వీటితో అనంత‌ కోటి క‌ ష్టాల‌ను దూరం చేసుకోండి

కొందరు అంటూ ఉంటారు మీ ఇంటిలో కష్టాలు అన్నిటికి గోత్ర శాపం ఉందండి, మీ పెద్దలకు ఏదో ద్రోహం జరిగింది, మరి వాటికి ఏం చేయాలి? ఎక్కడో దక్షిణాది క్షేత్రం ఉందట అక్కడికి వెళ్లి రావాలి అని మొదలు పెడితే ఆ ఖర్చులంతా కలిపి లక్షన్నర వరకు దాటుతుంది. అంతకంటే వేరే మార్గం లేదా అంటే తప్పకుండా ఉంది, నారద పురాణంలో చెప్పాడు

మహానుభావుడు చాలా సులభమైన మార్గం నీ దగ్గర ధనం ఉంటే అక్కడిదాకా వెళ్ళు కాదు అనడం లేదు, కానీ సులభమైన మార్గం ఒకటి ఉంది అది ఏమిటంటే మీరు స్నానం చేసే నీళ్లలో 11 ఆవగింజలను వేసుకోండి. మీ వయసు 30 అయితే 90 రోజులపాటు ఈ ఆవగింజలతో స్నానం చేసుకోండి, ఇలా 90 రోజులు స్నానం చేయలేని వారు, కనీసం శని ఆదివారాలలో అయినా సరే తప్పకుండా స్నానం చేయండి. మిగిలిన రోజులలో ఆవగింజలను వేసిన నీటిని చల్లుకోండి. ఇలా స్నానం పూర్తి అయిన తర్వాత మీ ఇంట్లో దేవుడు ఫోటోలు పెట్టే సన్నిధి ఉంటుంది కదా

అక్కడ మీ పెద్దలది మీ తాతలది కానీ ముత్తాతలు కానీ ఏదైనా ఫోటో ఉంటే అక్కడ పెట్టుకుని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని కొంచెం పెద్ద శ్లోకమైనా సరే కానీ తేలికగానే ఉంటుంది, కాబట్టి దీనిని 27 సార్లు చదువుకోండి. “తతస్తుతే పుణ్యతాం శివం శుభం మహర్షి గంధర్వి నిషేవితం ఉదకాo త్రిలోకకాంత అపతీర్య జాగ్రవీన్ రుృష్యాంశ దేవాంశ పితృ తర్పయామి”. నేను చేసే స్నానం మామూలు స్నానం కాదు అదేమిటో తెలుసా గంగా స్నానం, మనం చేసే నీటిని గంగగా భావించాలి, ఎక్కడో విష్ణు పాదం నుండి పుట్టి శివుని శిరస్సు మెట్టి, హిమాలయ పర్వతం మీద అడుగు పెట్టి అక్కడి నుండి కిందికి దిగి వచ్చి ఋషి శాపం తిన్న ఆ గంగ కంటే కూడా నేను మంచినీరే తీసుకున్నాను.

అయ్యా నేను అని , ఈ స్నానం పుణ్యకరమైనది మంగళకరమైనది, క్షేమాన్ని కలిగించేది. మహర్షులు గంధర్వులు కూడా శీతాకాలంలో స్నానం చేయడానికి గంగా గడ్డ కట్టిపోతుంది కదా మరి వాళ్ళు స్నానం ఎలా చేస్తారు అని అడిగాడు వెంకటాద్రి అలాంటి వాళ్లందరూ కూడా సేవించిన గంగ ఇది. మూడు లోకాలు పవిత్రం చేసిన దాన్ని దాటి ఋషులను, దేవతలను, పితృదేవతలను వీళ్ళందర్నీ కూడా తృప్తి కలిగిస్తాను. ఈ శ్లోకo 27 సార్లు చదువుకోవాలి, స్నానం చేసి బయటికి వస్తూనే తల తుడుచుకుంటూ శరీరం తుడుచుకుంటూ కూడా ఈ శ్లోకాన్ని చెప్పుకోవచ్చు అప్పుడు 27 సార్లు శ్లోకం చదవడం అనేది త్వరగా పూర్తవుతుంది. తర్వాత చక్కగా నువ్వులు బియ్యం పిండి కలిపి నివేదన చేయండి క్షేమం కలుగుతుంది.