వినాయక చవితి లోపు అనగా ఆగష్టు31లోపు పూజ గదిలో ఇవి ఉంటే వేంటనే తీసేయండి లేదా

పూజా విధానాలలో ఎన్నో రకాలు ఉన్నట్లే పూజ గదిలో కూడా ఎన్నో రకాల పూజ గదులు ఉంటాయి. అంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రకమైన వస్తువు ఉంటుంది కాబట్టి పూజగది ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క లాగా ఉంటుంది. అయితే పూజ గదిలో కొన్ని రకాలైన పూజా సామాన్లు ఉండకూడదు ఒకవేళ ఉంటే వినాయక చవితి లోపు వాటిని తొలగించండి అని పండితులు చెబుతున్నారు. మరి ఆ విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. దేవుళ్ళందరికీ కూడా ప్రధమ నాయకుడు వినాయకుడు. ఆ గణపతిని పూజించని వేడుకొని భక్తులు ఉండరు ఆయన లేనిది ఏ కార్యము జరగదు. వినాయకుడు సకల దేవత గణాలకు అధిపతి, అన్ని అడ్డంకులు తొలగించే విఘ్నారాజు, అన్ని కార్యాలకు పూజలకు ప్రథమంగా పూజలు అందుకునేవాడు వినాయకుడు, అందుకే మొదట ఏ పూజ అయినా వినాయకుడి పూజతో మొదలవుతుంది.

భక్తుడు ఏ పూజ చేయదలచుకున్న మొదట పూజించేది స్మరించుకునేది వినాయకుడిని అని మన అందరికీ తెలిసిన విషయమే. చూడడానికి పూర్ణకుంభం లాంటి దేహం, బాణా కడుపు, తొండం ఉంటుంది వినాయకుడికి. ఇది పరిపూర్ణమైన జగత్తుకు గుర్తు ఏనుగు తల ,సన్నని కళ్ళు మేధస్సుకు సంకేతాలు. వక్రతుండo ఓంకార ప్రణవ నాదానికి ప్రతీకలు. ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఓ చిన్న ఎలుక ఇది వినాయకుడి వాహనం. నాలుగు చేతులు మానవతీత సామర్థ్యాలకు తత్వానికి సoకేతాలు ఇలా ప్రతిదీ ఒక విశేషమే. వినాయక చవితి పండుగ ప్రతీ సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్షాన నాలుగవ రోజు చవితి రోజు వస్తుంది. పది రోజులు కొనసాగుతూ చతుర్దశి తిధి రోజు ముగుస్తుంది. భాద్రపద మాసంలో శుక్ల పక్షం నాలుగవ రోజు అనగా చవితి రోజు వినాయక చవితి పండుగను జరుపుకుంటూ ఉంటారు.

అయితే వినాయక చవితి లోపు పూజ గదిలో ఉండే కొన్ని పూజా సామాన్లను తొలగిస్తే వాటితో పాటే మీ దరిద్రం కూడా పోతుందని పండితులు అంటున్నారు. మరి ఆ విషయంలోనికి వస్తే వినాయకుడికి చెందిన మూడు ప్రతిమలను పూజ గదిలో ఉంచుకోకూడదు. ఇంట్లో ఇలా మూడు వినాయక ప్రతిమలు ఉంచితే అనారోగ్యకరమైన సమస్యలు వస్తాయి. అలాగే ఇంట్లో శివలింగాన్ని ఉంచకూడదు కొన్నిసార్లు శివలింగానికి అభిషేకం చేయడం కుదరకపోవచ్చు అలాంటప్పుడు శివలింగానికి పూజ చేయడం కుదరదు, అందువల్ల మహా శివునికి కోపం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శివలింగాన్ని ఇంట్లో ఉంచకండి. అలాగే విరిగిన ప్రతిమలను ఇంట్లో పూజ గదిలో ఉంచకూడదు, ఇలా విరిగిన ప్రతిమలకు లేదా ఫోటోలకు పూజ చేయడం అనేది చాలా అరిష్టానికి దారితీస్తుంది, ఇలా పూజ చేయడం ద్వారా ఎంతటి పని కూడా అయినా కూడా నిరుపేదగా మారిపోయే అవకాశం ఉంది, కాబట్టి వీటిని ఎక్కడైనా ప్రవహించే నీటిలో వదిలి వేయండి.

గుడ్లగూబ మీద ఆసీనులైవున్న లక్ష్మీదేవి ప్రతిమను ఇంట్లో ఉంచకూడదు ఎందుకంటే అలాంటి లక్ష్మీదేవి ఫోటో ఉంటే లక్ష్మి ఇంట్లో నిలబడదు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కనుక మీ ఇంట్లో గుడ్లగూబ పై ఆసీనురాలు అయి ఉన్నా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్నట్లయితే వినాయక చవితి లోపు ఆ ఫోటోను తొలగించండి. అలాగే లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటోను ఇంట్లో పెట్టుకుంటే ధనం అనేది ఇంట్లోకి రాదు కాబట్టి లక్ష్మీదేవి నిలబడే ఉన్న ఫోటోలు కూడా ఇంట్లో ఉంచరాదు. రుద్ర నరసింహ ఫోటోలను అలాగే రుద్ర రూపంలో ఉన్న దేవత ఫోటోలను కూడా పూజ గదిలో పెట్టుకోకూడదు, అలా పెట్టుకోవడం వల్ల మానసిక ఆందోళన కలుగుతుంది అలాంటి ఫోటోలను వినాయక చవితిలోపు పూజ గది నుండి తొలగించండి, వినాయక చవితి లోపు మీ పూజ గదిలో ఇలాంటి ఫోటోలు ఉంటే తొలగించండి అప్పుడే మీకు ఉన్న దరిద్రం తొలగిపోతుంది.

devotional