శాస్త్రవేత్తలకే చమటలు పట్టిస్తున్న మొక్క ఎక్కడైనా కనిపిస్తే వేర్లను కూడా వదలకండి

ఈరోజు మనం ఒక అద్భుతమైన మొక్క గురించి తెలుసుకుందాం.అదే అమృత కాడ,ఈమొక్క గ్రామాలలో ఉండే ప్రతి ఒక్కరికి దాదాపుగా తెలిసే ఉంటుంది.ఈమొక్క గ్రామాలలో ఎక్కడ చూసినా కనిపిస్తుంది దీన్ని కొన్ని చోట్ల అమృతకాడ మరికొన్ని చోట్ల నీరు కాసెపు,మరికొన్ని చోట్ల యాండ్రాకు అని పిలుస్తుంటారు.అంతేకాకుండా తెలంగాణలో చాలా ప్రాంతాలలో వెదురు ఆలం, వెన్నముద్ద ఆలం అని కూడా పిలుస్తుంటారు. ఈయాండ్రాకు మొక్కలు వర్షాకాలం మరియు శీతాకాలంలో ఎక్కువగా కనిపిస్తాయి వేసవి కాలంలో తేమ ఎక్కువగా ఉన్న చోటులో ఇవి మొలుస్తాయి.వర్షాకాలంలో ఈమొక్క నీలి రంగు పూలతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈమొక్కను కొద్దిగా తెంచి చూస్తే అందులో నుంచి జిగురు లాంటి పదార్థం వస్తుంది. ఈజిగురును ఎక్కడైతే కురుపులు మొటిమలు గడ్డలు ఉంటాయో వాటిపై పైపూతగా రాస్తే అవి తొందరగా తగ్గిపోతాయి.

ఈయాండ్రాకు మొక్కని జంతువులు ఎంతో ఇష్టంగా తింటాయి.ఈమొక్క ఆకులే కాకుండా కాండాన్ని కూడా ఎంతో ఇష్టంగా పశువులు తింటాయి.పశువులు ఈనిన తర్వాత వాటికి ఈ మొక్కలు ఎక్కువగా ఆహారంగా పెడతారు. మొదటి కొన్ని రోజులు ఈ యాండ్రాకు మొక్కని పెట్టిన తర్వాతనే వేరే ఆహారం పెడతారు. పశువులకి ఈ యాండ్రాకు మొక్క పెట్టడం వల్ల పాలు కూడా బాగా ఇస్తాయి.ఈ యాండ్రాకు మొక్క విష జ్వరాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. విష జ్వరం, జలుబు, తలనొప్పి తగ్గాలంటే ఈయాండ్రాకు ఆకులను తీసుకువచ్చి దానిలో రెండు గ్లాసుల నీళ్ళు పోసి వాటితోపాటు అర స్పూను జీలకర్ర, నాలుగు మిరియాలు దంచి వేయాలి.దీన్ని కషాయంగా చేసి తీసుకున్నట్లయితే విషజ్వరాలు తలనొప్పి జలుబు తొందరగా తగ్గుతాయి.

అలాగే మనకు తగిలిన గాయాలను పుండ్లను తగ్గించడంలో ఈ మొక్క ఎంతో ఉపయోగపడుతుంది.యాండ్రాకు మొక్క ఆకులను తీసుకువచ్చి దాంట్లో కొద్దిగా పసుపు వేసి మెత్తగా పేస్టులాగా నూరి గాయాలపై,చర్మ వ్యాధుల పైన పూసినట్లయితే తొందరగా తగ్గిపోతాయి.చాలా ప్రాంతాలలో ఈ మొక్కని కంటి రోగాలకు,కంటి నుండి నీరు కారడం,కంటి చూపు తగ్గడం,కళ్ళలో తెల్లని పూలు రావడం,కళ్లు ఎర్రబడటం వంటి సమస్యలు తగ్గించడానికి ఈమొక్కలు వాడుతారు.అన్ని కంటి సమస్యలకు ఈమొక్క యొక్క ఆకులు తెచ్చి మెత్తగా నూరి లేపనంగా వాడాలి.రాత్రి పడుకునే సమయంలో కనురెప్పల పైన పూసి ఉదయం లేవగానే చల్లని నీటితో కడుక్కుంటే అన్ని రకాల కంటి సమస్యలు తొలగిపోతాయి.

కొన్ని ప్రాంతాలలో ఈమొక్కలను మొలల వ్యాధిని తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు.ఈమొక్క యొక్క ఆకులు మరియు కాండాన్ని తీసుకుని మెత్తగా నూరి పేస్టులా చేసుకున రాత్రి పూట రాసుకున్నట్లయితే మొలలు తొందరగా తగ్గుతాయి అని అంటారు.కొన్ని ప్రాంతాలలో అయితే మలేరియా జ్వరాన్ని తగ్గించడానికి కూడా ఈమొక్కను వాడుతారు.ఈమొక్క యొక్క ఆకులు కాండాన్నీ తీసుకువచ్చి మెత్తగా దంచి ఆపేస్టుని గ్లాసు నీళ్ళలో వేసి,రాత్రి మొత్తం అలాగే ఉంచి,ఉదయాన్నే జ్వరంతో బాధపడే వ్యక్తికి తాపడం వలన తొందరగా మలేరియా జ్వరం తగ్గిపోతుంది.దీంతో పాటు ప్రతిరోజూ ఆహారంలో జొన్నరొట్టె, ఎల్లిపాయ కారం తినడం వల్ల త్వరగా మలేరియా జ్వరం తగ్గిపోతుంది.