రాత్రి తినగా మిగిలిన అన్నం ఉదయం ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం జీవితాంతం అన్నంకు లోటు ఉండదు

అన్నం అంటే పరబ్రహ్మస్వరూపం, ఈ విషయం అందరికీ తెలిసిందే, హిందూ సంప్రదాయంలో అన్నానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు, ఏది లోపించినా మనం బ్రతకగలం కాని, ఆహారలోపం కలిగితే మాత్రం, ఖచ్చితంగా మనం బ్రతకడం, కష్టం ప్రస్తుతం ఉన్న రోజులలో అది నిరూపితమైంది కూడా, ఎందుకంటే అందరూ వలస కూలీలు ఆహారం లేక, తమ గమ్యస్థానాలు చేరుకోకముందే చనిపోయారు.

ఎందరో పేదలు ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు, కాబట్టి ఆహారం అనేది ఎంత ముఖ్యమో, మనకి ఈ పరిస్థితులు బాగా తెలియజేశాయి, అయితే మనం రాత్రి వేళలో అన్నం ఒకవేళ వదిలేస్తూ ఉంటే కనుక, ఏం జరుగుతుందో అలా ఎందుకు చేయకూడదో తెలుసుకుందాం, దానాల అన్నింటిలోకి అన్నదానం మిన్న, అన్న దానాన్ని మించిన దానం మరొకటి లేదు, అని పెద్దలు చెబుతూ ఉంటారు.

ఎందుకంటే ఏది దానంగా ఇచ్చిన, ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది కానీ, అన్నదానంలో మాత్రమే దానం తీసుకున్నవారు, ఇంక చాలు అని చెప్పి సంతృప్తి చెందుతారు, ఏ దానం ఇచ్చిన దానం తీసుకున్న వాళ్ళు మనల్ని సంతృప్తిపరచ లేకపోవచ్చు కానీ, అన్న దానం చేస్తే మాత్రం, దానం తీసుకున్న వారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చు, మాటలు నేర్చి వివేకం తెలిసి విజ్ఞానవంతులు అయిన తర్వాత, మనిషి ఆహారానికి ఉన్న విలువను గుర్తించారు.

మానవుడికి ప్రాథమిక అవసరాలు అన్నింటిలోకి, ఆహారమే ముఖ్యమైనది, బ్రహ్మ దేవుని సృష్టిలో దేవతలకు అమృతాన్ని, మానవులకు రుషులకు అన్నన్ని, పిశాచాది లకు మద్యం మాంసం మొదలైనవి, ఆహారంగా సృష్టించాడు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భావించే, నమస్కరించి తీసుకోవాలి, ప్రశాంత వాతావరణంలో ఆహారం తీసుకోవాలి, ఎంగిలి ఎవ్వరికీ పెట్టకూడదు.

అలాగే అమితమైన భోజనం కూడా, ఆరోగ్యానికి మంచిది కాదు చెప్పులు బూట్లు వేసుకొని, ఆహారాన్ని భుజించకూడదు, మంచం పైన కూర్చొని ఏమి తినకూడదు, ఏ వస్తువైనా వడిలో పెట్టుకుని తినకూడదు, దక్షిణం వైపు తిరిగి భోజనం చేయకూడదు, తూర్పు ముఖంగా కూర్చుని భోజనం చేయాలి, అన్నదానం చేయడం వల్ల నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే, చాలా రకాలైన ఇబ్బందులు బాధలో, మనం తట్టుకొని బయటపడగలుగుతారు