మీ జాయింట్ పెయిన్స్, నడుము నొప్పులు, కాళ్లు, చేతుల్లో నొప్పులు అన్ని చిటికెలో మాయం…. సైంధవ లవణం యొక్క ఉపయోగాలు

భారతీయులు ఎక్కువగా ఉపయోగించి పదార్థాలలో సైంధవ లవణం ఒకటి. దీనినే రాక్ సాల్ట్ లేదా హిమాలయం సాల్ట్ అని కూడా అంటారు‌. ఇది హిమాలయాల నుంచి లభిస్తుంది. సాధారణ ఉప్పు కంటే సైంధవ లవణం ఎంతో శ్రేష్టమైనది అని నిపుణులు చెప్తున్నారు. ఇది ఎన్నో రకాల జబ్బులు నయం చేయడానికి ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు నడుము నొప్పి వంటి సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. వారికి సైంధవ లవణం చాలా బాగా ఉపయోగపడుతుంది. సాధారణ ఉప్పు స్థానంలో సైంధవ లవణం ఉపయోగించుకుంటే చాలా మేలు చేస్తుంది.

దీన్ని రోజు తీసుకోవడం ద్వారా శరీరంలో వాతా,పీత, కఫా మూడు సమతుల్యంగా ఉంటాయి. దీనిలో కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. నీ లవణం వలన గుండె, కంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఇది ఎక్కువగా తీసుకున్నా శరీరానికి కీడు చేస్తుంది. ఈ రాతి ఉప్పు జీర్ణ సంబంధ సమస్యలను నివారిస్తుంది. శరీరానికి బలాన్ని, చల్లదనాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది. ఇందులో 84 రకాల పోషకాలు ఉంటాయి. ఇలాంటి సైంధవ లవణం వాడడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిద్రలేమి సమస్య నుంచి కూడా విడుదల అందిస్తుంది.

దంత సమస్యలను కూడా మటుమాయం చేస్తుంది. తులసాకుల పొడి సైంధవ లవణం కలిపి వాడితే దంతాల నొప్పి తగ్గుతుంది. స్నానం చేసే నీటిలో ఒక స్పూను సైంధవ లవణం కలిపితే శరీరం నుంచి దుర్వాసన రావడం తగ్గుతుంది. ఎముకలను ్

పరచడంలో సహాయపడుతుంది. వాము, సైంధవ లవణం కలిపి తింటే ఆడవారికి నెలసరి సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. ఎండుద్రాక్ష నేతిలో వేయించి సైంధవ లవణం కలిపి తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మజ్జిగలో సైంధవ లవణం కలిపి తాగితే అజీర్ణ సమస్యలు చిటికెలో పోతాయి. జీలకర్ర పొడిల సైంధవ లవణం కలిపితే తింటే వాంతులు తగ్గుతాయి.

సోంటి, పసుపు, సైంధవ లవణం కలిపి తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. తులసాకు కషాయంలో సైంధవ లవణం కలిపి తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. కీళ్ల నొప్పులు వెన్ను నొప్పి ఉన్నవాళ్లు నువ్వుల నూనె రాసుకుని సైంధవ లవణంతో కాపడం పెట్టుకుంటే ఒక ఉపసమనం కలుగుతుంది. మరియు సైంధవ లవణం నిమ్మరసంలో కలిపి తీసుకుంటే శరీరానికి శక్తి అందుతుంది. కనుక ఇటువంటి సైంధవ లవణం ఉపయోగించుకోవడం వలన చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి…