రవితేజ గారి భార్య

రవితేజ ఈ పేరు వినగానే స్వయంకృషితో పైకి వచ్చిన స్టార్ హీరోలకి బ్రాండ్ అంబాసిడర్ గా కనిపిస్తారు. ఒక తరానికి మెగాస్టార్ ఇన్స్పిరేషన్ అయితే ఆ తర్వాత తరానికి ఇన్స్పిరేషన్ రవితేజ. ఒక మామూలు స్థాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ను మొదలుపెట్టే చిన్న చిన్న పాత్రలలో ఎన్నో సినిమాలలో నటించి అతి కష్టం మీద చాలా రోజులకు హీరో అయ్యి నీకోసం సినిమాతో హీరోగా తన మొదటి సినిమాలో నటించిన రవితేజ గారు

ఆ తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఇడియట్, ఖడ్గం, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, వెంకీ ,నా ఆటోగ్రాఫ్, భద్ర ,విక్రమార్కుడు ,కృష్ణ ,శంకర్ దాదా జిందాబాద్ ,నేనింతే, కిక్, డాన్ శీను ,మిరప కాయ్ బలుపు, పవర్, బెంగాల్ టైగర్, రాజా ది గ్రేట్ ,లాంటి సినిమాలతో హిట్స్ కొట్టిన రవితేజ గారి గురించి ఆయనకు ఉన్న క్రేజ్ మాస్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆయన ఇన్ని విజయాలను సాధించడం వెనక ఆయనకు అన్ని విధాలుగా సహకరిస్తున్న రవితేజ గారి భార్య కళ్యాణి గురించి ఎవరికీ అంతగా తెలియదు. మన మాస్ మహారాజ్ గారి రియల్ లైఫ్ మహారాణి కళ్యాణి గారి జీవితంలో ఎవరికి తెలియని అత్యంత ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. రవితేజ గారి భార్య కళ్యాణి గారి గురించి తెలుసుకోబోయే ముందు రవితేజ గారి గురించి ఆయన కుటుంబం గురించి తెలుసుకుందాం.

రవితేజ గారి అసలు పేరు భూపతి రాజు రవిశంకర్ రాజు ఆయన రాజగోపాల్ రాజు గారి మరియు రాజ్యలక్ష్మి దంపతులకు మొదటి కుమారుడుగా జన్మించాడు. రవితేజ గారికి ఇద్దరు తమ్ముళ్ళు రఘు, భారత్ వీళ్ళిద్దరూ కూడా నటనలో కొన్ని సినిమాలలో నటించారు. భరత్ గారు కొన్నాళ్ల క్రితమే ఒక రోడ్ యాక్సిడెంట్లో మరణించారు, రవితేజ గారి నాన్నగారు ఫార్మసిస్టుగా పనిచేసేవారు ఉద్యోగరీత్యా ఆయనకి వివిధ ప్రాంతాలకి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేది అందుకే రవితేజ గారు జన్మించిన ఆరునెలలకే వాళ్ల కుటుంబం ముంబై వెళ్లాల్సి వచ్చింది.

రవితేజ గారి ప్రాథమిక విద్యాభ్యాసమంతా ముంబై ఢిల్లీ జైపూర్ ఇలా నార్త్ ఇండియాలోనే కొనసాగింది ఆ తర్వాత రవితేజ గారు నైన్త్ లో ఉండగా వారి కుటుంబం మళ్లీ విజయవాడ రావడంతో అక్కడే ఉన్న స్కూల్లో తన స్కూలింగ్ పూర్తి చేసిన రవితేజ గారు ఆ తర్వాత విజయవాడలో ఉన్న సిద్ధార్థ కాలేజ్ లో కష్టపడి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. కానీ రవితేజ కి మాత్రం చదువు మీద అంతా ఆసక్తి ఉండేది కాదు తనకి ఊహ తెలిసిన దగ్గర నుండి సినిమాలు అంటే మాత్రం విపరీతమైన ఇష్టం ఉండేది. అమితాబచ్చన్ గారిని చిరంజీవి గారిని చూసి వారి మేనరిజమ్స్ డైలాగ్స్ అనుకరించేవాడు,

ఎలాగైనా సినిమాల్లోనే తన జీవితం ఉండాలని బలంగా ఫిక్స్ అయినా రవితేజ మనస్సుని అర్థం చేసుకునే వాళ్ళ అమ్మ రాజ్యలక్ష్మి గారు ప్రోత్సహించారు దాంతో చెన్నై వెళ్లిన రవితేజ గారు ప్రతి ఆఫీస్ కి రోజు అవకాశాల కోసం తిరిగేవారు అయితే ఎవరూ అవకాశాలు ఇచ్చేవారు కాదు విజయశాంతి గారి కర్తవ్యం సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ లో కనిపించి మొదటిసారి వెండి తెరపై తనను తాను చూసుకున్న రవితేజ గారు ఆ తర్వాత నాగార్జున గారి చైతన్య, వారసుడు, నిన్నే పెళ్ళాడుతా, రాజశేఖర్ లాంటి అల్లరి ప్రియుడు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు అయితే ఏ సినిమాకి కూడా స్క్రీన్ పై ఆయన పేరు వేయలేదు.

అయితే రవితేజ గారికి 2000వ సంవత్సరం 2000 వ సంవత్సరం మే 26న కళ్యాణి గారితో వివాహం జరిగింది రవితేజ గారిది పెద్దలు కుదిర్చిన వివాహం. రవితేజ గారికి కళ్యాణి గారి కుటుంబం దూరపు బంధువులు అవుతారు, ఒక సందర్భంలో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కళ్యాణి గారిని చూసిన రాజ్యలక్ష్మి గారు కళ్యాణి గారు బాగా నచ్చడంతో రవితేజ గారికి కళ్యాణి గారిని ఇచ్చి చేస్తే బాగుంటుందని భావించి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి సంబంధాన్ని సెట్ చేశారు, ఇలా వారి పెళ్లి 2000వ సంవత్సరం మే 26న జగ్గంపేటలో అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. రవితేజ పెళ్లి నాటికి ఆయన ఇండస్ట్రీలో చేరే 10 సంవత్సరాలు అయినా ఆయనకు పెద్దగా గుర్తింపు రాలేదు.

కానీ కళ్యాణి గారితో పెళ్లి అయినా వేల విశేషం ఏమిటో గాని పెళ్లయిన వెంటనే పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం హీరోగా రవితేజ గారికి మొదటి హిట్ ని అందించగా ఆ తర్వాత వంశీ గారి దర్శకత్వంలో వచ్చిన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, పూరి జగన్నాథ్ తో వచ్చిన ఇడియట్, కృష్ణవంశీ గారి దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాలో రవితేజ గారిని స్టార్ని చేశాయి. ఖడ్గం సినిమాకు గాను మరొక నంది అవార్డును అందుకున్నారు రవితేజ అలా వరుసగా విజయాలతో శని రంగంలో తాను కోరుకున్న స్థాయిని చేరుకున్న రవితేజ గారికి కుమార్తె మోక్షద 2003 జూన్ 6న జన్మించగా, కుమారుడు మహిత్ మహాధన్ 2006 జులై 28న జన్మించాడు, మహాధన్ ఈ మధ్యలో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ గారి చిన్నప్పటి పాత్రను పోషించారు.