రోజు ఒక గ్లాస్ తాగితే శరీరం లో జరిగే ఊహించని మార్పులు …..

జీలకర్ర తో చాలా ఉపయోగాలు ఉంటాయి అంటారు కదా, తాలింపు లో కచ్చితంగా జీలకర్రను వాడుతాము, కొంతమంది ది అజీర్తి ఉన్నప్పుడు కూడా జీలకర్ర నోట్లో వేసుకుంటారు. జీలకర్రను ఎలా వాడుకోవచ్చు?ఏ ఆహార పదార్థాలలో వాడుకోవచ్చు?

జీలకర్ర గొప్ప ఔషధం గుణాలు ఎక్కువగా ఉంటాయి, చాలా చోట్ల దీనిని వాడుతాము, ఆయుర్వేదంలో జీలకర్రకి ముఖ్యమైన పాత్ర ఉంది, జీలకర్ర కమ్మని పదార్థాలకు మంచి రుచిని ఇస్తుంది, రుచితో పాటు దాన్ని ఔషధం గంగా ఎప్పుడు ఎప్పుడు వాడుకోవచ్చు అంటే?

చంటి పిల్లలకు కడుపులో నొప్పి వచ్చినప్పుడు జీలకర్ర కషాయం ఇస్తారు, చిన్నపిల్లలు అరుగుదల సరిగ్గా లేనప్పుడు జీలకర్ర కషాయం ఒక స్పూను వరకు ఇవ్వవచ్చు, మరీ పసిపిల్లల అయితే ఒక అరస్పూన్ వరకు ఇవ్వాలి, బాలింతలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది.

జీలకర్ర కి ఎలర్జీని తగ్గించే గుణం ఎక్కువగా ఉంటుంది, పాత కాలంలో జీలకర్ర పంచదార కలిపి తినమనే వారు, జిలకర మాత్రమే తింటే నాలుక ఒక రకంగా ఉంటుందని పంచదారతో కలిపి తీసుకునేవారు, పైత్యపు దద్దుర్లు వచ్చినప్పుడు ఇలా తీసుకుంటే ఎలర్జీ తగ్గిపోతాయి.అలాగే ప్రింట్ ప్రెగ్నెన్సీలో కూడా ఏడవ నెల దగ్గరనుండి జీలకర్ర నీళ్లు ఇస్తారు, ప్రెగ్నెన్సీ లో కొంతమందికి పెయింట్స్ లాగా వచ్చినప్పుడు, ఇలా జీలకర్ర నీళ్లను ఇస్తే నడుము బాధలు అలాంటిది తగ్గి, అరుగుదల కూడా బాగా ఉంటుంది. డెలివరీ తర్వాత కూడా జీలకర్ర నీళ్లను తీసుకుంటే చాలా మంచిది, ఇలా తీసుకుంటే గర్భాశయం అనేది దాని ప్రదేశంలోకి అది కుంచించుకుంటుంది, అలాగే పాలు కూడా పెరుగుతాయి, అల్లము జీలకర్ర కలిపి దంచి తీసుకోవడం వల్ల కూడా పైత్యం తగ్గుతుంది.

జీలకర్ర కషాయం రెగ్యులర్గా తీసుకుంటే, ఎసిడిటి సమస్యలు, అలసట ,విసుగు ఇలాంటి ఉన్నప్పుడు వీటిని తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది, జీలకర్రను ఎన్ని రకాలుగా అయినా వాడుకోవచ్చు, తేనెటీగ కుట్టినప్పుడు కూడా జీలకర్ర దంచి పొడిని పెడుతూ ఉంటే నొప్పి తగ్గుతుంది అంటారు. జీరా వాటర్ ను రెగ్యులర్ గా తాగినా కూడా, అది ఒంటికి ఏమి కీడు చేయదు, మనం రోజు ఈవెనింగ్ టైం లో టీ పెట్టుకుంటాము కదా, ఒకవేళ టీ మానేసి నట్లయితే, ఒక ఆఫ్ స్పూను ధనియాలు, పావు స్పూను జీలకర్ర, ఒక పెద్ద గ్లాసు నీళ్ళు తీసుకొని , బాగా మరిగించండి, ఇలా మరిగితే చక్కటి సువాసన వస్తుంది, మీ దగ్గర ఫ్రెష్ కర్వేపాకు ఉంటే, నాలుగు ఆకులను కూడా అందులో వేయండి, తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసుకుని తేనే వేసుకుని తాగితే బరువు తగ్గుతారు.