రైతులా పోలీస్ స్టేషన్ వెళ్లిన ప్రధాన మంత్రి

సాయంత్రం ఆరు గంటల టైం, పోలీస్ స్టేషన్కు ఒక రైతు వచ్చాడు సాధారణ కుర్తా ధోతి ధరించి దుస్తులపై బురద మురకలతో ఉన్నాడు ఆ రైతు. స్టేషన్ కి రాగానే అక్కడ పోలీస్ స్టేషన్లో ఎవరు నువ్వు అని అడిగారు. అయ్యా నా గేదె తప్పిపోయింది అని చెబుతూనే లోపలికి వచ్చేసాడు ఆ మురికి బట్టలతో ఉన్న రైతు. నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను అని అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ ని అడిగాడు.

అయితే అక్కడే ఉన్న ఒక పోలీస్ నీ పేరేంటి నువ్వు ఎక్కడ నుండి వస్తున్నావు నీ గేదె ఎక్కడ తప్పిపోయింది కంప్లైంట్ ఇచ్చేస్తావా అని, టపీ టపీమని నాలుగు ప్రశ్నలు వేశాడు. కన్ఫ్యూజ్ అయిపోయిన ఆ రైతు వెనుకకు తిరిగి వెళ్ళిపోతుండగా అక్కడే ఉన్న మరో పోలీసు వచ్చి చాయ్ ఖర్చులకు డబ్బులు ఇవ్వు రిపోర్టు రాసి ఇస్తా అని ఆ రైతుని నైస్ గా అడిగాడు. నేనొక పేద రైతునయ్య ఎక్కువ డబ్బులు ఇచ్చుకోలేను నా దగ్గర ఇంతే ఉంది అసలు నీకు ఎంత కావాలి అన్నట్టుగా అడిగాడు రైతు. ఇలా కాసేపు బేరం ఆడిన రైతు మొత్తానికి వచ్చిందే సంతోషం అన్నట్టుగా బేరం కుదుర్చుకున్నాడు. ఆ రైతు తన జేబులో నుండి 35 రూపాయలు తీసి లంచం ఇచ్చాడు, పోలీస్ స్టేషన్లో మధ్యలో ఉన్న ఒక రూమ్లో ఎస్సై ఎదురుగా మూడు కుర్చీలు ఉన్నాయి,

అతనికి ఎదురుగా ఒక మూలన ఒక వ్యక్తి ఫిర్యాదులు రాస్తున్నాడు, అతను ఆ రైతు ఫిర్యాదును కూడా రాశాడు. అంతే నువ్వు సంతకం చేస్తావా లేదా వేలిముద్ర వేస్తావా అని కాస్తంత వెటకారంగా నవ్వుతూ అడిగాడు ఆ పోలీసు. అతను అన్నదానికి చుట్టుపక్కల ఉన్న పోలీసులు కూడా పక్కన నవ్వారు దానికి ఆ రైతు వేలిముద్ర ఎందుకు నేను సంతకమే చేస్తాను అని స్టైల్ గా చెప్పాడు. అవునా సరే అయితే చేయి అన్నట్లుగా ఆ పోలీస్ కూడా సంతకం చేయడానికి పెన్ను అతని ముందు విసిరేశాడు. పెన్నుతోపాటుగా ఆ పోలీస్ టేబుల్ మీద ఉన్న తంబు పాడ్ కూడా తీసుకున్నాడు ఆ రైతు. అంతే కాస్తంత సీరియస్గా ఆ పోలీసు సంతకం చేయడానికి పెన్ను చాలదా, తంబు పాడ్ ఎందుకు అని అడిగాడు అయినా సరే ఆ రైతు మౌనంగా ఉన్నాడు. ఓహో సంతకం చేయడం నీకు రాదనుకుంటా దానికి పెన్ను సరిపోతుంది అది నీకు తెలియదు అనుకుంటా అని మరోసారి జోక్ వేసి ఆయనకు ఆయనే నవ్వుకున్నాడు. అయినా సరే ఆ మాటలు రైతు ఏమాత్రం వినిపించుకోలేదు,

సదరు ఎఫ్ఐఆర్ కాగితాలపై సంతకం చేశాడు,చౌదరి చరణ్ సింగ్ అని స్టైల్ గా రైతు సంతకం పెట్టాడు. వెంటనే తన జేబులో ఉన్న సీల్ కూడా తీశాడు, తంబు పాడ్ పై బలంగా గుద్ధి ఆ అచ్చును యాసిటీస్గా ఆ కాగితాలపై గుద్దాడు. ఆ పేపర్ ని పోలీసు ముందు పెట్టాడు అంతే ఆ ముద్ర చూసి ఆ సంతకం చూసి ఉలిక్కిపడ్డాడు రైటర్. అవును మరి ఆ ప్రింట్ ఏమిటో తెలుసా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఒక్కసారిగా స్టేషన్ మొత్తం కంగారు పడిపోయింది. ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో కూడా ఎవరికి అర్థం కాలేదు అసలు నమ్మాలో లేదు కూడా తెలియలేదు అవును మరి వచ్చింది దేశ ప్రైమ్ మినిస్టర్ ఆ ముద్రను చూసి రైటర్తో పాటు పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది అంతా కూడా ఆ హఠాత్పరినామానికి ఆశ్చర్యపోయారు.