విజయశాంతి భర్తను చూస్తే

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఎదిగినటువంటి అలనాటి హీరోయిన్లలో, విజయశాంతి కూడా ఒకరు. నటనలోనూ డాన్స్ లోనూ గ్లామర్ లోను తనని మించిన వారు ఎవ్వరూ లేరు. సహజమైన మహిళగా లేడీ అమితాబ్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. కర్తవ్యం నేటి భారతం, ప్రతిఘటన, ఒసేయ్ రాములమ్మ వంటి సూపర్ హిట్ మూవీస్ లో అగ్ర హీరోల అందరి సరసన నటించి,

హీరోలతో సమానంగా పారితోషకాన్ని అందుకున్న నటి విజయశాంతి మాత్రమే. అప్పట్లో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి, రాజకీయంగా కూడా చాలా ఫేమస్ అయ్యింది. అయితే విజయశాంతికి పెళ్లయిందని అందరికీ తెలుసు, కానీ ఆమె భర్త గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం విజయశాంతి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం. విజయశాంతి అసలు పేరు శాంతి, సినిమాలోకి వచ్చాక తన పేరును విజయశాంతిగా మార్చుకుంది.

విజయశాంతి ఇప్పటివరకు వందకు పైగా మూవీస్ లో హీరోయిన్ గా నటించింది. 1996లో అనపర్తి అనే గ్రామంలో విజయశాంతి జన్మించింది. కానీ ఈ విషయం ఇంతవరకు ఎవరికీ తెలియదు. విజయశాంతి తండ్రి పేరు సతీష్, తల్లి పేరు వరలక్ష్మి, విజయశాంతి పెళ్లి చాలా సీక్రెట్ గా జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ప్రముఖులకే తెలియదంటే, విజయశాంతి ఎంత సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుందో అర్థం చేసుకోవచ్చు.

విజయశాంతి భర్త పేరు ఎంపి శ్రీనివాస్ ప్రసాద్, విజయశాంతి భర్త వేరేవరో కాదు, సీనియర్ ఎన్టీఆర్ గారి పెద్ద అల్లుడు గణేష్ రావుకి స్వయాన మేనల్లుడు, దాని కారణం గానే శ్రీనివాస్ ప్రసాద్ కి బాలయ్య కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. దానివల్లే శ్రీనివాస్ నందమూరి యువ రత్న ఆర్ట్స్ బ్యానర్ పై విజయశాంతిని, బాలయ్య బాబుని జోడిగా పెట్టి నిప్పురవ్వ అనే సినిమా తీయాలనుకున్నాడు. అందుకే విజయశాంతి కాల్షీట్ కోసం ఆమె ఇంటికి తరచూ వెళ్లేవాడు శ్రీనివాస్.

అప్పటికే కుటుంబాన్ని కోల్పోయిన విజయశాంతికి, శ్రీనివాస్కి పరిచయమే ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది, ఈ పెళ్లికి నందమూరి బాలకృష్ణ పెళ్లి పెద్దగా వ్యవహరించారు. విజయశాంతి తన సెకండ్ ఇన్నింగ్స్ ను సరిలేరు నీకెవ్వరు, అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక రొటీన్ సినిమాల్లో నటించడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని, భవిష్యత్తులో ఒక యాక్షన్ సినిమాలో నటించాలని, కోరుకున్నట్లు తెలిపింది విజయశాంతి.