మీ చేతిలో X గుర్తు ఉందా

హస్త సాముద్రికం ప్రకారం అరచేతిలో X అనే గుర్తు ఉంటే ఏం జరుగుతుంది? చాలామంది చెప్తూ ఉంటారు X గుర్తు ఉంటే కొంతమందికి మంచి జరుగుతుంది మరి కొంతమందికి మంచిది కాదు అని అంటూ ఉంటారు.

మరిహస్త సాముద్రికం ప్రకారం చూసినట్లయితే ఈ గుర్తు చేతిలో ఉంటే అసలు ఏం జరుగుతుంది అటు అమ్మాయిలకు చూసిన అబ్బాయిలకు చూసిన ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.

చేతిలో ఒక్కొక్క స్థానంలో x గుర్తు ఉండడం వల్ల ఒక్కొక్క ఫలితం ఉంటుంది ఉదాహరణకి గురు స్థానంలో x గుర్తు ఉన్నట్లయితే మంచి జ్ఞానం మంచి లాభం,భార్య భర్తల మధ్య ప్రేమ ఆప్యాయత, గవర్నమెంట్ జాబు ఇలా కొన్ని ఉంటాయి. గురు స్థానం అంటే మన చూపుడువేలు ఎవరికైనా చూపించినప్పుడు దాని కింద భాగంలో ఎవరికైనా సరే మనకు x గుర్తు ఉంటే కనుక కచ్చితంగా మంచి ఫలితం వస్తుంది ,అతను అన్నిట్లో కూడా బావుంటాడు, మంచి నాలెడ్జ్ ఉంటుంది బాగా సంపాదిస్తాడు ,అన్నిట్లో కూడా బాగుంటుంది అని దాని అర్థం. భార్య భర్తల మధ్య ప్రేమ ఉంటుంది, అంటే జీవనం అనేది సాఫీగా జరిగిపోతుంది.

అదే x గుర్తు అనేది మనం చూసినట్లయితే మధ్య వేలు కింద భాగంలో అంటే దీన్ని శని స్థానం అంటారు ఈ స్థానంలో కనుక ఈ గుర్తు ఉన్నట్లయితే సహజంగా ప్రతిదానిలో కూడా దురదృష్టం ఎదురు రావడం, ప్రతి విషయంలో కూడా అనుకూలత లేకపోవడం, అంటే వెళ్లాలి అని అనుకుని బద్దకంగా కూర్చోవడం, అంటే ప్రతి దానిలో కూడా రివర్స్లో ఎక్కువ శాతం కూడా ఈ వ్యక్తికి ఆలోచన ఉన్నప్పటికీ కూడా నీరసం బద్ధకం వల్ల ఏదీ చేయలేకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ x అనేది ఇప్పటివరకు ఉంటుంది, ఎప్పటి వరకు ఉండదు అంటే, కొంతమందికి మంచి స్థితి కలిగి ఉన్నప్పుడు సడన్గా డౌన్ అయిపోతుంది కదా, అలాంటప్పుడు ఈ x అనేది మధ్య వేలి కింద భాగంలో ఉంటే దురదృష్టం.

అంటే డబ్బులు తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోవడం వీళ్లు పదిసార్లు వెళ్లి అడగడం వాళ్ళు ఇవ్వననడం, అనవసరంగా ఇచ్చాను అని చెప్పి గొడవలు పడడం ఇలాంటివి ఈ స్థానంలో ఉండడం వల్ల జరుగుతుంది కాబట్టి ఆ రేఖ కనుక ఉత్పత్తి అయినప్పుడు ఆరు నెలలు పాటు మౌనంగా ఉండి తర్వాత వెళ్లి అడిగితే వాళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గొడవ అయిపోయి మొత్తం వదులుకుంటే ఉన్న డబ్బులు కూడా పోతాయి కాబట్టి ఇలాంటి రేఖ ఉన్నప్పుడు ఇలా జాగ్రత్తగా ఉండాలి.

అదేవిధంగా చిటికెన వేలు పక్కన వేలు అనేది రవి స్థానం గా చూపిస్తారు, దీన్ని ఉంగరపు వేలు అంటారు, ఈ భాగంలో కనుక x గుర్తు ఉన్నట్లయితే ఇది తండ్రి స్థానం ఉంగరపు వేలు ఎప్పుడూ కూడా రవి స్థానం, రవి ఏమిటంటే తండ్రి కారకుడు, రవి స్థానంలో కనుక ఈ గుర్తు ఉన్నట్లయితే తండ్రి యొక్క సపోర్ట్ అనేది తక్కువగా ఉంటుంది, అంటే తండ్రి మనకు సపోర్ట్ చేయడు అని అర్థం కాదు తండ్రి మనకు ఎంతో చేయాలి అనుకున్న అది మనకు అందదు. అలాగే చిటికెన వేలు స్థానంలో కనుక x గుర్తు ఉన్నట్లయితే సంతానం సమస్యలు రావడం సంతానం కలగకపోవడం, రెండు మూడు సార్లు వచ్చి పోవడం అదేవిధంగా వ్యాపారంలో మంచి స్థితి లేకపోవడం, వ్యాపారంలో నష్టం రావడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది.

అదేవిధంగా మనం హస్తంలో చూసుకున్నట్లయితే చంద్రస్థానం చూసినట్లయితే ఈ స్థానంలో కనుక x గుర్తు ఉన్నట్లయితే ఎక్కువ శాతం ఆలోచన శక్తి చాలా అధికంగా ఉంటుంది, అంటే బాగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ భార్యకి ఈ గుర్తు ఉండి భర్తకి లేనట్లయితే, దీని కారణంగా భార్య భర్తల మధ్య సఖ్యత లోపించడం గొడవలు రావడం జరుగుతుంది కాబట్టి ఈ రేఖ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మౌనంగా ఉండడం మంచిది. ఈ x గుర్తు అనేది అరచేయి మధ్య భాగంలో ఉన్నట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి, ఇలా ఉన్నప్పుడు ఆపదలు అనేవి వస్తూ ఉంటాయి కానీ అవి వచ్చినా కూడా అప్పటికప్పుడు వాటినుండి బయటపడతారు.