రైలులో యువకుడు అ దృశ్యం

ట్రైన్ లో బ్యాగు పెట్టి వెళ్లాలన్నా భయమేస్తుంది అమ్మ, ఏమైనా చేస్తారేమోనని, తల్లికి మెసేజ్ చేసిన కొద్దిసేపటికే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతుంది. కోల్కత్తా నుండి కోయంబత్తూరు వెళ్తున్న వినయ్ కుమార్ రైల్లో కనిపించకుండా పోయాడు,

తండ్రికి ఫోన్ చేసి మాట్లాడుతుండగా ఒక్కసారి ఫోన్ కట్ అయింది. ఆ తర్వాత నుంచి వినయ్ కనిపించలేదు, దీంతో అసలు ఏమైందో తెలియక ఆ తల్లిదండ్రులు ఆ వ్యక్తి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. గూడూరు మండలంలోని రామ్మూర్తి తండకు చెందిన సురావత్ సదాశివుడు కొడుకు వినయ్ కుమార్, కోల్కత్తాలోని పిడబ్ల్యూసీ కంపెనీలో నాలుగేళ్లుగా సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

కరోనా నుంచి వర్క్ ఫ్రొం హోమ్ చేస్తుండగా, మూడు వారాల కిందట తిరిగి ఆఫీసులో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఏదో పని నిమిత్తం బుధవారం రాత్రి కోల్కత్తా నుంచి కోయంబత్తూర్ బయలుదేరాడు.తాను విజయవాడ వరకు వస్తున్నట్లు చెప్పాడు. ఆ తరువాత రాత్రి 10 26 నిమిషాలకు రైలు కట్టక్ బోచుపూడి మార్గంలో వస్తుండగా తండ్రికి ఫోన్ చేశాడు వినయ్. తండ్రితో మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఫోన్ ఆగిపోయింది,

ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా వినయ్ లిఫ్ట్ చేయలేదు. దీంతో కంగారుపడిన వినయ్ తండ్రి హుటాహుటిన విజయవాడకు బయలుదేరాడు. రైలు విజయవాడకి వచ్చే సమయానికి విజయవాడ చేరుకొని, వినయ్ బెర్త్ దగ్గరికి వెళ్ళగా, అక్కడ ఆయన బ్యాగ్ ఉంది కానీ వినయ్ కనిపించలేదు. తోటి ప్రయాణికులను అడగగా రాత్రంతా ఉన్నాడని, పొద్దున లేచి చేసేసరికి లేడని చెప్పారు.

ఏ విషయంపై రైల్వే పోలీసులకు కంప్లైంట్ చేయగా, ఫోన్ కట్ అయిన స్టేషన్లో ఇవ్వాలని విజయవాడ పోలీసులు అన్నారని తల్లిదండ్రులు చెప్పారు. ఇదిలా ఉండగా వినయ్ కి ఐదు నెలల క్రితమే వివాహం అయింది, దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కాగా రైలులో వస్తున్న వినయ్ కుమార్ డోర్ పక్కన నిలబడి మాట్లాడుతూ కింద పడాడ, లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అని అంశం ప్రశ్నార్ధకంగా ఉందని, కుటుంబ సభ్యులు తెలిపారు. వినయ్ కుమార్ ఆచూకీ తెలిస్తే దయచేసి తెలియజేయాలని కోరుతున్నారు. వినయ్ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని మనము కోరుకుందాం.