పుట్టిన వారు మరణించక తప్పదు అని భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు ఎప్పుడో బోధించాడు, అయితే మన నుంచి ప్రాణాన్ని వేరు చేసేది మాత్రం మీ అమ్మధర్మరాజు అనేది, మనకు తెలిసిందే. మనలో చాలామందికి ఆయన పట్ల భయము భీతి ఉంటుంది. ఆయన మన ప్రాణాలను తీసుకెళ్లి పోతాడు అన్న భావన కలిగి ఉంటాము, కానీ ఇది సృష్టి ధర్మంలోని భాగం మాత్రమే.
యమధర్మరాజు కూడా మన ప్రాణాలను తీసుకువెళ్లే ముందు మనకు నాలుగు సంకేతాలని పంపుతారట, అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ సంకేతాలను తెలియచెప్పే కథ ఒకటి ఉంది, యమునా నది తీరంలో అమృతుడు అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడట, అతడికి ఎప్పుడు చూసినా తాను చనిపోతానేమోనని ఎప్పుడూ చనిపోతాను అని, ఒక దిగులుగా ఉండేదట, ఆ విషయంలో దిగులు పోగొట్టుకోవడం కోసం యమధర్మరాజును ఉద్దేశించి, తపస్సు చేశాడట.
అతని తపస్సుకు మెచ్చి యమధర్మరాజు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడట, అయితే ఆ వ్యక్తి తనకు మరణం ఎప్పుడు వస్తుందో, ముందుగానే తెలియజేయమన్నాడట. ఆ విషయం ముందే తెలిస్తే తన బాధ్యతలన్నీ మరొకరికి అప్పచెప్పేయాలనేది అతని ఆలోచన. ఎప్పుడు వస్తుందో చెప్పలేనని, అయితే అందుకు గుర్తుగా కొన్ని సంకేతాలను మాత్రం పంపగలనని తెలిపాడట. వాటిని బట్టి మరణం వచ్చే విషయం తెలుసుకోవాలని సూచించాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని అమృతుడు మర్చిపోతాడు.
పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం వారికి కూడా పెళ్లిళ్లు అవ్వడం కాలక్రమంలో జరిగిపోతూ ఉంటుంది. అయితే ఒకరోజు అమృతుడికి యమధర్మరాజు తో జరిగిన సంభాషణ గుర్తుకు వస్తుంది కానీ, ఆయన చెప్పిన సూచనలు ఏవి కనిపించకపోవడంతో తనకి ఇంకా ఆయువు ఉందని అమృతుడు అనుకుంటాడు. కాలక్రమంలో అతడే చర్మం ముడతలు పడుతుంది, వెంట్రుకలు తెల్లబడతాయి, పళ్ళు కూడా ఊడిపోతాయి, పక్షవాతం సోకి మంచానికే పరిమితం అవుతాడు. ఒకరోజున యమధర్మరాజు అతని ప్రాణాలను తీసుకొని పోవడానికి వస్తాడు, అయితే అమృతుడు ఆశ్చర్యంతో నాకు సూచనలు చేస్తానని మాట ఇచ్చావు కానీ, ఎలాంటి సూచనలు ఇవ్వకుండా తీసుకెళ్లి పోతున్నావు.
నువ్వు నాకు ఇచ్చిన వరం మాటేమిటి అని అడుగుతాడు. నేను నీకు నాలుగు సార్లు సూచన చేసినప్పటికీ, నువ్వు గ్రహించలేదని చెబుతాడు. ఆ సూచనలు ఏమిటి అని అమృతుడు యముడిని అడగగా, వెంట్రుకలు తెల్లబడడం చర్మం ముడుచుకుపోవడం, పళ్ళు ఊడిపోవడం పక్షవాతం బట్టి అనారోగ్యాలను, తాను పంపిన సూచనలనుగా ఎముడు వివరిస్తాడు. అప్పుడు అమృత్యుడికి విషయం అర్థమవుతుంది. అమృతుడు నిజాన్ని ఒప్పుకున్న తర్వాత యమధర్మరాజు అతడి ప్రాణాలని తీసుకువెళ్లిపోతాడు