సింధు మీనన్ ఏంటి ఇలా మారిపోయింది

కొంతమంది నటులు తెలుగు లో చేసినవి కొన్ని సినిమాలే అయినా జనాల మైండ్ లో రిజిస్టర్ అవుతారు. వాళ్లలో సింధుమీనన్ ఒకరు. సింధు మీనన్ బెంగళూరు లో నివసించే ఒక మలయాళీ కుటుంబానికి చెందిన వారు.

మాతృభాష మలయాళం అయినప్పటికీ సింధు మీనన్ పుట్టిపెరిగింది మొత్తం బెంగళూరులోనే. సింధు మీనన్ చిన్నప్పటి నుండే భరతనాట్యం నేర్చుకున్నారు. ఒక భరతనాట్యం కాంపిటీషన్ లో పాల్గొని అందులో విజేతగా నిలిచారు సింధు మీనన్.

ఆ కాంపిటీషన్ కి జడ్జ్ అయిన భాస్కర్ హెగ్డే సింధూ మీనన్ ని కన్నడ డైరెక్టర్ కె.వి.జయరామ్ కి పరిచయం చేశారు. 1994లో జయరామ్ దర్శకత్వం వహించిన రష్మీ అనే సినిమాతో బాల నటి గా సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు సింధు మీనన్.

తర్వాత మరో రెండు సినిమాల్లో నటించారు. 1999లో ప్రేమ ప్రేమ ప్రేమ అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్ గా కెరియర్ ను మొదలు పెట్టారు. 2001లో వచ్చిన, రియల్ స్టార్ శ్రీహరి గారు నటించిన భద్రాచలం సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయ్యారు సింధు మీనన్. తర్వాత ఎన్నో తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించారు. తెలుగులో లో త్రినేత్రం, శ్రీరామచంద్రులు, ఇన్స్పెక్టర్, ఆడంతే అదో టైపు, చందమామ, రెయిన్ బో, సిద్ధం, ప్రేమ పిలుస్తోంది, సుభద్ర సినిమాల్లో నటించారు.

చందమామ లో తన నటనకు ఎన్నో ప్రశంసలు అందుకున్నారు సింధు మీనన్. 2009 లో వచ్చిన డబ్బింగ్ చిత్రం వైశాలి ద్వారా తెలుగు ప్రజలకు ఇంకా దగ్గరయ్యారు. 2012లో వచ్చిన తెలుగు చిత్రం సుభద్ర సింధు మీనన్ నటించిన చివరి చిత్రం. ఆ తర్వాత మరే సినిమా లోనూ నటించలేదు. 2010లో యు.కె లో నివసించే ఐటీ ప్రొఫెషనల్ అయిన డొమినిక్ ప్రభు ని పెళ్లి చేసుకున్నారు. వారికి ఇప్పుడు ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ప్రస్తుతం సింధుమీనన్ విదేశాల్లో ఉంటున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సింధుమీనన్ ఫోటోలు కొన్ని ఇప్పుడు చూద్దాం.