స్త్రీలకి మాసిక ధర్మం వచ్చినప్పుడు ఐదవ రోజు తో శుద్ధి అవుతుందా అయిదవ రోజు నుండి వారు పూజలు చేసుకోవచ్చునా, దీపారాధన హోమం దానం ఇలాంటివన్నీ చేసుకోవడానికి ఆ రోజు అధికారం వస్తుందా,
శుద్ధి అయినట్టేనా ఇది చాలా మంది అడుగుతున్నటువంటి మాట. మొదటి మూడు రోజుల్లో కూడా స్త్రీకి ఆ రజో దోషం ఉంటుంది కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ సుచిగా ఉండరు కనుక, ఎటువంటి దేవపుత్రు కార్యాలలో కూడా వారు పనికిరారు
నాలుగవ రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లోకి రావడానికి, భర్తని పిల్లల్ని ముట్టుకోవడానికి భర్తకి సేవ చేసుకోవడానికి, వారికి అధికారం ఏర్పడుతుంది. నాలుగవ రోజు శ్రీ స్నానం చేసిన తర్వాత ఆ సౌభాగ్యవతి తన భర్తకు సేవ చేసుకునేటటువంటి అధికారాన్ని పొందుతుంది. భర్తకు సేవ అంటే భర్త పిలిచినప్పుడు పలకడం, అలాగే ఏమైనా కావాలి అంటే సమకూర్చి పెట్టడం ఇలాంటివి. నాలుగవ రోజు కూడా వంట వార్పు చేసుకోవడానికి కాను, గుడికి వెళ్లడానికి ఇంట్లో ఉండేటటువంటి దేవుడికి దీపారాధన చేసుకోవడానికి, తాంబూలం పుచ్చుకోవడానికి, ఇలాంటి వేటికి పనికిరారు.
నాలుగవ రోజు కూడా తలకి నూనె పెట్టుకోవడం కానీ, లేదా కాటుక పెట్టుకోవడం కానీ, గంధం కాళ్ళకి పసుపు, ఇలాంటివి పనికిరావు కుంకుమ ధరించడం కూడా నాలుగవ రోజు చేయకూడదు. ఐదవ రోజు వచ్చేసరికిపూర్తిగా శుద్ధ రాలు అవుతుంది. తలారా స్నానం చేస్తే అక్కడనుండి ఆవిడ దేవతా కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా, అధికారాన్ని పొంది ఉంటుంది. కనుక నిచ్చ దీపారాధన చేసుకోవచ్చు కుంకుమ పెట్టుకోవచ్చు పసుపు రాసుకోవచ్చు తలలో పూలు పెట్టుకోవచ్చు, గంధం పెట్టుకోవచ్చు, తాను తాంబూలం స్వీకరించవచ్చు, ఎదుటి వారికి తాంబూలం ఇవ్వచ్చు దీపారాధన నిత్య పూజ దేవాలయానికి వెళ్లడం వ్రతాలు యజ్ఞలు హోమాలు దానాలు, శ్రద్ధార్థి కర్మల్లో పాల్గొనవచ్చు.
అన్నింటిలో ఆవిడకి అధికారం వస్తుంది. అని అర్థం కనుక ఐదో రోజు నుంచి కూడా వారు శుద్ధుల కిందే లెక్క. ఒక్కోసారి అనారోగ్య కారణాల చేత, స్త్రీలకు స్రావం చాలా ఎక్కువ కాలం ఉంటూ ఉంటుంది. అటువంటి సందర్భాలలో అధికంగా కొంతమందికి 10, 15 రోజులు స్రావం అవుతూ ఉంటుంది. అప్పుడు కూడా వారికి అశుచిత్వం లేదు, అంటే దూరంగా కూర్చోనవసరం లేదు, స్నానం చేసుకొని ఇంట్లోకి రావచ్చు, మూడు రోజులు మాత్రం అసోచి ఉంటుంది. మూడు రోజుల పైన సాగుతుంది క్రియా అనుకున్నప్పుడు మాత్రం వారికి అసుచి లేదు, ఇంట్లోకి రావచ్చు ఇంట్లో ఉండేటటువంటి వస్తువులు ముట్టుకోవచ్చు, అంతవరకే తప్ప దేవతా కార్యక్రమాల మీద అధికారం రాదు. శ్రావo ఎన్నాళ్ళు ఉంటుందో, అన్నాలో కూడా దేవతా కార్యక్రమాలకి పితృదేవతా కార్యక్రమాలకి మాత్రం దూరంగా ఉండాలి.