సెలబ్రిటీల పెళ్లి అంటే ఎంత అంగరంగా వైభవంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇందులో కొంతమంది సెలబ్రిటీలు చాలా సింపుల్గా పెళ్లి చేసుకుంటే, మరి కొంతమంది మాత్రం అందరికీ గుర్తుండి పోయేలా పెళ్లి చేసుకుంటారు.
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలో జూన్ 9న ఎంగేజ్మెంట్ రింగ్స్ తుడుక్కోపోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎప్పటినుండో వరుణ్ తేజ్ కి లావణ్య త్రిపాఠి కి మధ్య ఏదో నడుస్తుంది అంటూ వార్తలు వినిపించినప్పటికీ, ఈ వార్తలపై ఇప్పటికి వరుణ్ తేజ్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
అయితే కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు లావణ్య త్రిపాఠి క్లారిటీ ఇచ్చి, అసలు మా మధ్యన అలాంటిది ఏమీ లేదు అంటూ కొట్టు పారేసింది కానీ, వేరే వ్యవహారం చూసినా ఏ ఒక్కరు కూడా వీరి మధ్య ప్రేమ లేదు అని భావించలేదు. నిజంగానే వీరి మధ్య ఏదో నడుస్తుంది అని ఎప్పటికప్పుడు మీడియాలో వార్తలు వైరల్ చేస్తూనే ఉన్నారు. ఇక వరుణ్ తేజ్ సిని కెరియర్ లో కూడా చెప్పుకోదగ్గ హిట్లు లేవు, అలాగే లావణ్య త్రిపాటికి కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే దశాబ్దం దాటిపోయిన ఆమెకు కూడా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు.
ఈ విషయాలన్నీ పక్కన పెడితే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నట్లు, ఇప్పటికే వార్తలు వచ్చిన నేపథ్యంలో లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి అన్ని కోట్ల కట్నం తేబోతుందా అంటూ ఒక వార్త నెట్ లో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. మరి ఇంతకీ లావణ్య త్రిపాఠి ఎంత కట్నం తెస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. లావణ్య త్రి పాఠి మెగా ఫ్యామిలీకి కోడలిగా అడుగుపెడుతూ కట్న కానుకలు భారీగానే తెస్తున్నట్లు తెలుస్తోంది.
వరుణ్ తేజ్ లావణ్య కి ఒక లగ్జరీ కారు, అలాగే వీరు వీళ్లు ఉండడానికి ఒక లగ్జరీ భవనం, అంతేకాకుండా లావణ్య త్రిపాటికి దాదాపు 5 కిలోల బంగారం, అంతేకాకుండా ఆరు కోట్ల డబ్బు కట్నం గా ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వరుణ్ తేజ్ మాత్రం కట్నం ఏమీ వద్దు అని చెప్పినప్పటికీ, లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు మాత్రం మా సంతృప్తి కోసం ఇస్తున్నామని చెప్పారట, దీంతో చేసేదేమీ లేక వరుణ్ తేజ్ కూడా ఆ కట్నం తీసుకోవడానికి రెడీ అయ్యారట.