శక్తీవంతమైన భూవరాహ స్వామి దేవస్థానం

ప్రతి ఒక్కరికి జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది అది కొంతమందికి నెరవేరిన మరి కొంతమందికి అది కలగానే మిగిలిపోతుంది. అలాంటప్పుడు వారికి దైవ బలం తోడై ఉండాలి అయితే సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి భూ వరాహ స్వామి క్షేత్రానికి వచ్చి సంకల్పం చెప్పుకొని వెళ్లిన వారికి చాలా తొందరగా తమ సొంతింటిని కట్టుకొని తిరిగి మొక్కును చెల్లించుకున్న భక్తులు వేలకొద్దీ ఉన్నారు.

అయితే ఈ క్షేత్రం మండ్యా డిస్టిక్ లోని కేఆర్ పేట నుండి 18 కిలోమీటర్ల దూరంలో కలహళ్లి అనే గ్రామం హేమావతి నది ఒడ్డు మీద ఈ దేవస్థానం కట్టారు. ఈ ఆలయం పూర్వ దిశకు ఫేసింగ్ అయి ఉంటుంది విలేజ్ మధ్యలో ఈ దేవస్థానం ఉంది కాబట్టి అయినంతవరకు ఓన్ వెహికల్స్ లోనే రావడం మంచిది, ఎందుకంటే బస్సు సౌకర్యాలు ఉన్నవి కానీ అంత ఎక్కువగా లేవు.

ప్రతిరోజు అంటే సోమవారం నుండి ఆదివారం వరకు ప్రతిరోజు గుడి తెరిచి ఉంటుంది. మార్నింగ్ మాత్రం ఎనిమిది గంటల నుండి రెండు గంటల వరకు ఉంటుంది, మధ్యాహ్నం మూడున్నర నుండి ఏడు గంటల వరకు తెరచి ఉంటుంది, మధ్యాహ్న సమయంలో అన్న ప్రసాదాలు కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మూలవిరాట్ గురించి పురాణ గాధల్లో ఏమని చెప్పబడింది అంటే, శ్రీహరి తన భార్యను తొడ మీద కూర్చోబెట్టుకొని ముత్యాల పోగులు ఆభరణాలు ఇస్తున్నట్లు పురాణాల్లో చెప్పబడింది. అయితే ఎవరైతే వీళ్ళ దర్శనాన్ని చేసుకుంటారో వాళ్లు ఎప్పుడు నిత్య దీర్ఘ సుమంగళిగా ఉంటారని అర్థం. జగత్ పురుషుడు అయిన నారాయణుడు, జగన్మాత అయిన భూదేవి భూవరాహ రూపంలో ఇక్కడ కూర్చుని ఉంటారు. ఇక్కడ పూజ అభిషేకాలు చేయించుకోవాలి అంటే హేమావతి నదిలో స్నానాలు చేసుకొని వచ్చి ఇక్కడ పూజలు జరిపించుకుంటూ ఉంటారు ఇక్కడికి వచ్చే భక్తులు. మనకి పూజకి కావాల్సిన సామాగ్రి అంతా అక్కడ గుడి బయట లభిస్తాయి.

సైటు ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు లేదా ఇల్లు కట్టుకొని మధ్యలో ఆగిపోయిన వారు ఇటుకలతో పూజ చేస్తారు, ఇటుక పూజ లేదా మట్టి పూజకి టికెట్ వంద రూపాయలు ఉంటుంది, ఇందులో రెండు ఇటుకలు ఇస్తారు, ఒక ఇటుకని అక్కడ పూజ చేసి పెట్టాల్సి ఉంటుంది, మరొక ఇటుకను మనం ఇంటికి తెచ్చుకొని మన పూజా మందిరంలో పెట్టుకుని మన కోరిక నెరవేరే దాకా పూజలు చేయాలి, కోరిక నెరవేరిన తర్వాత ఆ ఇట్టుకని ఇంటి ద్వారానికి ముందు మనం పూజ చేస్తాం కదా ఆ ఇటుకను ఇంటి ద్వారం ముందు పెట్టి ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేయాలి. మరొకటి మట్టి పూజ, భూమి కొనుక్కోవాలి అన్న , పొలం కొనుక్కోవాలి అన్న, ఇల్లు కొనుక్కోవాలి అన్న మూడు పిరికిడిలా మట్టి తీసుకొని ఆ మట్టిని పూజకి ఇవ్వాలి, ఇలా మట్టి అయితే మట్టిని లేదా ఇటుకను పట్టుకొని గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసిన తర్వాత అప్పుడు పూజకు వెళ్లాలి.

ఇలా పూజ అయిపోయిన తర్వాత మళ్లీ దర్శనానికి వెళ్లి దశావతారాలలో 10 అవతారాలలో ఒక అవతారమైన భూ వరాహస్వామి అవతారాన్ని తనివి తీరా దర్శించుకోవాలి. అయితే దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు మనకి స్వామి వారి ఫోటో ఒకటి ఇస్తారు. అలాగే అక్కడి నుండి తీసుకువచ్చిన మట్టిని ఒక ముడుపు లాగా కట్టుకొని మూడు రోజుల వరకు పూజ చేయాలి, అలా నీ కోరిక నెరవేరే వరకు కంటిన్యూగా పూజ చేస్తూ కోరిక నెరవేరిన తర్వాత ఇల్లు కట్టుకునే సమయం వచ్చినప్పుడు భూమి పూజ చేస్తారు కదా , ఆ భూమి పూజలో ఆ మట్టిని వేసి అప్పుడు ఇల్లు ప్రారంభించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది.