హనుమంతుని 12 నామాలు7 రోజులువరుసగా ఈ విధంగా చదవండిమీ కోరికలు తీరటాన్నిఎవరూ ఆపలేరు

ఈరోజు మనము హనుమాన్ 12 నామాల గురించి తెలుసుకుందాం. ఈ పన్నెండు నామాలను ఏడు రోజులు వరుసగా 11 సార్లు జపించాలి ఈ రోజు 12 నామాలను 11 సార్ల చొప్పున ఏడు రోజులు చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ తొలగిపోయి దీర్ఘాయుష్షు ప్రాప్తిస్తుంది సుఖవంతమైన జీవితం లభిస్తుంది.

మీరు ఈ నామాలను చదివితే చాలు మీ ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోతాయి మీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది, మీ చుట్టుపక్కల ఎక్కువగా నెగటివ్ ఎనర్జీ ఉన్నా చెడ్డ వ్యక్తుల వల్ల మీరు భయపడుతున్నా మీకు అనిపిస్తుంది ఎవరో మాకు హాని చేయాలని అనుకుంటున్నారని.

మీరు ఇలా చేసినట్లు అయితే అటువంటి హానికర సంఘటనలు జరగకుండా ఉంటాయి. ఈరోజు మనము హనుమంతుని 12 నామాలను ఏ సమయంలో జపించాలి అనే విషయాలను తెలుసుకుందాం. ఆ పన్నెండు నామాలు ఏమిటంటే ఓం హనుమాన్ఓం అంజనీ సుతా ,ఓం వాయు పుత్ర,ఓం మహాబలః,ఓం రామేష్టహా,ఓం ఫల్గుణ సఖహ,ఓం పింగాక్షో,ఓం అమిత విక్రమః,ఓం ఉదదిక్రమనశ్చైవ,ఓం సీతా శోక వినాశకః,ఓం లక్ష్మణ పాత్ర దాత,ఓం దశగ్రీవస్య దరహా

ఈ నామాలను చదవడానికి రూల్స్ ఏమీ లేవు టైం మాత్రo రోజు ఒకే టైం లో చదివినట్లయితే మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఈ నామాలను ఉదయం చదవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి అంటే మీరు ఉదయం నిద్రలేవగానే ఈ భూమి మీద పాదం కింద పెట్టకముందే ఈ నామాలను జపించడం వల్ల మీకు ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి, మీకు ఎప్పటి నుండో తీరని కోరికలు ఏమైనా ఉంటే అవి కూడా తీరుతాయి, మీ మనసులోనే కోరిన కోరిక అయినా సరే ఉదయం పూట ఇలా చేయడం వల్ల మీ కోరిక నెరవేరుతుంది మీకు దీర్ఘాయుష్షు అనేది లభిస్తుంది.

స్నానం చేయకుండా కూడా ఈ నామాలను జపించవచ్చు ఈ నామాలను 11 సార్లు చదవాలి 12 నామాలను ఏడు రోజుల పాటు చేయాలి, మీరు 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో ఈ నామాలను జపించినట్లయితే మీకుఏమైనా ధనపర సమస్యలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. మీరు సాయంత్ర కాలంలో నాలుగు గంటల నుండి 7 గంటల మధ్యలో చేసినట్లయితే ఇంట్లో అందరూ సుఖసంతోషాలతో ఉంటారు. మీ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్న రిలేషన్ షిప్ లో ప్రాబ్లమ్స్ ఉన్నా సంతానం కలగక పోయినా మీరు మీ కోరికను చెప్పుకునీ ఈ పన్నెండు నామాలను 11 సార్లు జపించి నట్లయితే మీ ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది.

నాలుగు గంటల నుండి 7 గంటల లోపు ఎప్పుడైనా ఇలా చేయవచ్చు మీరు శత్రువులను జయించాలి అని అనుకుంటున్నట్లు అయితే మీరు రాత్రి నిద్రించడానికి ముందు ఈ నామాలను జపించండి,మీ శత్రువు పై విజయాన్ని తప్పకుండా సాధిస్తారు. ఈ నామాలను ఏ సమయంలో చేసినా సరే మీరు 7 రోజుల వరకు వరుసగా చేయాలి 12 నామాలను 11 సార్లు ఏడు రోజులు ఖచ్చితంగా చేయాలి ఇదే దీని యొక్క నియమము. ఈ రోజున ఒక తావీదు గురించి తెలుసుకుందాం, ఈ తావీదు మీకు ఒక రక్షణ కవచంలా ఉంటుంది,మీరు భోజ పత్రం ని తెచ్చుకోండి ఆ భోజ పత్రం మీద ఎరుపు రంగు పెన్నుతో ఈ హనుమంతుని యొక్క 12 నామాలను రాయండి ఆ తర్వాత భోజపత్రాన్ని రౌండ్ గా ఫోల్డ్ చేసి ఆ తావీదులోకి పెట్టండి, ఇలా పెట్టిన తర్వాత ఆ తావీదుని నలుపు రంగు గుడ్డలో చుట్టండి, ఇలా చుట్టిన తర్వాత నలుపు రంగు మొలతాడు తో లేదా నల్లదారంతో మీరు ఆ తావీదు మెడలో కట్టుకున్నట్లు అయితే మీకు అది ఒక రక్షణ కవచంలా ఉంటుంది. మెడలో కట్టుకోలేని వారు చేతికి కట్టుకోవచ్చు లేదా మీ జేబులో గాని పర్సులో కానీ ఉంచుకున్న కూడా అది మీకు ఒక రక్షణ కవచంలా ఏర్పడుతుంది మీకు ఎప్పుడూ రక్షణ కలిగిస్తుంది.