మెన్ మేడం మీ బట్టల మీద మరక బయటకి కనిపిస్తుంది అని చెప్పారు, వెంటనే నేను గన్మెన్తో ఒక్కటే ఒక మాట చెప్పాను అదే సహజంగా వచ్చేదే, వర్రీ అవ్వద్దు అని చెప్పి పంపించి వేశాను, ఇక అదే విషయం నా అధికారులకు కూడా చెప్పాను, నాలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మహిళా సిబ్బందికి కాస్త విశ్రాంతి ఇవ్వాలని వారికి సూచించాను, ఎందుకంటే నెలసరి సమయంలో మహిళలు కేవలం శారీరక బాదే కాదు, మానసిక ఒత్తిడికి కూడా లోనవుతారు ఇక అలాంటిది వందమంది పురుషుల మధ్య ఉంటే ఆ మహిళ బాధ వర్ణనాతీతం. సమాజం దేనిని అర్థం చేసుకోవాలి, అయితే మహిళలు తెలుసుకోవాల్సింది కూడా ఇక్కడ ఉంది, పీరియడ్ సమయంలో మహిళలు ఎప్పుడూ కూడా రక్తస్రావం గురించి ఆలోచిస్తూ ఉంటారు, బట్టల మీద మరక కనిపిస్తే చూసి ఎవరైనా నవ్వుతారేమో అని భయపడుతూ ఉంటారు. మీ తీరు మారాలి, ఇది మీ తప్పు కాదు సహజంగా వచ్చే దాని గురించి ఆలోచించలేని వాతావరణాన్ని మన సమాజం మనల్ని తయారు చేసింది.

దయచేసి మీ తీరు మార్చుకోండి అని చెబుతున్నారు మన ఏసీబీ మంజిత. ఇక అంతేకాదు ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలను అందించారు ఏసీబీ గారు, పీరియడ్స్ సమయంలో మహిళా ఉద్యోగులు, తమకు సులువైన పనులు ఇవ్వాలని అడిగితే ఇచ్చే విధంగా ఓ చట్టం ఉండాలి, ఆ సమయంలో మహిళలతో ఎలా ప్రవర్తించాలో అందరూ నేర్చుకోవాలి, ఎందుకంటే అది సహజ ప్రక్రియ, ఈ విధంగా ఏసిపి మంజిత గారు ఆడవారి బాధను షేర్ చేసుకున్నారు, కానీ ఆమె చెప్పిన మాటలు మహిళలకు అర్థమవుతాయి, పురుషులకు అర్థం కావడానికి కాస్త సమయం పడుతుందేమో, కానీ ఆలోచించండి అనేది మాత్రం చెబుతున్న మాట, అది ఆడవారి ప్రాబ్లం కదా అని మాత్రం వదిలేయకండి కచ్చితంగా ఈ సమస్యకు ఓ పరిష్కార మార్గం చూపించండి, ప్రతి మహిళ కోసం ఇదే చేయండి, ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న వారి కోసం.