రెండు రోజులుగా కలెక్టర్ ఆఫీస్ ముందే కూర్చున్నా బిచ్చగాడు బయటకి వచ్చి ఎవరో చూడగానే ఒక్కసారిగా వణికిపోయిన జిల్లా కలెక్టర్

దానం చేయడానికి ఎంతో గొప్ప మనసు ఉండాలి. మనం సంపాదించే దాంట్లో అన్నీపోగా కొంతైనా దానం చేయాలని పెద్దలు అంటుంటారు. ఆ మతం, ఈ మతం, ఆ దేశం ఈ దేశం అనే తేడాల్లేకుండా అన్నిచోట్లా దానం అనేది ఉంది. దీని వల్ల ఇతరులకు సేవ చేశామనే సంతృప్తి కలుగుతుంది. మనసుకు సాంత్వన కలుగుతుంది. అయితే కొంతమంది డబ్బులు ఉన్నా కూడా దానం చేయడానికి ముందుకు రారు.హిందూ సనాతన ధర్మంలో దానానికి విశిష్ట స్థానం ఉంది.

దానం అంటే..ఏదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాలకోసం ఇవ్వడం.. ఇలా దానం చేసిన వ్యక్తిని దాత అంటారు. దానం ఇచ్చేవి ధనం, వస్తువు రూపంలో గాని సేవా రూపంలో గాని ఉంటుంది.మన పురాణాల్లో దానాలు దశవిధ దశవిధ దానాలను వర్ణించారు. అవి స్వర్ణ దానము, రజిత దానము, గో దానము, అన్న దానము, వస్త్ర దానము, విద్యాదానము, కన్యాదానము.