షుగర్ కి ఇక సెలవు

ప్రతి ముగ్గురి లో ఒకరికి షుగర్ వ్యాధి సిటీలో, పట్టణాలలో బాగా కనపడుతుంది. ఇంతకుముందు ప్రతి ఐదుగురిలో ఒక్కరికి సిటీలో కనబడితే ఇప్పుడు అది రెట్టింపు అయ్యి ముగ్గురిలో ఒకరికి కనిపిస్తుంది.

ఇది ప్రస్తుతం లెక్క. మరి అలాంటి షుగర్ వ్యాధి ఉన్నవారికి పండ్లు తింటే పండ్ల రసాలు తాగితే షుగర్ పెరుగుతుంది అని భయం ఉంటుంది అందుకని ఏ డాక్టర్స్ కూడా షుగర్ స్పెషలిస్ట్ కూడా ఫ్రూట్‌ జ్యూస్ తాగమని చెప్పరు.

ఫ్రూట్స్ కూడా ఎక్కువ వెరైటీస్ తినమని కూడా చెప్పరు, మరి బాడికి వండకుండా ప్రకృతి సిద్ధంగా ఇచ్చిన వాటిని ఇచ్చినట్లుగా తినడానికి అవకాశం ఉండేది ఫ్రూట్స్ కదా మరి అలాంటి ఫ్రూట్స్ని , జ్యూస్ ని డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోకూడదు, వీటికి ఎక్కువగా దూరంగా ఉంటారు భయపడతారు కాబట్టి వీరికి నాచురల్ డైట్ అందకుండా రోజు నాలుగు పూటలా ఉడికిన ఆహారాలు తిన్నందువల్ల అవి షుగర్ పెరగకూడదు అని రకరకాలుగా తింటున్నందువల్ల వీళ్ళకి బ్లడ్ లో ఐరన్ లెవెల్స్ తగ్గిపోవడం హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోవడం బ్లడ్ పర్సంటేజ్ తగ్గిపోవడం ఇలాంటివి జరుగుతాయి.

రక్తహీనత షుగర్ పేషంట్స్ కి కూడా చాలా మందికి వస్తూ ఉంటాయి, రక్తం తక్కువగా ఉంది అంటే ఇక చివరి భాగాలకు ప్రసరణ తగ్గిపోయి మరింత సమస్యలు వస్తూ ఉంటాయి. డయాబెటిస్ వల్ల వచ్చే ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్ బ్లడ్ సర్క్యులేషన్ స్లో చేస్తుంది, రక్తం చిక్కబడేటట్లు చేస్తుంది, రక్తనాళాలు గట్టి పడేటట్లు చేస్తుంది అందుకే రక్తప్రసరణ సరిగ్గా అవయవాలకు జరగనందువల్లే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. రక్తం పుష్కలంగా ఉంటే వాళ్ళు యాక్టివ్గా ,ఎనర్జిటిక్ గా వీక్నెస్ లేకుండా పనిచేసుకోవచ్చు. అందుకని డయాబెటిస్ ఉండి రక్తహీనత ఉండే రక్తం పెరగాల్సిన వారు తాగవలసిన రక్తాన్ని పుట్టించే జ్యూస్ లో రెండు ఉన్నాయి. ఈ రెండు జ్యూస్లను కనుక తాగితే షుగర్ పెరగదు రక్తం ఫుల్ గా పెరుగుతుంది.

హిమోగ్లోబిన్ లెవెల్స్ వన్ మంత్ తిరక్కుండానే నార్మల్ కి వచ్చేస్తాయి అంతా అద్భుతంగా పనికివచ్చే జ్యూస్ ను డయాబెటిస్ పేషెంట్స్ కోసం తెలుసుకుందాం. అది వీట్ గ్రాస్ జ్యూస్, దీని విషయానికి వస్తే ఈ జ్యూస్ ని ఒక పెద్ద కాఫీ కప్పు మోతలో తీసుకుంటే సరిపోతుంది , ఈ గోధుమ గడ్డిని ఇంట్లో పండించుకోవచ్చు లేదా బయట మార్కెట్లో కూడా చాలా చోట్ల డోర్ డెలివరీ కూడా చేసి అమ్ముతున్నారు అలాగే ఫుడ్ స్టోర్స్ లో కూడా అమ్ముతూ ఉంటారు, అలాంటి చోట అయినా సరే తెచ్చుకోండి తక్కువ ఖర్చులో అవ్వాలి అంటే ఇంట్లో ప్లాస్టిక్ ట్రే లో పండించుకోండి. ఈ గడ్డిని ఆరు నుండి ఏడు రోజుల వరకే పెంచి వాడుకోవాలి.

ఇలా గోధుమ గడ్డిని కట్ చేసుకుని గ్రైండ్ చేసుకుని వడకట్టుకుని పిప్పి తీసేసి ఆ గోధుమ గడ్డి కప్పు జ్యూస్ కి షుగర్ పెరగకుండా ఉండాలంటే వీళ్ళు ఏమి వేసుకుంటే మంచిదంటే ఒక స్పూన్ ఎండు ఖర్జూరం పొడి వేసుకోండి, దీనిలో ఐరన్ కంటెంట్ బావుంటుంది, అలాగే బ్లడ్ ఫార్మింగ్ కి చాలా మంచిది. ఒకవేళ ఎండు ఖర్జూరం లేని సమయంలో ఒకటి ఒకటిన్నర స్పూన్ల వరకు తేనె వేసుకోవాలి, తేనె వాళ్ళం వల్ల నూటికి ఆ జ్యూస్ రుచిగా ఉంటుంది, ఇవి రెండు కూడా లేకుండా త్రాగవచ్చు కానీ ఇది వేసుకుంటే త్రాగడానికి కాస్త రుచిగా ఉంటుంది షుగర్ పెరగదు.

దీన్ని రోజు ఒక్కసారి లేదా రెండు సార్లు అయినా సరే తీసుకోవచ్చు షుగర్ పెరగదు ,బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. దీన్ని రోజు బ్రేక్ఫాస్ట్ తినడానికి ఒక గంట ముందు త్రాగండి అలాగే నైట్ తీసుకున్నట్లయితే డిన్నర్ తీసుకునే ముందు ఒక గంట ముందు త్రాగండి ఇలా రోజుకు రెండు సార్లు కూడా తీసుకోవచ్చు, ఇమీడియట్గా బ్లడ్ పర్సంటేజ్ ని ఇంప్రూవ్ చేయడానికి మంచిది.