వాడు నన్ను 6 ఏళ్లుగా

అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినా మలియాల నటి నిత్యమీనన్, తర్వాత తెలుగులో అనేక సినిమాలు చేసే మంచి హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ఇప్పటికే గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే ఆమె కెరియర్ లో పెద్దగా క్లిక్ అవ్వలేదని చెప్పాలి. ఈ మధ్యనే తెలుగులో మళ్లీ సినిమాలలో బిజీ అవుతున్నామే, తన జీవితానికి సంబంధించిన ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు.

ప్రస్తుతం ఆమె మలయాళ తెలుగు తమిళ సినిమాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు, ఆమె మలయాళంలో విజయ సేతుపతితో కలిసి నటించిన ఒక సినిమాలో నటించారు, ప్రస్తుతం ఆ సినిమా విడుదల కు సిద్ధమైన నేపథ్యంలో ఆమె వరస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సందర్భంగా ఆమె కేరళకు చెందిన సంతోష్ వార్కి అనే వ్యక్తి తనను ఇబ్బందులు పెట్టినట్లు వెల్లడించారు. మోహన్లాల్ హీరోగా నటించిన ఆర్ఆర్2 అనే సినిమాను డీకోడ్ చేసిన సంతోష్ అనే వ్యక్తి, తనని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించి వార్తల్లోకి ఎక్కాడని అప్పటినుంచి అతను తన గురించి అనేక విషయాలు ఉన్నవి లేనివి కల్పించే చెబుతూ తనని ఇబ్బంది పెడుతున్నాడని,

ఒక రకంగా మానసికంగా వేధిస్తున్నాడని నిత్యామీనన్ వెల్లడించారు. సంతోష్ వార్కి మాటలు వినేవారు మూర్ఖులు అన్న ఆమె సంతోష్ వరకే తనని పెళ్లి చేసుకోవాలని కోణాలు గా వేధిస్తున్నాడని 30 కి పైగా మొబైల్ నెంబర్లతో కాల్ చేస్తున్నాడని చికాకు పెడుతున్నాడని అన్నారు. ఇక వారిని బ్లాక్ చేయమని మా తల్లిదండ్రులకు చెప్పానని, అతను సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీతో పెళ్లి అని పంచే పదే చెబుతూ వేధిస్తున్నాడని అన్నారు. నేను అతన్ని క్షమించానని అతని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయనని చాలామంది చేయమని సలహా ఇచ్చిన నేను ఫిర్యాదు చేయలేదని అన్నారు. ఇక నిత్యామీనన్ చేసిన ఆరోపణలపై సంతోష్ వార్కి స్పందించారు.

30కి పైగా నెంబర్లనుంచి కాల్ చేసి చిత్రహింసలకు గురి చేశానని ఆమె ఆరోపించారని, అయితే ఒక్క వ్యక్తి తన పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు కొంటాడో తెలిసిన వారు ఇది తానే చేశాను లేదో ఊహించుకోవచ్చు అని అన్నారు, అంతే కాదు నిత్యామీనన్ తల్లి ఆమె ఎవరితోనో నిశ్చితార్థం జరిగిందని చెప్పారు. అయితే ఆమెకు ఎవరితోనూ నిశ్చితార్థం జరగలేదని ఆమె తండ్రి చెప్పారని వారు వేరువేరుగా మాట్లాడడంతో నేను చాలా కంగారు పడ్డాను అని అన్నారు. అంతేకాక వారు నాపై లైంగిక వేధింపులకు కేసు పెట్టబోతున్నారని తెలిసింది, అలాగే నాన్న చనిపోయిన తర్వాత ఏ విషయంలోనూ జోక్యం చేసుకోకుండా విధులు నిర్వహిస్తున్నాను. ఇది నాకు తెలిసి ఉంటే నేను ఆమెలో ఆమెతో ప్రేమలో పడి ఆమె చుట్టూ తిరిగే వాడిని కాదని చెప్పుకొచ్చారు.